అన్వేషించండి

Anantapur TDP Kalva : ఏకతాటిపైకి అనంత టీడీపీ నేతలు - చంద్రబాబు టూర్ తర్వాత మారిన సీన్ !

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఏకతాటిపైకి వచ్చారు. ఇప్పటి వరకూ గ్రూపు గొడవతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు రూటు మార్చారు.

Anantapur TDP Kalva : ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులలో పరివర్తన కనిపిస్తోంది . అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించిన తర్వాత ఈ మార్పు  కనిపిస్తోంది.  ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలలో నాయకుల మధ్య కీచులాట ఉండేది. గత వారం లో నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహణలో భాగంగా అనంతపురంలో ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించి ఉపదేశం చేశారు. దీంతో నాయకులలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా తాజా పరిణామాలు నిలుస్తున్నాయి. 

ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విసిరిన సవాలును స్వీకరించి రాయదుర్గం కి వెళుతున్న కాలువ శ్రీనివాసులును మార్గ మధ్యలో ఆత్మకూరు మండలం వడ్డుపల్లి దగ్గర  పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం కి వెళితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఆయనను నిర్బంధించారు. దీంతో సమాచారం అందుకున్న జిల్లా నలుమూలల నుంచి తెలుగుదేశం నాయకులు మద్దతుగా నిలిచి పోలీసులు,  ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అగ్ర నాయకులలో ఒకరైన పయ్యావుల కేశవ్ లాంటి నాయకులు కాలువను కలిసి సంఘీభావం తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం కాలువకు మద్దతుగా నిలిచారు. ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే వీరి మధ్య ఒకరికొకరు బాసటగా నిలవడం వెనుక అధినేత మంత్రాంగం బాగా పని చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది. 

గత కొన్ని ఏళ్లుగా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానాన్ని దీపక్ రెడ్డికి కేటాయించాలన్న విషయంలో వీరి మధ్య దూరం పెరిగింది . అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న  సమయంలో అభిప్రాయభేదాలు పక్కనబెట్టి ఐక్యతా రాగం ఆలపించడం ఇప్పుడు కార్యకర్తలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సింగనమల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బండారు శ్రావణిని బాధ్యతల నుంచి తప్పించి ద్విసభ్య కమిటీ పేరుతో ఆలం నరసానాయుడు , ముంటి మడుగు కేశవరెడ్డి లను నియమించారు . అప్పటి నుండి బండారు శ్రావణి కి కాలువకి మధ్య దూరంగా పెరిగింది. ఈ నేపథ్యంలో కనీసం పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనకుండా ఆమె కినుకు వహించారు. 

అయితే ప్రస్తుతం కాలువను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో బండారు శ్రావణి ఆయనను కలిసి తన సంఘీభావాన్ని తెలిపింది. ఇలా నాయకులందరూ దూరంగా ఉన్న నాయకులందరూ కాలువ కు మద్దతు పలికి చేరుతుండడంతో తో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు హవా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శించుకోడం లాంటివి తన దృష్టికి వస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హెచ్చరించిన దరిమిలా అనంతపురం జిల్లాలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం కొసమెరుపు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget