అన్వేషించండి
In Pics: కేరళ వరదలు: అన్నీ కన్నీరు పెట్టించే దృశ్యాలే, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ - ఫోటోలు
Kerala Latest News: కేరళలో కన్నీరు పెట్టించే దృశ్యాలెన్నో కనిపిస్తున్నాయి. కొండ చరియల కింద ఇరుక్కుపోయిన వారిని తీసేందుకు రెస్క్యూ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు.
కేరళలలో సహాయక చర్యలు
1/11

కేరళను మరోసారి వరదలు ముంచెత్తుతున్నాయి. 2018 వరదలను తలపించేలా ఇప్పుడు అక్కడ పరిస్థితి కనిపిస్తోంది.
2/11

ఇప్పటికే కేరళలోని వయనాడ్ జిల్లాలో మంగళవారం (జూలై 30) భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి దాదాపు 93 మంది చనిపోయారు. ఇంకా పదుల సంఖ్యలో ప్రజలు కొండ చరియల కింద చిక్కుకుపోయారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
3/11

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత ముమ్మరంగా రెస్క్యూ సిబ్బంది ప్రయత్నాలు చేస్తుండగా.. వర్షం అడ్డంకిగా మారింది. దగ్గర్లోని ఓ వంతెన కూలిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు కూడా వర్షం అడ్డంకిగా మారింది.
4/11

2018లో వచ్చిన భయంకరమైన వరదల తర్వాత ఈ స్థాయిలో కొండ చరియలు కూలిపోవడం ఇదే మొదటిసారి. 2018 వరదల్లో కేరళ వ్యాప్తంగా 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
5/11

దాదాపు 200 మంది ఆర్మీ సిబ్బందిని రంగంలోకి దింపారు. వారంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. కొండ చరియలు విరిగిపడిన చుట్టుపక్కల హాస్పిటళ్లు అన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి.
6/11

కొండ చరియల వద్ద టీ, యాలకల ఎస్టేట్స్‌లో పని చేసే కార్మికులు చాలా మంది సమీపంలో టెంట్లు వేసుకొని రాత్రి వేళ పడుకుంటారు. అలా నిద్రలోనే వారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
7/11

తమ వారి ఆచూకీ కోసం ఎంతో మంది కుటుంబ సభ్యులు ఆందోళనతో ఆస్పత్రులన్నీ వెతుకుతున్నారు. కొంత మందికి తమ వారి ఆచూకీ దొరుకుతుండగా.. మరికొంత మంది కుటుంబ సభ్యులు, బంధువుల జాడ కోసం వెతుకుతూనే ఉన్నారు.
8/11

వయనాడ్ ఘటనలో 65 మంది చనిపోయినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. స్థానిక చలియార్ నదిలో 16 శవాలు లభ్యం అయ్యాయి. కొంత మంది శరీర భాగాలు కూడా అక్కడ దొరికినట్లుగా అధికారులు తెలిపారు.
9/11

వయనాడ్ అనేది కేరళలో అత్యధికంగా కొండలు ఉండే ప్రాంతం. ఇవన్నీ పశ్చిమ కనుమలు. వర్షాకాలం కారణంగా నానుడు వర్షాలకు కొండ చరియలు జారి రోడ్లపై పడుతుంటాయి.
10/11

ఎన్డీఆర్ఎఫ్, ఇతర రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి పౌరులను రక్షిస్తున్నారు.
11/11

వివిధ ప్రాంతాల్లో బురద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో వాటిలో చాలా మంది కొట్టుకుపోతున్నారు.
Published at : 30 Jul 2024 06:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















