అన్వేషించండి
From Hut to Hope: గుడిసె నుండి కొత్త భవనానికి - ఎలిశెట్టిపల్లె విద్యార్థుల్లో చిగురించిన ఆశలు
A New School for Elishettipalle : ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలో మొన్నటివరకూ పూడి గుడిసెలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వం కొత్త బిల్డింగ్ కట్టించి వారి ముఖాల్లో వెలుగులు నింపింది.
గుడిసె నుండి కొత్త భవనానికి - ఎలిశెట్టిపల్లె విద్యార్థుల ముఖంలో చిరునవ్వు
1/4

ఒకప్పుడు తాటి పలుచటి దిమ్మెల్లో, గాలికట్టిన గుడిసెల్లో చదువుకోవడం లాగ ఉండేది ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లె విద్యార్థుల దుస్థితి. వర్షం పడినా, ఎండకు తాళలేకపోయినా, తల్లిదండ్రుల ఆశలతో పిల్లలు స్కూల్‌కు వచ్చేవారు. ఆనాటి పరిస్థితులు చూస్తే ప్రతి మనసూ కలతకు గురవుతుందనడానికి ఈ ఫొటో నిదర్శనం.
2/4

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని మార్చింది. అడవుల్లో తిరిగిన మహిళ, గిరిజనుల పక్షపాతి అయిన తెలంగాణ మంత్రి సీతక్క పూరిగుడిసె కింద విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల కష్టాల్ని గమనించి, వారి సమస్యల్ని అర్ధం చేసుకుని పరిష్కారం చూపించారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లె పాఠశాల కోసం 15 లక్షల నిధులతో నూతన భవనాన్ని నిర్మించారు.
Published at : 13 Jul 2025 02:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















