Bigg Boss 9 Agnipareeksha: బిగ్ బాస్ అంటే హౌస్ అనుకుంటివా... ఫైర్ - ఈ ముగ్గురితో అంత ఈజీ కాదు
Bigg Boss Season 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన అగ్నిపరీక్ష ప్రోమో ఆసక్తిని అమాంతం పెంచేసింది.

Bigg Boss Telugu Season 9 Agnipariksha Special Promo: ఫేమస్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 రోజురోజుకూ హీట్ పెంచేస్తోంది. ఈసారి సరికొత్తగా సామాన్యులకు కూడా ఎంట్రీ ఇస్తూ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అగ్ని పరీక్ష కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. ఇప్పటికే హోస్ట్ కింగ్ డబుల్ హౌస్... డబుల్ డోస్ అంటూ భారీ హైప్ క్రియేట్ చేయగా... తాజాగా రిలీజ్ చేసిన 'అగ్ని పరీక్ష' ప్రోమో ఆ హైప్ పదింతలు చేసింది.
ఈ ముగ్గురితో నాట్ ఈజీ
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయ్యేందుకు దాదాపు 20 వేల మంది కామనర్స్ అప్లై చేసుకోగా... వారిలో 200 మందిని ఫైనల్ చేశారు. వీరికి స్క్రూటినీ నిర్వహించి 40 మందిని వడపోసి చివరకు 15 మందిని 'అగ్ని పరీక్ష'కు ఎంపిక చేశారు. వీరిలో నాలుగు నుంచి ఐదుగురికి మాత్రమే హౌస్‌లోకి ఎంట్రీ ఉంటుంది. గత నాలుగైదు రోజులుగా 'అగ్ని పరీక్ష' జరుగుతుండగా... బిగ్ బాస్ చరిత్రలోనే టఫ్ కంటెస్టెంట్స్ నవదీప్, అభిజిత్, బింధు మాధవి ఈ టాస్క్‌కు జడ్జెస్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల ఈ షో నుంచి లీక్స్ రాగా... తాజాగా 'అగ్ని పరీక్ష' స్పెషల్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. 'మీరందరూ డ్రీమ్ చేసిన స్పాట్ లైట్. ఇదే బిగ్ బాస్ హౌస్‌లోకి మీ ఎంట్రీ టికెట్. కానీ ఈ రెండూ అంత ఈజీ కాదు.' అంటూ యాంకర్ శ్రీముఖి బిగ్ ఎలివేషన్ ఇవ్వగా... 'నేను మైండ్ గేమ్ ఆడతానని అందరికీ తెలుసు. ఈసారి మైండ్ బ్లాక్ అవ్వడానికి రెడీగా ఉండండి.' అంటూ అభిజిత్ అంటాడు. 'నా ముందున్నది రెండే ఆప్షన్స్. బ్లాకా వైటా. ఈ అగ్నిపరీక్షలో తేల్చేద్దాం.' అంటూ తనదైన స్మైల్ స్టైల్‌తో బింధు మాధవి అనగా... ఏంటి సీరియస్ అవుతున్నారు?... ఈ అగ్నిపరీక్షలో మీ స్ట్రెస్ ఎలా బరస్ట్ చేయాలో? వాళ్లను ఎలా స్ట్రెస్ చేయాలో నేను చూసుకుంటా? అంటూ నవదీప్ ఎలివేషన్ అదిరిపోయింది.</p>
జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్
టఫ్పెస్ట్ అగ్ని పరీక్ష ఇప్పటికే షూటింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్‌పై అభిజీత్ సీరియస్ అయినట్లు... బింధుమాధవి ఓ కంటెస్టెంట్‌పై ఓవరాక్షన్ వద్దు అంటూ అరిచినట్లు లీకైన వీడియోలను బట్టి తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ ఓ సంచలనంగానే కనిపిస్తోంది. సామాన్యుల ఎంట్రీ సెలబ్రిటీస్ వార్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక ఈ అగ్నిపరీక్ష ఎపిసోడ్స్ ఈ నెల 22 నుంచి ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ఈసారి బిగ్ బాస్ సరికొత్తగా ఉండబోతుందనేది ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ బట్టి తెలుస్తోంది. ఈసారి వెరీ టఫ్... డబుల్ హౌస్... డబుల్ డోస్ అంటూ ఇటీవలే నాగార్జున చెప్పారు. అంటే ఇంతకు ముందు ఉన్నట్లు గేమ్స్ లాంటివి కాకుండా మైండ్ గేమ్స్, క్రియేటివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కామనర్స్ నుంచి సెలబ్రిటీల వరకూ అసలు ఎలాంటి గేమ్స్ ఉండబోతున్నాయి. హౌస్‌లో ఎలాంటి టాస్కులు ఇవ్వబోతున్నారు అనేది తెలియాలంటే సెప్టెంబర్ 7 వరకూ ఆగాల్సిందే.





















