అన్వేషించండి
Early Aging Causes : చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తున్నారా? ఆ మార్పులు చేస్తే యంగ్ లుక్ మీ సొంతం
Effective Anti-Aging Tips : కొన్ని అలవాట్లు వృద్ధాప్యఛాయలను పెంచుతాయని చెప్తున్నారు నిపుణులు. అందుకే వాటికి దూరంగా ఉంటూ.. ఈ మార్పులు చేయాలని సూచిస్తున్నారు.
వృద్ధాప్యఛాయలు త్వరగా రావడానికి కారణాలు ఇవే (Image Source : Freepik)
1/8

చాలామంది చేసే తప్పు ఏంటి అంటే.. ఎండ ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ రాస్తారు. వర్షాలు పడుతున్నప్పుడు లేదా చలికాలంలో ఉపయోగించరు. కానీ బ్లూ లైట్ ఎఫెక్ట్ కూడా పడుతుందని గుర్తించాలని చెప్తున్నారు నిపుణులు. సన్‌స్క్రీన్ ఉపయోగించకపోవడం వల్ల వృద్ధాప్యఛాయలు త్వరగా వస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్ ముందు పనిచేసేవారు సన్‌స్క్రీన్ ఉపయోగించాలని చెప్తున్నారు.
2/8

నిద్ర కేవలం విశ్రాంతికే కాదు. శరీరాన్ని రీసెట్ చేసుకునే బటన్. సరిగ్గా నిద్రపోకపోతే కళ్లు ఉబ్బి.. చర్మం ముడతలు పడుతుంది. నీరసంగా అనిపిస్తుంది. ఇటీవలి పరిశోధనలో నిద్ర సరిగ్గా లేనివారిలో మెదడు మందగించి.. వృద్ధాప్యం త్వరగా వస్తుందని గుర్తించారు. ఇది జ్ఞాపకశక్తిపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని గుర్తించారు. కాబట్టి ఎక్కువ పడుకోవాలని సూచిస్తున్నారు.
3/8

షుగర్స్ ఎక్కువగా తీసుకంటే బరువు పెరగడంతో పాటు.. ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇది జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. చర్మ ప్రోటీన్లను క్షీణింపజేయడమే కాకుండా కీళ్ల సమస్యలను పెంచుతుంది. అవయవాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. సహజ స్వీటెనర్లకు మారి.. కార్బోహైడ్రేట్ల వాడకాన్ని తగ్గిస్తే ఈ నష్టం తగ్గుతుంది.
4/8

ఒత్తిడి వల్ల మీకు త్వరగా వైట్ హెయిర్ వస్తుందని తెలుసా? అంతేకాకుండా మీ DNAను కూడా మారుస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. వేగవంతమైన సెల్యులార్ వృద్ధాప్యానికి దారితీస్తుందని.. కాబట్టి రోజుకు ఐదు నిమిషాలైనా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
5/8

ఫుడ్ ఎక్కువ తినడం కాదు.. దానిలో ఎన్ని పోషకాలు ఉన్నాయో.. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారనేదానిపై అవగాహన ఉండాలి. పరధ్యానంగా ఫోన్ లేదా స్క్రీన్ చూస్తూ తినడం వల్ల ఎక్కువ తినేస్తారట. ఇది జీర్ణక్రియకు, పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని చెప్తున్నారు. ఇది చర్మపు ఆకృతిని మారుస్తూ.. గోర్లు, జుట్టు పలుచబడటానికి దారి తీస్తుంది. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
6/8

చాలామంది వాతావరణ చల్లగా ఉందని నీటిని తక్కువగా తీసుకుంటారు. డీహైడ్రేషన్ వల్ల స్కిన్ డ్రైగా మారడంతో పాటు వృద్ధాప్యఛాయలు త్వరగా వస్తాయని చెప్తున్నారు. డీహైడ్రేషన్ మెదడు కణజాలాన్ని కుంచించుకుపోయేలా చేస్తుంది. కాబట్టి రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగండి. ఒకేసారి కాకుండా గ్యాప్ ఇస్తూ తాగితే మంచిది.
7/8

'టెక్ నెక్' అనేది నిజమైన సమస్య. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల శ్వాస విధానాలు దెబ్బతింటాయి. ఇది మీ మెదడు, చర్మానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. దీనివల్ల మీ చర్మం రంగు మారడం, అలసట రావడం జరుగుతాయి. కాబట్టి ఛాతీపై ప్రెజర్ పెట్టే వ్యాయామాలు చేస్తూ.. భంగిమను రీసెట్ చేసుకోవాలంటున్నారు.
8/8

స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు కూడా వృద్ధాప్యఛాయలను రెట్టింపు చేస్తాయి. ఈ రెండూ కాలేయాని నష్టం చేస్తాయి. అలాగే డీహైడ్రేషన్‌ని పెంచుతాయి. కొల్లాజెన్‌ను కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మానేయాలని సూచిస్తున్నారు.
Published at : 11 Jul 2025 01:27 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
లైఫ్‌స్టైల్
జాబ్స్

Nagesh GVDigital Editor
Opinion




















