అన్వేషించండి
In Pics: మంత్రి ఎర్రబెల్లి జోష్ మామూలుగా లేదు - చెట్టెక్కి కల్లు తీసి, తాగిన మంత్రి
జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి కి చెందిన చింతం వెంకన్న కూతురు, వావిలాలకు చెందిన ముత్తినేని కరుణాకర్ గారి కుమారుడి వివాహ వేడుకకు మంత్రి హాజరయ్యారు.

కల్లు తాగుతున్న మంత్రి ఎర్రబెల్లి
1/8

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం పాలకుర్తి నియోజకవర్గం లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు వివాహాలకు హాజరయ్యారు.
2/8

ఆయన చెట్టెక్కి మరీ తాటికల్లు తాగారు తాటి చెట్టు ఎక్కి స్వయంగా కల్లు తీశారు. తాను తీసిన కల్లును తాగి..వావ్ సూపర్ అంటూ కితాబిచ్చారు.
3/8

అనుకున్నదే తడువుగా నిచ్చెనతో గిరక తాటి చెట్టు ఎక్కారు. కల్లుకు కట్టిన లొట్టిని కిందకు దించారు. ఆ తర్వాత అందరూ తలా కొంచెం పంచుకుని తాగారు.
4/8

మూడేళ్ల క్రితం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గిరక తాటి మొక్కలను పంపిణీ చేశారు. అయితే మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేసిన గిరక తాటి మొక్కలు ఇప్పుడు పెరిగి పెద్దయి..కల్లు అందిస్తున్నాయి.
5/8

దీన్ని గమనించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను పంపిణీ చేసిన గిరక తాటి చెట్టు ఎక్కి కల్లు తీసి.. ఆ కల్లును తాగారు.
6/8

తాటి చెట్ల కంటే గిరక తాటి చెట్లు చిన్నవిగా ఉంటాయి. వంద అడుగుల తాటి చెట్లు ఎక్కడం కంటే 10 నుంచి 20 అడుగుల ఎత్తున్న గిరక తాటి చెట్లు ఎక్కడం ఈజీ
7/8

అందుకే తెలంగాణ ప్రభుత్వం గతంలో గౌడ లకు గిరకతాటి చెట్లను పంపిణీ చేసింది. సాధారణ తాటి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి పంట పెట్టిన 14 సంవత్సరాలకు గాని గీతకు రాదు.
8/8

కానీ బీహార్ రాష్ట్రానికి చెందిన గిరక తాటి చెట్లు 20 అడుగుల ఎత్తులో ఉండి కేవలం ఐదేళ్లకే గీతకు వస్తాయి. అలాగే 100 తాటికాయలు వరకు దిగుబడినిస్తాయి.
Published at : 11 May 2023 10:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion