అన్వేషించండి

Jawan Movie: షారుక్ ఖాన్‌కు థాంక్యూ చెప్పిన బీజేపీ, ఎందుకంటే !

Jawan Movie: షారుక్ ఖాన్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. ఈ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు అస్త్రంగా మారింది.

Jawan Movie: షారుక్ ఖాన్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ మూవీ ‘జవాన్’. ఈ సినిమా దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ పార్టీల మధ్య విమర్శలకు అస్త్రంగా మారింది. తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సినిమాను విమర్శనాస్త్రంగా మార్చుకుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రతిబింబిస్తుందని విమర్శలు చేస్తోంది.  జవాన్ సినిమా కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన అవినీతి, అక్రమాలతో కూడిన పాలనను బహిర్గతం చేస్తుందని సటైర్లు వేసింది.

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా జవాన్ పోస్టర్ షేర్ చేస్తూ.. ‘జవాన్ మూవీ 2004 నుంచి 2014 వరకు అవినీతి, విధాన పక్షవాతంతో నిండిన కాంగ్రెస్ పాలనను బహిర్గతం చేసింది. ఇందుకు మేము షారుఖ్ ఖాన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ‘విషాద రాజకీయ గతాన్ని’ ప్రేక్షకులందరికీ ఈ చిత్రం గుర్తుచేస్తోందని ఆయన పేర్కొన్నారు.

భాటియా అంతటితో ఆగలేదు. పాత స్కాములను తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అవినీతిమయం అన్నారు. 2009 - 14 మధ్య యూపీఏ-II హయాంలో జరిగిన CWG, 2G,  బొగ్గు కుంభకోణాలను ఎత్తి చూపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక 'క్లీన్ రికార్డ్'ను నిర్వహించిందని పేర్కొంది. గత తొమ్మిదిన్నరేళ్లలో ఎలాంటి స్కామ్‌లు జరగలేదన్నారు.

సినిమాలో షారుక్ ఖాన్ చెప్పినట్లుగా ‘మేము చిన్నవాళ్లం, మేము మా ప్రాణాలను దేశం కోసం పణంగా పెట్టగలం. కానీ దేశాన్ని అమ్మే మీలాంటి వారికి కాదు’ అన్నారు.  కాంగ్రెస్ హయాంలో కనీసం 1.6 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఎన్‌డీఏ ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు చేసిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా 11 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2.55 లక్షల కోట్లు జమ చేశామని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ తన డిఫాల్ట్ స్నేహితులకు రుణాలు మంజూరు చేసిందని, పరారీలో ఉన్న విజయ్ మాల్యా మునుపటి రుణాలను తిరిగి చెల్లించకపోయినా, మరింత రుణం అందించినందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జీకి ధన్యవాదాలు అంటూ గౌరవ్ భాటియా సటైర్లు వేశారు. షారుక్ ఖాన్ గతంలో, ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా జవన్ సినిమా తీశారని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

జవాన్ స్టోరీ ఏంటంటే?
అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ చిత్రం తండ్రీ కొడుకుల కథ చుట్టూ తిరుగుతుంది. షారుక్ ఖాన్ డ్యూయల్ రోల్ చేశారు. సైనికుడిగా, రొమాంటిక్ హీరోగా, రాబిన్ హుడ్ స్టైల్ హీరోగా నటించారు. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల మధ్య ఉన్న బంధాన్ని వివరించేలా సినిమా ఉంటుంది. రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలు ఎలా ప్రభావితం చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తుందో ఈ చిత్రంలో ఉంటుంది. 

బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం, అవినీతి, ప్రభుత్వ ఉదాసీనత, రైతుల ఆత్మహత్యలు, ఆక్సిజన్ కొరత కారణంగా ఆసుపత్రిలో చనిపోతున్న పిల్లలు, సైనిక ఆయుధాలు, నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు వంటి అనేక తీవ్రమైన సమస్యలను ఎత్తిచూపింది. ఓ కీలక సన్నివేశంలో సామాన్య ప్రజలు మేలైన, ఉత్తముడైన నాయకుడిని ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకోవాలని చెబుతారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget