అన్వేషించండి

Bandi Sanjay Interview: 13 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు- ఏబీపీ దేశంతో బండి సంజయ్ .

కేసీఆర్ ఏ నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు బండి సంజయ్. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మునుగోడు పరిస్థితి మిగతా చోట్ల ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర నల్గొండజిల్లాలో కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు. 

ABP Desam : బండి సంజయ్‌ గారు మూడో విడత పాదయాత్రలో చాలా జోష్‌తో కనిపిస్తున్నారు ?

బండి సంజయ్‌ : మొదటి విడతలో జోష్‌లో ఉన్నాం. రెండో విడతలో జోష్‌ ఉంది. మూడో విడతలో రెట్టింపు జోష్‌తో  ఈ ప్రజాసంగ్రామయాత్ర కొనసాగుతోంది. ఎక్కడికి పోయినా..ఏ గ్రామానికి పోయినా..ఏ మండలానికి పోయినా ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది.

ABP Desam : పాదయాత్రలో ఫస్ట్‌ విడత, రెండో విడత, మూడో విడతకి ఏంటి తేడా ? ఎలా ఉంది ?

బండి సంజయ్‌ : ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన సమస్యలు. ముఖ్యంగా ఈ జిల్లాలో గొప్పతనం ఏంటంటే ఇంట్లో కుటుంబసభ్యులందరూ కూడా భారతీయ జనతాపార్టీ కార్యకర్తలే. వాళ్ల భర్త బీజేపీ అయితే శ్రీమతి కూడా పార్టీ కోసం పని చేస్తున్నారు. నేనే ఆశ్చర్యపోతున్నాను. ఎంత పవర్‌ ఫుల్‌ అంటే ఈ ప్రాంతం నల్గొండ జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా. రజాకార్లను, నిజాంని తరిమితరిమి కొట్టిన జిల్లా ఇది. మరి ఆ జిల్లాలో పర్యటిస్తుంటే మొత్తం పులకరించిపోతున్నాం. కార్యకర్తలు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. బట్‌ ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ముఖ్యంగా ఫ్లోరైడ్‌ సమస్య. ఇక్కడ పూర్తిగా పొల్యూషన్‌. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. బతకలేని పరిస్థితి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన సమస్యలు వస్తా ఉన్నాయి.

ABP Desam : నల్గొండ జిల్లాలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీజేపీకి బలం లేదన్న వాదన ఉంది. మొన్న మహబూబ్‌ నగర్‌, ఇప్పుడు నల్గొండ రేపు రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాల్లో మీరు ఏవిధంగా పార్టీని బలోపేతం చేయబోతున్నారు ?

బండి సంజయ్‌ : భారతీయ జనతాపార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు అన్నది వాస్తవం కాదు. గతంలో బీజేపీ పట్టణాలకే పరిమితం గ్రామాల్లో లేదన్నారు. నేనొక పార్లమెంటు సభ్యుడిని. ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు ఓట్లేసి గెలిపించినారు అంటే గ్రామాల్లో పార్టీ ఉన్నట్లే కదా. ధర్మపురి అర్వింద్‌ గెలిచారు అంటే అక్కడ పార్టీ ఉన్నట్లే కదా! సోయం బాబురావుది పూర్తిగా గ్రామీణ వాతావరణం, దుబ్బాక, హుజూరాబాద్‌లలో కూడా  గ్రామీణ వాతావరణమే అక్కడ కూడా గెలుపు బీజేపీదే. కావాలనే కొందరు ప్లాన్‌ ప్రకారం భారతీయజనతాపార్టీ నగరాలకే పరిమితం, గతంలో అగ్రవర్ణాల పార్టీ అన్న విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు పేదలపార్టీ అయ్యింది. కొంతమంది వ్యక్తులు, కొన్నిపార్టీలు ప్లాన్‌ ప్రకారమే బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

పాలమూరులో బీజేపీ ఎక్కడుంది అన్నారు. ఆలంపూర్‌లో బహిరంగ సభ పెడితే అసలు కార్యకర్తలు, ప్రజలు వస్తారా అని హేళనగా మాట్లాడినారు. అయితే పాలమూరులో జరిగిన అన్ని బహిరంగసభలు విజయవంతం అయ్యాయి. ప్రతీ గ్రామం, ప్రతీ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి బాధలు, కష్టాలను పంచుకున్నారు. మేము ప్రజల కష్టాలను తెలంగాణ సమాజానికి తెలిసేలా చేసినాము. అన్ని స్థానిక సమస్యలపై స్పందించాము. అంతేకాదు భరోసా కూడా కల్పించాము. ఒక ఆత్మవిశ్వాసం కల్పించినాము. మోదీ నాయకత్వానికి అవకాశం ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆశ్వీరదించారు.

ABP Desam : గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందని మీరు చెబుతున్న మాటల్లో ఎంత వాస్తవం ఉంది ?

బండి సంజయ్‌ : మీరు చూస్తున్న వీరంతా స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలే. బీరు-బిర్యానీ ఇస్తే నా వెంట పట్టుమని 10మంది కూడా ఉండరు. అవి తినేసి వెళ్లిపోతారు. ఇక డబ్బులిస్తే తీసుకొని పోతారే కానీ నా వెంట ఎవరూ రారు. ఇక్కడ ఉన్నవారిలో ఎవరూ నాయకులు కానీ, కార్యకర్తలు, రైతులు కానీ లేరు. వీళ్లందరూ స్వచ్ఛందంగా వచ్చినవాళ్లే. ఇంతకుముందు రచ్చబండ మీరు చూసినారు కదా ! వాళ్లందరూ సమస్యలతో తల్లడిల్లుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి, కనీసం సమస్యల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమంత్రి, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న పేదలకు భరోసా కల్పించి ఒక ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌కి, ప్రగతిభవన్‌కి పరిమితమయ్యారు కాబట్టి  ఒక బాధ్యతాయుతపార్టీగా  మేము ప్రజల వద్దకు పోతున్నాం. ఏసీ రూముల్లో కూర్చోకుండా నేరుగా ప్రజల దగ్గరకే వెళ్తూ వారి సమస్యలను తెలుసుకోవడం, భరోసా కల్పించడం చేస్తున్నాము కాబట్టే ప్రజలు మావెంట వస్తున్నారు.

ABP Desam : మునుగోడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజనామా చేసి మీ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గంలో మీ పాదయాత్ర  కూడా కొనసాగుతోంది. దీని ప్రభావం ఏ మేర ఉండబోతోందని మీరు భావిస్తున్నారు ?

బండి సంజయ్‌ : రాజగోపాల్‌ రెడ్డి మా కోసం మా సమస్యల పరిష్కారం కోసం రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఉద్యమం కోసం ఎలా అయితే రాజీనామా చేస్తే ప్రజలు ఆదరించారో, భుజానెత్తుకొని తిరిగారో రాజగోపాల్‌ రెడ్డి కూడా మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నానని స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏ నియోజకవర్గ అభివృద్ధికి నిధులిచ్చే పరిస్థితి లేదు. బీజేపీతోపాటు ఇతర పార్టీల నియోజకవర్గాలకు నిధులిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలున్న నియోజకవర్గాలకు సైతం కెసిఆర్‌ నిధులు ఇవ్వడం లేదు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి ముఖం మీద ఓట్లు పడవు, కారు గుర్తు మీద ఓట్లు వేయరు, మా నియోజకవర్గానికి ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వలేదు, మేము ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగాలి అని , ఏ మొహం పెట్టుకొని తిరగాలి అని చెప్పి వాళ్ల రాజకీయభవిష్యత్‌ గురించి వాళ్లు ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. అందుకే మునుగోడు లాంటి పరిస్థితులే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొంతపార్టీ శాసనసభ్యులు తిరగబడే పరిస్థితి వస్తుంది. అంతేకాదు వాళ్లే ప్రజలను కలిసి ప్రజల ద్వారా విజ్ఞప్తులు స్వీకరించి ఉపఎన్నికలు కోరి తెచ్చుకునే పరిస్థితి  తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.

ABP Desam : ఎంతమంది టీఆర్‌ ఎస్‌ నేతలు బీజేపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ?

బండి సంజయ్‌ : మాకున్న సమాచారం ప్రకారం 12-13మంది ఉన్నారు. వాళ్లని చూసి మిగిలిన వారు కూడా  తమ రాజకీయ భవిష్యత్‌ని ఆలోచించుకొని మాతో అడుగులు వేస్తున్నారు. ఒక నాయకుడిని నమ్ముకొని ముందుకు పోవాలంటే ఆ నాయకుడిపై ప్రజల్లో విశ్వాసం ఉండాలి. ఆ నాయకుడు ప్రజల కోసం పని చేసినప్పుడు, ఆ నాయకుడు ప్రజలను కలిసినప్పుడు, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసినప్పుడు మాత్రమే ఆ నాయకుడిని నమ్ముకొని ఇతర నాయకులు వస్తారు, కార్యకర్తలూ వస్తారు. అదే ఆ నాయకుడు విశ్వాసఘాతకుడు అయినప్పుడు, ఆ నాయకుడు ఒక కుటుంబానికే పరిమితమైనప్పుడు, అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలను దండుకొని కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించి, కేంద్రం  సంక్షేమ పథకాలు నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే  ప్రజల విశ్వాసం, నమ్మకం, అభిమానం కోల్పోయినప్పుడు ఆ నాయకుడిని నమ్ముకొని కింది నాయకులు ఎలా పోతారు? 

ABP Desam : టీఆర్‌ఎస్‌ నేతలు తప్పు తెలుసుకొని బై ఎలక్షన్స్‌కి వెళ్తే ప్రజలు అంగీకరిస్తారని మీరు భావిస్తున్నారా ?

బండి సంజయ్‌ : రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబాన్ని చూసి అసహ్యించుకుంటున్నారు, ఛీత్కరించుకుంటున్నారు. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ ఓ కుటుంబం రాజ్యమేలుతోంది. ఒక కుటుంబం వేల కోట్ల రూపాయలు సంపాదిస్తోంది. ఇవాళ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. అభివృద్ధికి నిధులు ఇస్తలేరు. శ్రీలంకలో ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా  శ్రీలంకలాగా ఉంది. జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వంలేదు. 9వ తారీఖు అయినా ఇప్పటివరకు జీతాలు రాలేదు. ఒక నెల 5వ తేదీన ఇస్తాడు..మేము ప్రశ్నిస్తే  కానీ జీతాలు రావు. నిజంగా భారతీయ జనతాపార్టీ కనుక ప్రశ్నించకపోతే 3నెలలకోసారి జీతాలు ఇస్తాడు ఈ సిఎం. జీతాలు ఇచ్చుడు పక్కకు పెట్టండి ఒక్కోరి పేరు మీద లక్షా 20వేల రూపాయల అప్పు జేసిండు. చిప్ప చేతికిచ్చి బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ. మరి దీన్ని ఎవరు కాపాడాలి ?

ABP Desam : అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ నేతలు తప్పు తెలుసుకుంటున్నారని మీరు చెబుతున్నారా ?

బండి సంజయ్‌ : తప్పు తెలుసుకున్నారు. మెల్లగమెల్లగా ఒక్కొక్కరు ఆలోచించడం స్టార్ట్‌ చేశారు. వాళ్ల సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం లేదు. ప్రతీసారి జిమ్మిక్కులే. బీజేపీ-టీఆర్‌ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్‌ ద్వారా ప్రచారం చేయించాడు. ఎమ్మెల్యేలు-మంత్రులు తిరగబడతారనే ఢిల్లీకి పోయి మోదీని కలిసి వస్తుంటాడు. ఇక్కడికి వచ్చి బీజేపీ మనం మనం ఒక్కటే అని పార్టీ నేతలకు చెబుతాడు. ఇప్పుడా మాటలు సొంత పార్టీ నేతలే నమ్మే స్థితిలో లేరు. కెసిఆర్‌ని వణికించేది ఒక్క బీజేపీనే అన్నది టీఆర్ఎస్‌ శ్రేణులకు కూడా అర్థమైంది. అందుకే ఇప్పుడు వారు ధైర్యంగా, సొంతగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చారు.

ABP Desam :  టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమైతే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మీ పార్టీ అందుకు సిద్ధంగా ఉందా ?

బండి సంజయ్‌ : మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమే. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉపఎన్నికలంటే ఓ సోకు. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. ప్రజలు ఆయన పాలన మీద దృష్టి పడొద్దు అనుకుంటే  జీతాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌ కార్డులు, రుణమాఫీ, ఉద్యోగాలు ఇలా అన్ని విషయాల్లో దృష్టి ప్రజల మీద పడొద్దు అనుకుంటే  ఇప్పుడు 6 నెలలు మునుగోడు.. మునుగోడు. ఇంతకు ముందు 6నెలల దుబ్బాక..దుబ్బాక ఇంకో 6నెలలు జీహెచ్‌ ఎంసీ మీద పోయింది. ఇంకో 6నెలలు హుజురాబాద్‌ మీద పోయింది ఇలా సగం కాలం ఉప ఎన్నికలతోనే గడిపేశాడు..ఫుల్‌ జల్సా చేశాడు. ఇప్పుడు ఈ 6నెలల టైమ్‌ పాస్‌ చేస్తాడు. పాలిటిక్స్‌ అంటేనే ఫుల్‌టైమ్‌ పాస్‌ రాష్ట్ర ముఖ్యమంత్రికి. బఠానీల లెక్కన తింటాడు వాటిని.

ABP Desam : మునుగోడులో మీ పార్టీ తరపున రాజగోపాల్‌ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతోంది ?

బండి సంజయ్‌ : ప్రజల మద్దతు ఎలా ఉందో నిన్న జరిగిన బహిరంగ సభ చూస్తేనే తెలిసిపోతుంది. ప్రజాసంగ్రామయాత్రలో ప్రజలను కలవడానికి వస్తే వేల మంది ప్రజలు ఆ బహిరంగ సభకు తరలివచ్చారు. యువత, మహిళలు, చిన్నా-పెద్దా అని తేడా లేకుండా  అందరూ వచ్చి స్వాగతం పలికారు. మునుగోడులో బీజేపీ చేస్తోన్న ఉద్యమం చేస్తుంటే ఇప్పుడే ముఖ్యమంత్రి ఫాంహౌజ్‌ నుంచి మెల్లగా ప్రగతి భవన్ కి వచ్చిర్రు. ప్రగతి భవన్‌ నుంచి రద్దు చేసిన ధర్నా చౌక్‌కి వచ్చిర్రు. ఇప్పుడు రాష్ట్రం తిరిగిండు..మళ్లీ దేశం పట్టుకొని తిరుగుతున్నారు. మళ్లీ ఇక్కడ బీజేపీ గెలవకపోతే ముఖ్యమంత్రి తిరిగి ఫాంహౌజ్లో పడుకుంటారు. కాబట్టి ఈసారి ఎట్టిపరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీని గెలిపించాల్సిందే లేకపోతే ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం అహంకారం తలకాయకెక్కుతుందని భయపడుతున్నారు.

ABP Desam :  బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరని మీరు అనుకుంటున్నారు ? టీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్సా ?

బండి సంజయ్‌ : మా ప్రత్యర్థి టీఆర్‌ఎస్సే. అయినా అసలు కాంగ్రెస్‌ ఎక్కడుంది ? ఢిల్లీలోనే కాదు గల్లీలో కూడా లేదు. కాంగ్రెస్‌కి ఓటేస్తే టీఆర్‌ ఎస్‌కి వేసినట్లే కదా !

ABP Desam : టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చే నాయకులకు బీజేపీ రానున్న ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాట్లు చేస్తుంది ?  టిక్కెట్లు, పదవుల విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది ?

బండి సంజయ్‌ : ఓట్ల కోసమో, సీట్ల కోసమో, రాజకీయాల కోసమో పనిచేసే పార్టీ బీజేపీ కాదు. మోదీ నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ప్రజల కోసం పనిచేసే..ప్రజల్లో మంచి పేరున్న నాయకులు ఎవ్వరైనా సరే వారిని తప్పకుండా ఆహ్వానిస్తాం, సముచిత స్థానంతోపాటు గౌరవాన్ని కూడా ఇస్తాం.

ABP Desam :  మునుగోడులో రాజీనామా చేసిన వ్యక్తి ఓ ప్రతిపక్ష పార్టీ నుంచి మరో ప్రతిపక్ష పార్టీలోకి చేరారు. అలాంటి వ్యక్తిని మళ్లీ గెలిపిస్తే ఏమి అభివృద్ధి చేస్తారన్న విమర్శలున్నాయి. దీనికి మీరేమంటారు ?

బండి సంజయ్‌ : ఇప్పుడు నిధులొస్తున్నాయి. ఇవాళే రూ. 10వేల కోట్లు ఇస్తున్నారు. ఏం చేస్తారు..డబ్బంతా ఇప్పటికే దుబాయ్‌, మస్కట్‌, ఇరాన్‌, లండన్, అమెరికా ఇలా చాలా చోట్ల పెట్టిర్రు. తీసుకొస్తుర్రు. ఇప్పుడు స్టడీ చేసిర్రు అట. ఓటుకి రూ.30వేలు పక్కా ఇస్తారట. నోట్లు ఇస్తే ఓట్లు వేస్తారని ఆయన అనుకుంటున్నారు. రోడ్లు మంజూరు చేసింరట. మొన్ననే గట్టుపల్లి మండలంగా ప్రకటించారు. నక్కలాగా వ్యవహరిస్తున్న కెసిఆర్‌కి ప్రజలు బుద్ధి చెప్పే టైమ్‌ వచ్చింది. దిండి ప్రాజెక్టు ప్రారంభినవ్‌..ఎందుకు పోయినవ్‌ ..ఎందుకు ఇస్తలేవ్‌. ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతలోని వారంతా మూసీనీళ్లతో కెసిఆర్‌కి స్నానం చేయించడానికి బక్కెట్లు, ట్యాంకర్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు కూడా కెసిఆర్‌తో తాగించడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఒక మండలానికి ఇంకో మండలానికి నడవలేని పరిస్థితి ఉంది. రోడ్ల గురించి అడుగుతారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. నీ ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలున్నాయి. మాకెందుకు లేవని అడగడానికి సిద్ధంగా ఉన్నారు. 8 ఏళ్లల్లో ఒక్కరికి కూడా పెన్షన్‌ లేదు. ఎందుకిస్తలేవని అడగడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదు ఎందుకని అడగడానికి రెడీగా ఉన్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ నేతలు వస్తే ప్రశ్నించడానికి రెడీగా ఉన్నారు.

ABP Desam : మునుగోడు ఉపఎన్నికని బీజేపీ సెమిఫైనల్‌ ఎలక్షన్స్‌గా భావిస్తోందా?

బండి సంజయ్‌ : మేము గ్రామస్థాయిలో జరిగే వార్డు మెంబర్ ఎన్నికని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాము. మా కార్యకర్తలు పోటీ చేసే ప్రతీ ఎన్నికని మేము సవాల్‌గా తీసుకుంటాము. చిన్న ఎన్నికలు, పెద్ద ఎన్నికలనే తేడా లేవు. ప్రతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు గెలవాలనే పట్టుదలతో కష్టపడతాం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget