అన్వేషించండి

YS Sharmila: 'ఆ విషయంలో జగన్‌కు ఆస్కార్ ఇవ్వాలి' - అదానీ వల్ల లబ్ధి పొందలేదని బైబిల్‍పై ప్రమాణం చేయాలంటూ షర్మిల సవాల్

Andhra News: మాజీ సీఎం వైఎస్ జగన్ అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ మీద ప్రమాణం చేయాలంటూ వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. అదానీతో ఒప్పందం అంతర్జాతీయంగా ఓ చరిత్రని విమర్శించారు.

YS Sharmila Sensational Comments On Ys Jagan: అబద్ధాలను అందంగా అల్లడంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌కి (YS Jagan) ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఎద్దేవా చేశారు. అదానీతో జగన్ ఒప్పందం రాష్ట్రంలోనే కాదు.. అంతర్జాతీయంగా చరిత్రే అని విమర్శించారు. రూ.1,750 కోట్లు సీఎంకు ముడుపులు ఇవ్వడం రికార్డని అన్నారు. ఈ వ్యవహారంలో సన్మానాలు, అవార్డులు కోరుకొనే ముందు జగన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 'అదానీ వద్ద గుజరాత్ యూనిట్ ధర రూ 1.99 పైసలకే కొంటే.. అదే కంపెనీ నుంచి 50 పైసలు ఎక్కువ పెట్టి, రూ.2.49 పైసలకు కొన్నందుకు మీకు సన్మానాలు చేయాలా ? అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా ?' అని ప్రశ్నించారు.

'దమ్ముంటే సమాధానం చెప్పండి'

'మీ హయాంలోనే ఇంధన శాఖ చెప్తుంటే ఎటువంటి ఛార్జీలు లేవని చెప్పే మీ మాటలు శుద్ధ అబద్ధం కాదా.?. ఓ సీఎంను ఒక వ్యాపారవేత్త అధికారికంగా కలిస్తే గోప్యత పాటించడం దేశంలో ఎక్కడైనా ఉందా.?. దమ్ముంటే జగన్ గారు సమాధానం చెప్పాలి. అదానీ కోసం అన్ని టెండర్లు రద్దు చేయడం చరిత్ర. ఓ వ్యక్తి స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపడం చరిత్ర. ప్రపంచం మొత్తం ఇప్పుడు మీ అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర. భూగోళం అవినీతిపరుల జాబితాలో మీ పేరు చేరడం మీకు పెద్ద చరిత్ర. అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన రిపోర్టులో నాపేరు ఎక్కడుందని బుకాయించే జగన్ గారు. ఏపీ చీఫ్ మినిస్టర్ అంటే ఆనాడు మీరు కారా.. ఆ కుర్చీలో మీరు కాకుండా మిమ్మల్ని నడిపించే వాళ్లు కూర్చున్నారా..? ఇదేం ఆఫ్ బేస్ట్ నాలెడ్జ్ ? ఇదేం అహంకారపు తిరస్కరణ సమాధానం..? మీరు అవినీతి చేశారని చెప్పింది మేము కాదు. అమెరికా అధికారిక దర్యాప్తు సంస్థలు FBI, SEC స్వయంగా రిపోర్ట్ ఇచ్చాయి.' అని షర్మిల పేర్కొన్నారు.

'అదానీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు' 

'సోలార్ పవర్ ఒప్పందాల్లో రూ.1750 కోట్లు ఏపీ సీఎంకు ఇచ్చారని తమ దర్యాప్తులో కుండబద్దలు కొట్టాయి. ముడుములు ముట్టాకే ఒప్పందాలు చేసుకున్నారని ఓ వంద పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వం ఎక్కువ ధరకు PPL చేసుకుందని.. రూ.35 వేల కోట్ల భారం వేసిందని చెప్పే మీరు..అధికారంలోకి వచ్చాక  గాడిదలు కాశారా ? టెండర్లు రద్దుతో ఎందుకు సరిపెట్టారు.? ఎందుకు విచారణ జరిపించలేదు ? లాంగ్ స్టాండ్ ఒప్పందాలతో నష్టమని తెలిసి.. అదానీకి 25 ఏళ్లు రాష్ట్రానికి తాకట్టు పెట్టినప్పుడే మీకెంత ముట్టాయో అర్ధమవుతోంది. గంగవరం పోర్టును అడ్డికి పావుసేరు లెక్కన రూ.640 కోట్లకే అమ్మినప్పుడే మీ ముడుపుల బంధం ఏపాటిదో తెలిసిపోయింది. రాష్టాన్ని బ్లాంక్ చెక్కులా అదానీకి కట్టబెట్టినప్పుడే మీ వాటాల సంగతి తేలిపోయింది. నిజంగా అదానీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి లేకుంటే, రహస్య ఒప్పందాలు జరగకుంటే, అమెరికా దర్యాప్తు సంస్థలు మీ మీద తప్పుడు ఆరోపణలు చేసి ఉంటే, మీరు అదానీ వల్ల ఆర్థికంగా లబ్ధి పొందలేదు అని బైబిల్ మీద ప్రమాణం చేయండి.' అంటూ జగన్‌కు సవాల్ విసిరారు.

Also Read: Kakinada Pawan Kalyan: కాంప్రమైజ్ అయిపోయారా - రైస్ స్మగ్లింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం - కాకినాడ పోర్టులో తనిఖీలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget