గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు.
సైనిక అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
73వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు త్రివిధ దళాధిపతులు సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం సీఎం కేసీఆర్ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి యుద్ధవీరులకు వందనం చేశారు. త్రివిధ దళాధిపతులు సైతం అమరవీరులకు నివాళులర్పించారు.
తెలంగాణ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై, తాత్కాలిక సచివాలయం బీఆర్‌కే భవన్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైకోర్టులో చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగురవేశారు.
Ramadan 2022 Photos: హైదరాబాద్లో ఘనంగా రంజాన్ వేడుకలు - మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు
In Pics : తెలంగాణ ప్రభుత్వ ఇఫ్తార్ విందు, పాల్గొన్న సీఎం కేసీఆర్
TRS Plenary Photos: గులాబీ రంగు అద్దుకున్న హైదరాబాద్- ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం
In Pics: 3 టిమ్స్ ఆస్పత్రులకు కేసీఆర్ శంకుస్థాపన - భవన ఆకృతుల ఫోటోలు ఇవీ
In Pics: బండి సంజయ్కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్గా కేసీఆర్ !
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
World Hypertension Day: హైబీపీలో కనిపించే లక్షణాలు ఇవే, ఇలా అయితే వెంటనే వైద్యుడిని కలవాల్సిందే
Breaking News Live Updates: నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు