అన్వేషించండి
Brahmamudi Serial Today October 29th Episode: రుద్రాణి , అనామికకు చెక్ పెట్టేందుకు అదిరిపోయే ప్లాన్ చేసిన కావ్య, స్వప్న - బ్రహ్మముడి అక్టోబరు 29 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: దుగ్గిరాల వారి కంపెనీలోకి కావ్య CEO గా అడుగుపెట్టడంతో కథ కీలక మలుపు తిరిగింది.. ఈ రోజు ఎపిసోడ్ హైలెట్స్ ఇక్కడ చూడండి..
Brahmamudi Serial Today October 29th Highlights
1/8

రాజ్ ని ఆఫీసుకి వెళ్లేలా ఇంట్లో అందరూ కలసి ఒప్పిస్తారు. వాళ్ల టార్చర్ భరించలేక సరే అంటాడు రాజ్.
2/8

మరోవైపు రుద్రాణి ఈ ప్లాన్ కి ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుంది.
3/8

ఆఫీసుకి వెళ్లిన రాజ్ కి.. గేట్ దగ్గర సెక్యూరిటీగా ఉన్న మేనేజర్ ని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి అన్యాయం అని కావ్య దగ్గరకు తీసుకెళ్లి నిలదీస్తాడు. అయితే మీ పోస్ట్ ఆయనకు ఇచ్చేసి మీరు సెక్యూరిటీ డ్రెస్ వేసుకోండి అంటుంది. రాజ్ ఏమీ చేయలేక సెక్యూరిటీని పంపించేస్తాడు.
4/8

వెళ్లిపోయిన ఇన్వెస్టర్స్ అందర్నీ తీసుకొస్తుంది కావ్య...అదే విషయాన్ని అనామికకు మెసేజ్ చేస్తుంది. ఈ కంపెనీకి మొన్న రాహుల్, నిన్న రాజ్, ఈ రోజు కావ్య...రేపు ఇంకెవరో..ఇలా మారుతూపోతుంటే మా పెట్టుబడులు ఏమవుతాయంటారు. ఇన్వెస్టర్లు అందరూ వెళ్లిపోతారు..
5/8

ఇది బొమ్మలకు రంగులేసినంత ఈజీకాదు..ఈ విషయం నీకు అర్థంకాకపోయినా మా ఇంట్లోవాళ్లకి కూడా అర్థం అవుతుందిలే అని సెటైర్స్ వేస్తాడు రాజ్. మీకోపం నాపై ..కంపెనీపై కాదు, వాళ్ల కోపం కంపెనీపై నాపై కాదు.. నన్ను అవమానించారని సంబరపడుతున్నారు కానీ ఈ అవమానం దుగ్గిరాల కుటుంబానిదని గుర్తుపెట్టుకోండి...మీరు వెళ్లి క్యాబిన్లో కూర్చోండి ఏం చేయాలో చెబుతాను అంటుంది.
6/8

అరవింద్ అనే పాత క్లయింట్ వచ్చి.. యాక్సిడెంట్ అవడం వల్ల కంపెనీపై కాన్సన్ ట్రేట్ చేయలేకపోయాను నష్టాల్లో కూరుకుపోయాను... ఈ ఆఫీసుని మీరే కొనుగోలు చేయాలి అంటాడు. రాజ్ కి కబురుపెడుతుంది కావ్య. రాజ్ సీరియస్ అవుతాడు..మరో సెక్యూరిటీ పోస్ట్ ఖాళీ ఉందని శ్రుతి అనడంతో వస్తున్నా అంటాడు.
7/8

అరవింద్ ని వేలంకు వెళ్లమని..ఎక్కువ మొత్తంలో మేమే కొనుగోలు చేస్తాం..అయితే ఆ లాభంలో 50% వాటా ఇవ్వాలని కండిషన్ పెడుతుంది. అరవింద్ కూడా ఓకే చెబుతాడు...ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..
8/8

బ్రహ్మముడి అక్టోబరు 30 ఎపిసోడ్ లో రుద్రాణిని ఇరికించేందుకు స్వప్న - కావ్య కలసి ఏదో ప్లాన్ చేస్తారు.. మరోవైపు రాజ్ ఇంటికెళ్లి కావ్యపై కంప్లైంట్ చేస్తాడు. మీ మనవరాలు నష్టాల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేయాలి అనుకుంటోందని... కానీ సీతారామయ్య మాత్రం కావ్య సమర్థతపై నమ్మకం ఉందని ఆమెను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదని చెబుతాడు..
Published at : 29 Oct 2024 09:07 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఎంటర్టైన్మెంట్
బిగ్‌బాస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















