అన్వేషించండి
Morning Drinks for Health : ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తాగితే.. అసిడిటీ, గ్యాస్, అలసట అన్నీ తగ్గిపోతాయట
Morning Detox Drinks : ఆరోగ్యానికి మేలు చేసేవి చాలా వంటింటిలోనే ఉంటాయి. అలాంటి వాటిలో ఓ 5 రోజూ ఉదయాన్నే తీసుకుంటే.. జీర్ణ సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు. అవేంటంటే..
ఉదయాన్నే ఈ డ్రింక్స్ తాగితే కలిగే లాభాలివే
1/6

సోంపు నీటిని ఉదయాన్నే తాగితే.. అసిడిటీ, కడుపు మంట తగ్గుతుంది. ఇందులో ఉండే ఎనెథోల్ అనే సమ్మేళనం కడుపు కండరాలను సడలించి.. గ్యాస్, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం ఒక కప్పు నీటిలో కొద్దిగా సోంపు ఉడకబెట్టి తాగడం వల్ల కడుపు తేలికగా, హాయిగా ఉంటుంది.
2/6

వాము, జీలకర్ర.. గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి. ఈ రెండు మసాలా దినుసులలో జీర్ణక్రియను వేగవంతం చేసే,పేగులలో పేరుకుపోయిన గ్యాస్‌ను నెమ్మదిగా బయటకు పంపడంలో సహాయపడే నూనెలు ఉన్నాయి. వాటిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చని నీటితో తాగడం వల్ల పొట్ట తేలికగా అనిపిస్తుంది.
3/6

శిలాజిత్ శక్తిని పెంచడానికి, శరీర జీవక్రియకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇందులో ఉండే ఫుల్విక్ ఆమ్లం, ఖనిజాలు కణాలలో శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది అలసటను తగ్గిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కేవలం బఠానీ గింజంత ప్యూర్ శిలాజిత్ని వేడి నీటిలో కలిపి ఉదయం తీసుకోవచ్చు.
4/6

త్రిఫల జీర్ణక్రియను సమతుల్యం చేయడానికి, శరీరాన్ని సహజంగా డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి. పేగులను సజావుగా ఉంచుతాయి. ఉదయం గోరువెచ్చని నీటిలో త్రిఫల నానబెట్టి తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
5/6

పసుపులోని కర్కుమిన్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కొద్దిగా మరిగించిన నీటిలో పసుపు వేసి దానిని తాగడం వల్ల అలసట తగ్గుతుంది. శరీరంపై మంచి ప్రభావం ఉంటుంది.
6/6

వీటిలో ఏవి తీసుకోవాలనేది మీ శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కడుపులో మంట ఎక్కువగా ఉంటే సోంపు.. గ్యాస్ సమస్య ఉంటే వాము, జీలకర్ర.. శక్తి తక్కువగా అనిపిస్తే షిలాజిత్.. జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటే త్రిఫల.. ఇమ్యూనిటీకోసం పసుపు తీసుకోవచ్చు. వీటిని తీసుకునే ముందు వైద్యుల, నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.
Published at : 26 Nov 2025 09:27 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















