అన్వేషించండి
Hyderabad: కేబీఆర్ పార్కులో పీకాక్ ఫెస్టివల్... ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

కేబీఆర్ పార్కులో పికాక్ ఫెస్టివల్
1/6

హైదరాబాద్ కేబీఆర్ పార్కులో పీకాక్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు.
2/6

హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో పీకాక్ ఫెస్టివల్ నిర్వహించారు. 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున (3 డిసెంబర్ 1998లో) కేంద్ర ప్రభుత్వం కేబీఆర్ పార్కును జాతీయ ఉద్యానవనంగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. సుమారు 360 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జంతు జాతులు ఉండటంతో, వాటిని పరిరక్షించటంలో భాగంగా నేషనల్ పార్కుగా ప్రకటించారు. అలాగే ఇక్కడ ఉన్న జంతువులు, పక్షి జాతుల్లో ఎక్కువగా జాతీయ పక్షిగా గుర్తించిన నెమలి ఉండటంతో, కేబీఆర్ జాతీయ ఉద్యానవనం ఏర్పాటుకు గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 3న అటవీ శాఖ పీకాక్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.
3/6

అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై పిల్లలకు అవగాహన, డ్రాయింగ్, పెయిటింగ్, స్నేక్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ
4/6

కేబీఆర్ పార్కుకు వచ్చే సందర్శకులకు, వాకర్స్ కు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ విరివిగా కనిపించే నెమళ్లే. ఈ ఏడాది జంతుగణనలో ఐదు వందలకు పైగా నెమళ్లు కేబీఆర్ పార్కులో ఉన్నట్లు నమోదు అయింది. వీటి సంరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా చిన్న పిల్లల్లో అడవులు, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అటవీ శాఖ ప్రతీ ఏటా నిర్వహిస్తోంది. వివిధ స్కూళ్ల నుంచి వచ్చిన విద్యార్థులను పికాక్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఫ్రెండ్న్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు నిర్వహించిన స్నేక్ షోలో వివిధ రకాల పాములు అవి వ్యవహరించే తీరును పిల్లలకు వివరించారు.
5/6

అడవులు, జంతువులకు సంబంధించిన డ్రాయింగ్, పెయింటింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, విజేతలకు అటవీ శాఖ అధికారులు బహుమతులను అందించారు. స్కూలు పిల్లలు పర్యావరణ అంబాసిడర్లుగా వ్యవహరించాలని, జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మనుగడ అని గుర్తించాలని కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ అన్నారు. ప్రతీ ఒక్కరిలో పర్యావరణ స్పృహ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అర్బన్ ఫారెస్ట్ పార్కులను (109) అభివృద్ది చేస్తోందని గుర్తు చేశారు.
6/6

పికాక్ ఫెస్టివల్ లో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
Published at : 03 Dec 2021 06:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion