అన్వేషించండి
Kavitha At Home| తన నివాసానికి చేరుకున్న కవితకు అమ్మ ఆశీర్వాదాలు, వెంటనే కేటీఆర్‌కు రాఖీ కట్టి!
Kavitha arrives at her residence in Hyderabad | ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కవిత.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకున్నారు.
తన నివాసానికి చేరుకున్న కవితకు అమ్మ ఆశీర్వాదాలు, వెంటనే కేటీఆర్‌కు రాఖీ కట్టి!
1/8

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో తన నివాసానికి చేరుకున్నారు.
2/8

ఐదు నెలల తరువాత ఇంటికి తిరిగొచ్చిన కవితకు హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. దిష్టి తీసిన అనంతరం అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు కవిత. సోదరుడు కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు.
3/8

తల్లిని చూడగానే కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబసభ్యులు కవితను ఆప్యాయంగా పలకరించారు. కవిత రాకతో ఇంట్లో పండుగ వాతావరణం కనిపించింది.
4/8

తన వదిన, కేటీఆర్ భార్య శైలిమ, కవిత ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు.
5/8

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కవిత, కేటీఆర్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కవితకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
6/8

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి భారీగా కార్లతో ర్యాలీగా వచ్చి బంజారాహిల్స్ లోని తన నివాసానికి కవిత, కేటీఆర్ చేరుకున్నారు.
7/8

న్యాయ బద్ధమైన పోరాటం గెలిచిందని, కడిగిన ముత్యంలా బయటకు వస్తాను అన్నారు కవిత. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని చెప్పారు.
8/8

తాను ఏ తప్పు చేయలేదని, కేసీఆర్ కూతుర్ననే తనపై కుట్ర చేశారని కవిత ఆరోపించారు. ప్రజల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.
Published at : 28 Aug 2024 07:38 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
విజయవాడ
క్రికెట్
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















