అన్వేషించండి
Smriti mandhana: స్మృతి మంధాన డామినేషన్! బిగ్‌బాష్, సీపీఎల్, ఎస్‌ఏ20, పీఎస్‌ఎల్‌లో మగాళ్ల కన్నా ఎక్కువ సాలరీ!
Smriti mandhana: స్మృతి మంధాన డామినేషన్! బిగ్‌బాష్, సీపీఎల్, ఎస్‌ఏ20, పీఎస్‌ఎల్‌లో మగాళ్ల కన్నా ఎక్కువ సాలరీ!

స్మృతి మంధాన
1/6

బీసీసీఐ ఏ క్రికెట్ లీగ్ నిర్వహించినా సెన్సేషన్‌గా మారుతుంది! 2008లో ఐపీఎల్‌తో ఆటగాళ్లను కోటీశ్వరులుగా చేసింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌తో అమ్మాయిలను మహాలక్ష్ములుగా మార్చేసింది. ఐపీఎల్‌ను మినహాయించి ప్రపంచంలోని అన్ని క్రికెట్ లీగులతో పోలిస్తే స్మృతి మంధానకు దక్కిన ధరే అత్యధికం!
2/6

టీమ్‌ఇండియా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు సృష్టించింది. అరంగేట్రం మహిళల ప్రీమియర్ లీగు వేలంలో ఆమె రూ.3.4 కోట్లు సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆమెను దక్కించుకుంది.
3/6

ఐపీఎల్‌తో పోలిస్తే తక్కువే ధరే అయినా మిగతా లీగులతో పోలిస్తే స్మృతి మంధాన అందుకుంటున్న డబ్బు తక్కువేమీ కాదు. బిగ్‌బాష్, సీపీఎల్ టీ20, ఎస్‌ఏ టీ20, పీఎస్‌ఎల్ ఆటగాళ్ల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బు అందుకుంటోంది.
4/6

ఐపీఎల్‌లో అత్యధిక ధర అందుకోబోతున్నది ఇంగ్లాండ్ కుర్రాడు సామ్ కరన్! గతేడాది జరిగిన వేలంలో రూ.18.5 కోట్లు దక్కించుకున్నాడు. ప్రపంచంలో ఒక క్రికెటర్ అందుకోబోతున్న అత్యధిక వేతనం ఇదే. ఇక డబ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన రూ.3.4 కోట్లు తీసుకోబోతుంది. ఈ లీగులో అత్యధిక ధర ఈమెదే.
5/6

బిగ్‌బాష్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడు డీఆర్సీ షార్ట్. రూ.2.14 కోట్లు అందుకుంటున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగులో ఎక్కువ రేటు పలికిన ఆటగాడు ఇమ్రాన్ తాహిర్. రూ.1.73 కోట్లు తీసుకుంటున్నాడు.
6/6

ఈ మధ్యే మొదలైన సౌథాఫ్రికా టీ20 లీగులో అత్యంత విలువైన ఆటగాడు లుంగి ఎంగిడి. రూ.1.63 కోట్లు పొందుతున్నాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగులో టాప్ ఎర్నర్ బాబర్ ఆజామ్ సాలరీ రూ.1.4 కోట్లు. వీరందరి కన్నా స్మృతి మంధాన అందుకుంటున్న మొత్తమే ఎక్కువ.
Published at : 16 Feb 2023 05:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
హైదరాబాద్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion