ఉజ్జయినీ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.
ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు.
ఆయన కుటుంబసభ్యులతో కలిసి నేడు (జూలై 9) వేకువజామున 3.30 గంటలకే ఆలయానికి చేరుకుని, కుటుంబ సమేతంగా బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి కుటుంబానికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకొని మంత్రి, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు వరుస కట్టారు.
మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
పెద్ద సంఖ్యలో జనాలు వస్తుండడంతో రద్దీ నెలకొనకుండా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
మొత్తం ఆరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.
ఆర్టీసీ కూడా ఉజ్జయిని మహాంకాళి బోనాల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతూ ఉంది.
భక్తుల సౌకర్యం కోసం నగరంలో దాదాపు 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.
హైదరాబాద్ లో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునేలా సిటీ బస్సులను తిప్పడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
బోనాల జాతరకు హాజరయ్యే భక్తులు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది.
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం- మంత్రులుగా 11 మందితో ప్రమాణం చేయించిన గవర్నర్
సీఎం రేసులో రేవంత్ - విద్యార్థి నేతగా ప్రస్థానం ప్రారంభం!
Telangana Assembly Election 2023: ఓటేసిన రాజకీయ ప్రముఖుల ఫొటోస్
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Telangana Assembly Election 2023: వెల్లివిరిసిన ఓటుస్వామ్యం- ఒటెత్తిన ప్రజానీకం
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే
Guntur Kaaram Song: మహేష్ బాబుకు శ్రీలీల ముద్దు - 'గుంటూరు కారం'లో రెండో పాట రెడీ!
/body>