Bandi Sanjay Vs KTR : ట్విట్టర్ టిల్లూ టెన్షనొద్దు యోగా చెయ్ - బండి సంజయ్ సెటైర్ ఎవరి మీద ?
కేటీఆర్‌పై ట్విట్టర్ టిల్లూ అంటూ నిక్ నేమ్ పెట్టి సెటైర్లు వేస్తున్నారు బండి సంజయ్ కుమార్. కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చే వరకూ యోగా చేయాలని సలహా ఇచ్చారు.
Bandi Sanjay Vs KTR : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ టిల్లూ హ్యాష్ ట్యాగ్‌తో అదే పేరుతో ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. "దొంగలు భయపడుతున్నట్టు కనిపిస్తుంది.. మరీ ముఖ్యంగా మన ట్విట్టర్ టిల్లులో ఎప్పుడూ లేనంత భయం కనిపిస్తుంది. మీ ఆందోళనకు యోగా చాలా మంచిది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ నీ ఇంటి తలుపులు తట్టే వరకూ గాలిని లోపలికి పీలుస్తూ, బయటకు వదులుతూ ప్రాణాయామం చెయ్ ట్విట్టర్ టిల్లు" అంటూ కేటీఆర్ టార్గెట్‌గా బండి సంజయ్ ట్వీట్ చేశారు.
The signs of fear among robbers especially Twitter Tillu, is at all time high...
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 22, 2022
Yoga is good for people experiencing anxiety... Suggest to inhale and exhale until investigative agencies knock your door.#TwitterTillu
సాధారణంగా బండి సంజయ్ ట్వీట్స్ తెలుగులోనే ఉంటాయి. ఇంగ్లిష్‌లో దాదాపుగా ఉండవు. కానీ ట్విట్టర్ టిల్లూ ట్వీట్ మాత్రం ఇంగ్లిష్‌లో ఉంది. ఇందులో ఎవరి పేరు చెప్పలేదు కానీ.. ఆయన నేరుగా కేటీఆర్‌ను టార్గెట్ చేశారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల కిందట బండి సంజయ్ సిద్దిపేటలో పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్‌పై కూడా ఈడీ, సీబీఐ కేసులు ఉంటాయని ప్రకటించారు. ఈ ప్రకటనపై కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్‌ను ఈడీ చీఫ్‌గా నియమించినందుకు కృతజ్ఞతలని .. సెటైరిక్‌గా ప్రధాని మోదీకి ట్యాగ్ చేశారు.
Dear @PMOIndia
— KTR (@KTRTRS) July 22, 2022
Thanks for appointing your BJP state president Sri BS Kumar as the Chief of ED also 👏👏
Now we realise double engine that runs this country is actually “Modi & ED” #ModiGovt pic.twitter.com/IlyOcbh9ty
ఈ అంశంపైనే బండి సంజయ్ స్పందించినట్లుగా భావిస్తున్నారు. కేటీఆర్ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఈ కారణంగా ఈ కారణంగా ట్విట్టర్ టిల్లూ అని నిక్ నేమ్ పెట్టారని భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ట్విట్టర్ పాలిటిక్స్ కూడా కీలకమయ్యాయి. సోషల్ మీడియా రాజకీయ పార్టీల ప్రచారంలో కీలకం కావడంతో ట్విట్టర్ ద్వారానే ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఏజెన్సీలు వారి వారి ట్విట్టర్ హ్యాండిల్స్‌ను చూస్తూంటాయి. ఈ కారణంగా ట్వీట్లు కూడా భిన్నంగా బయట మాట్లాడేదానికి భిన్నంగా వస్తూంటాయని భావిస్తున్నారు.