Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. కానీ అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
Andhra coalition parties committee has been formed For Leaders Joinings : వైఎస్ఆర్‌సీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వీరంతా కూటమి పార్టీల్లోకి చేరేందుకు రెడీ అవుతున్నాయి. అయితే వైసీపీని ఖాళీ చేయాలన్న ఆత్రుతో వచ్చే వారందర్నీ తమ పార్టీల్లో చేర్చుకునేందుకు సిద్ధంగా లేరు. దానికో పద్దతి పెట్టుకున్నారు. పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపిన నేతల విషయంలో కూటమిపార్టీలన్నీ కలిపి ఏకాభిప్రాయానికి వస్తేనే తీసుకుంటున్నారు. అందు కోసం కూటమిలోని మూడు పార్టీలో ఐదుగురు కీలక నేతలతో కమిటీని నియమించుకున్నట్లగా తెలుస్తోంది.
కూటమి పార్టీలకు వైసీపీ నేతల నుంచి దరఖాస్తులు
అధికారంలో ఉన్న పార్టీలోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలం అవుతారని కాకపోయినా ఇతర పార్టీలు బలహీన అవుతాయన్న కారణంతో అయినా నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావుడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి జగన్ బంధువు కూడా దూరమైపోయారు.ఆయన జనసేనలో చేరుతున్నారు. సామినేని ఉదయభాను కూడా చేరిక విషయం ప్రకటించారు. వీరు హఠాత్తుగా చేరలేదు. వీరి చేరికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే బయటపడ్డారు. ఇంకా చాలా మంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు.
నెయ్యి కాంట్రాక్టర్‌ను మార్చడంతోనే అసలు సమస్య - తిరుపతి లడ్డూ ప్రసాదంలో అపచారం అక్కడే జరిగిందా ?
చేరికలకు కూటమిలో ఓ కమిటీ - గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే !
కూటమి పార్టీలు తమ పార్టీల్లోకి వచ్చే వారందర్నీ తీసుకోవాలని అనుకోవడం లేదు. మూడు పార్టీలకు ఇబ్బందికరం కాకుండా ...వైసీపీని బలహీనం చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ మొత్తం బాలినేని మీదనే ఆధారపడి ఉంది. ఆయన పోతే ఇక బలమైన నాయకుడే ఉండరు. ఈ కోణంలో వెంటనే ఆయన దరఖాస్తుకు ఆమోదం లభించింది. సామినేని ఉదయభానుకు కూడా అలాగే గ్రీన్ సిగ్నల్ లభించింది. టీడీపీ నేతల్ని బూతులు తిడితే మంత్రి పదవి వస్తుందని ఆయనకు పోటీ పెట్టినప్పుడు కూడా పరుషంగా మాట్లాడలేకపోయారు ఉదయభాను. ఈ కారణంగా వైసీపీలో అన్యాయం జరిగింది. పవన్ పై అతిగా స్సందించకపోవడంతో ఇప్పుడు జనసేనలోకి ఎంట్రీ వచ్చింది. కానీ ఇంకా చాలా మంది నేతల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు.
తిరుమల లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వు కన్ఫామ్, వారిపై కఠిన చర్యలు - చంద్రబాబు
పార్టీలకు సమస్య అయ్యే వారిని దూరం పెడుతున్న కూటమి
చేరికలకు వచ్చే వారిలో కేసుల నుంచి బయటపడటానికి కొందరు.. ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కొందరు.. అలాగే కోవర్టులుగా కూడా కొందరు వచ్చే అవకాశం ఉంది. అందుకే మూడు పార్టీల్లోని ఐదుగురు నేతల కమిటీ అన్ని విషయాలను కూలంకుషంగా పరిశీలించిన తర్వాతనే నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. విడదల రజనీ ఫలితాలు వచ్చినప్పటి నుండి అయితే బీజేపీ లేకపోతే జనసేన అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆమెపై చిలుకలూరిపేటలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలాంటి నేతలు ఓ ఇరవై మంది వరకూ ఉంటారని.. పరిస్థితుల్ని బట్టి కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి చేరికల విషయంలోనూ మూడు పార్టీల అంగీకారం మేరకే ముందుకెళ్తున్నారు.