AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్ష షెడ్యూల్ రెడీ! పూర్తి సాంకేతికతతో ప్రక్రియ చేపడుతున్న ప్రభుత్వం
AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 15 లేదా 21 నుంచి పదోతరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈసారి పూర్తి ప్రక్రియలో కీలక మార్పులు చేర్పులు చేస్తున్నారు.

AP 10th Class Exam Schedule: ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షలను మార్చి 15 లేదా 21 నుంచి నిర్వహించడానికి విద్యాశాఖ సన్నద్ధమైంది. ఈసారి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. పూర్తి సాంకేతికత వాడుకొని ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. పరీక్ష సెంటర్ నిర్ణయం నుంచి సిబ్బంది నియామకం వరకు అన్నింటినీ అమరావతి నుంచి చేపట్టనున్నారు.
2025-26 విద్యా సంవత్సరానికి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్ ప్రాక్టికల్స్‌కు, పండగలతో పదోతరగతి విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించనున్నారు. అందుకే మార్చి 16 లేదా 21 తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. 11 రోజుల పాటు జరిగే పరీక్షలకు ఆదివారం మినహా వేరే రోజు సెలవు రాకుండా ప్లాన్ చేస్తున్నారు.
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇవాళ రేపు విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పరీక్షల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సాఫీగా టెన్షన్ లేకుండా పరీక్షలు రాసుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. సెంటర్‌కు సులభంగా చేరుకునేలా సాంకేతికతను వాడుకోనున్నారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష సెంటర్ అడ్రెస్‌ను క్యూఆర్ కోడ్ ద్వారా హాల్‌టికెట్‌పై ముద్రిస్తారు. దీంతో సెంటర్‌కు ఈజీగా చేరుకొనేలా ప్లాన్ చేస్తున్నారు.
పరీక్ష కేంద్రం ఎంపిక నుంచి సిబ్బంది నియామకం వరకు అన్నింటినీ ఇప్పటి వరకు జిల్లా విద్యాశాఖాధికారులు పర్యవేక్షించే వాళ్లు. ఇప్పుడు ప్రభుత్వ పరీక్షల డైరెక్ట్ విభాగం వీటిని పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర స్థాయి నుంచే కేంద్రం, కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందిని నియామకం చేపడతారు. పరీక్షలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలను ముగ్గురు ఉన్నతాధికారుల టీం పరిశీలిస్తుంది. అక్కడ ఉండే పరిస్థితులు, ఇతర సౌకర్యాలను తనిఖీ చేస్తుంది. అన్నీ అనుకూలంగా ఉంటే వారికి పరీక్ష కేంద్రం అనుమతి ఇస్తుంది. పదో తరగతి పరీక్షల టైంలోనే ఇంటర్ ప్రాక్టికల్స్ ఉన్నందున జూనియర్ కాలేజీలలో సెంటర్ ఇవ్వకూడదని నిర్ణయించారు.
ఒక్క పరీక్ష కేంద్రాల ఎంపిక మాత్రమే కాకుండా పరీక్షలు సజావుగా సాగేందుకు సిబ్బంది నియామకం కూడా నేరుగా రాష్ట్ర స్థాయి నుంచే చేపడతారు. చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగ అధికారులు, ఇన్విజిలేటర్లు అందర్నీ కూడా డీజీఈ కార్యాలయం నుంచే నియమిస్తారు. గ్రేడ్-2 హెచ్ఎంలు, స్కూలు అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఇతరుల వివరాలను ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. వాటి ఆధారంగా నియామకాలు చేపడతారు. వాటిని ఆయ పాఠశాలలకు పంపిస్తారు. మరోవైపు తీసుకొని ఎంపిక చేసి, వాటి జాబితాలను జిల్లాలకు పంపనున్నారు.





















