అన్వేషించండి
Cycling In Metro Cities: మెట్రో సిటీస్‌లో సైక్లింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి - ఆరోగ్యకరమైన రేపటి కోసం ముందడుగు
Metro Plus News: మెట్రో సిటీస్‌లో సైక్లింగ్‌పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఆరోగ్యకరమైన రేపటి కోసం ముందడుగు వేస్తున్నారు నగర జనం

మెట్రో సిటీస్‌లో సైక్లింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి
1/10

ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరంలో సైక్లింగ్ వాడకం అమాంతం పెరిగింది. సైక్లింగ్ కేవలం ఒక హాబీగా లేదా ఫిట్‌నెస్ ట్రైనింగ్‌లో భాగంగా మాత్రమే కాకుండా, ప్రతి రోజు జీవనంలో ఒక ప్రధాన భాగంగా మారింది.
2/10

దేశవ్యాప్తంగా ప్రజలు షార్ట్ కమ్యూట్‌లు, ఆరోగ్య ప్రయోజనాల కోసం సైక్లింగ్‌ను వినియోగిస్తున్నారు. 80 వ దశకం వరకు బైసైకిల్ సాధారణ రవాణా సాధనంగా ఉండేది, కానీ మోటారు వాహనాల ఉధృతితో బైసైకిల్ వినియోగం తగ్గింది.
3/10

అయితే కోవిడ్-19 మహమ్మారి ప్రజల జీవనశైలిలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది, ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి పెరిగింది.
4/10

2021లో ప్రారంభమైన హైదరాబాద్ సైక్లింగ్ రివల్యూషన్ (HCR) సురక్షిత, సుస్థిరమైన రవాణా పద్ధతిగా సైక్లింగ్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం 2030 నాటికి 50% మంది హైదరాబాద్ ప్రజలు ప్రజా రవాణాను వినియోగించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతోంది.
5/10

ఆక్టివ్ మొబిలిటీపై దృష్టి సారిస్తూ సైక్లింగ్, నడక, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగాన్ని పెంచడానికి ఈ కార్యక్రమం ప్రాధాన్యత ఇస్తోంది.
6/10

సైక్లింగ్ విప్లవం దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, ఢిల్లీ, ముంబై, శ్రీనగర్, బెంగుళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో సైక్లింగ్ క్లబ్బులు ఏర్పాటవడంతో సైక్లింగ్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
7/10

image 7
8/10

Cycle to Work వంటి కార్యక్రమాలు పలు నగరాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయి. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో IT ప్రొఫెషనల్స్ సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.
9/10

ఔటర్ రింగ్ రోడ్ నుంచి ప్రథాన ఐటి కారిడార్లకు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో సైక్లిస్ట్‌లు రోజువారీ ప్రయాణాలకు బైసైకిల్‌ను ఉపయోగిస్తున్నారు.
10/10

తెలుగు రాష్ట్రాల్లోని స్మార్ట్ సిటీల్లో సైక్లింగ్ పట్ల ప్రజల ఆసక్తి విపరీతంగా పెరిగింది. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సైక్లింగ్ ట్రాక్‌లు, సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్‌ల అమలుకు చొరవ చూపుతున్నాయి.
Published at : 01 Oct 2024 01:52 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion