అన్వేషించండి
Advertisement

Brahmamudi Serial November 12th Episode Highlights: కావ్య Vs రాజ్.. పందెంలో నెగ్గేదెవవరు, కొత్త CEO ఎవరు - బ్రహ్మముడి నవంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..

Brahmamudi Serial Today November 12th Highlights
1/10

ఆస్తి పంపకాల విషయంలో ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. అదే ఆలోచనలో వెళ్లిన ధాన్యలక్ష్మి ఆస్తి పంచివ్వమని గొడవ స్టార్ట్ చేస్తుంది. నా కొడుకు కష్టాన్ని చూడలేక తల్లిగా నేను స్పందించడంలో తప్పులేదని భావిస్తున్నా.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నారు..ఏం చేశారని అడుగుతుంది.
2/10

ఆస్తిని ముక్కలు చేసేది లేదని సీతారామయ్య తేల్చి చెబుతాడు. ఇంకొంత టైమ్ కావాలని అనడంతో ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారా అని రివర్సవుతుంది.
3/10

ఎవరితో ఏం మాట్లాడుతున్నావ్ ధాన్యలక్ష్మి..నా కొడుకుని చవటలా కూర్చోబెట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అరేయ్ నీ పెళ్లాని అదుపులో పెట్టుకోవడం చేతకాదా అంటుంది
4/10

రాజ్ ని మేనేజర్ చేసినా ఇదేంటని అపర్ణ ప్రశ్నించలేదు..కోడలిగా హక్కులు అడిగేముందు బాధ్యతలు తెలుసుకుంటే మంచిదని క్లాస్ వేస్తుంది ఇందిరాదేవి. మధ్యలో రుద్రాణి జోక్యం చేసుకోబోతుంటే...ఎక్కువ మాట్లాడితే నిన్ను ఇంట్లోంచి గెంటేస్తా అంటుంది స్వప్న.
5/10

నీకు మంచి చేయడం కూడా చేతకాని నువ్వు ఎలా అయినా ఆస్తిలో వాటా కోసం ప్లాన్లు వేసింది చాలు.. అయినా నీ మొగుడు సంపాదించిన ఆస్తులన్నాయా ఇక్కడ? నువ్వు నోరు మూసుకుని ఉండు..పెద్దవాళ్లు మాట్లాడుతున్నారు కదా అంటుంది స్వప్న
6/10

ఇంతలో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. ఆస్తికోసం అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు అప్పుని కోడలిగా ఒప్పుకుంటే చాలుకదా అందరం కలసే ఉండొచ్చంటాడు. నీ పెళ్లాన్ని పుట్టింట్లో వదిలేసి నువ్వు నీతులు చెబుతున్నావా నోరు మూసుకో అని క్లాస్ వేసుంది. మరోసారి మీ మావయ్యగారిపై గొంతు లేస్తే చూస్తూ ఊరుకోనంటుంది ఇందిరాదేవి
7/10

వేరే కంపెనీకి పంపించాల్సిన డిజైన్లు అప్రూవ్ చేయకుండా గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటాడు రాజ్. ఫైల్స్ పై సంతకం చేయకపోతే డిస్మిస్ చేస్తానని వార్నింగ్ ఇస్తుంది.
8/10

ధాన్యలక్ష్మి చేసిన గొడవకు కారణం నువ్వేనని తాతయ్యపై పడతాడు రాజ్. ఇంటితో సంబంధం లేని కావ్యను CEOని చేశారని క్వశ్చన్ చేస్తాడు.. దానికి దీనికి సంబంధం లేదు..నీ భార్యకింద పనిచేయడం ఇష్టంలేక నువ్వు ఇలా మాట్లాడుతున్నావని అంటాడు సీతారామయ్య . మీ నిర్ణయాల వల్ల ఇల్లు ముక్కలైతే నాకు సంబంధం లేదంటాడు రాజ్
9/10

మళ్లీ ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ఆస్తి పంపకాల వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది రుద్రాణి. గుమస్తాకు పుట్టిన నీకు ఆస్తిలో వాటా ఎలా దక్కుతుందంటుంది స్వప్న. నీ మొగుడికి ఆస్తి పంచితే అనుభవించేది నువ్వే అని కూల్ చేసేందుకు ట్రై చేస్తుంది ..కానీ మీకు ఆస్తి ఇస్తే మూడు రోజుల్లో ముగించేస్తారని రివర్సవుతుంది స్వప్న
10/10

బ్రహ్మముడి నవంబరు 13 ఎపిసోడ్ లో...కంపెనీకి వచ్చిన కొత్త కాంట్రాక్ట్ విషయంలో రాజ్, కావ్యకు పోటీ పెడతాడు సీతారామయ్య...ఇందులో ఎవరు గెలిస్తే వాళ్లే కొత్త CEO అని ఆఫర్ ఇస్తాడు. రాజ్ ఓడితే కావ్యను పుట్టింటినుంచి తీసుకురావాలనే కండిషన్ పెడతాడు.
Published at : 12 Nov 2024 09:18 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement