అన్వేషించండి

Coolie Nagarjuna Cries: కన్నీళ్లు పెట్టుకున్న 'కూలీ' నాగార్జున, అందర్నీ కదిలించేశారు!

Coolie Movie Nagarjuna: అక్కినేని నాగార్జున ఇంటర్యూలో మాట్లాడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ కనిపించే నాగ్ కళ్లలో కన్నీళ్లెందుకొచ్చాయ్?

Akkineni Nagarjuna Cries:  ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తారు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ఎంత కష్టం వచ్చినా ఆయన ముఖంపై కనిపించనీయరు, ఎప్పుడూ ప్రశాంతంగా కనిపిస్తారు..ముఖంపై చిరునవ్వు అలానే ఉంటుంది. మాటాల్లోనూ పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. వర్కౌట్స్,డైట్ మాత్రమే కాదు.. టెన్షన్ పడకపోవడం కూడా తన గ్లామర్ సీక్రెట్ అంటారాయన. అందుకే 65 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ టాలీవుడ్ మన్మధుడిగా వెలుగుతున్నారు. 

బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నప్పుడు తప్పితే నాగార్జున కాస్త గట్టిగా, సీరియస్ గా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువే అని చెప్పాలి. ఇంటర్యూస్ లోనూ సరదాగా సాగిపోతారు. ఏ విషయాన్ని తలకెక్కించుకోను అని చెబుతుంటారు. అలాంటి నాగార్జున ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంతకీ నాగార్జున కన్నీళ్లు పెట్టుకోవాడానికి కారణం ఏంటంటే..తండ్రి అక్కినేని నాగేశ్వరరావుని తల్చుకుని ఎమోషనల్ అయ్యారు.

సీనియర్ హీరో జగపతి హోస్ట్ గా జీ తెలుగు ‘జయమ్ము నిశ్చయమ్ము’ అనే షో స్టార్ట్ చేసింది. ఆగష్టు 17 ఆదివారం రాత్రి 9 గంటలకి ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రసారమవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చారు నాగార్జున. ఇప్పటికే ఫస్ట్ ప్రోమో వచ్చేసింది.. లేటెస్ట్ గా సెకెండ్ ప్రోమో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ షోలో భాగంగా నాగ్ చిన్నప్పటి స్కూల్ నుంచి మొదలుపెట్టి, కాలేజ్, కెరీర్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా క్వశ్చన్స్ సందించారు జగపతిబాబు. సిగ్గులేకుండా మాట్లాడుకునే షో అంటూ రిలాక్స్ మొదలుపెట్టారు..నాగ్ కూడా అంతే ఉత్సాహంగా సమాధానాలు చెప్పారు. ఫస్ట్ ప్రోమో ఫన్నీగా సాగితే..రీసెంట్ గా వచ్చిన సెకెండ్ ప్రోమో ఎమోషనల్ గా సాగింది.  

అక్కినేని నాగేశ్వర రావు గారికి తనయుడిగా పుట్టినందుకు మీరు ఎలా ఫీలవుతున్నారని అడిగారు జగపతిబాబు?
ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ ‘అంత ఈజీ కాదు..ఎదో ANR గారి కొడుకు అనుకుంటున్నావేమో’ అంటూ దానికి కొనసాగింపు ఏంటన్నది పాజ్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడుతూ నా సోదరుడు వెంకట్.. తమ్ముడూ నువ్వు ఎందుకు సినిమాల్లోకి రాకూడదని అడిగారు. ఎస్ కచ్చితంగా చేద్దాం అనుకుని నాన్నగారి దగ్గరకు వెళ్లి కూర్చుని సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నా అని చెప్పాను. అప్పుడు నాన్నగారి కళ్లలో నీళ్లు తిరిగాయంటూ ఆ రోజులను గుర్తుచేసుకున్నారు నాగార్జున. అన్నమయ్య సినిమా చూసిన తర్వాత మా నాన్నగారు నా చేతులు పట్టుకుని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటే ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది అని జగపతిబాబుతో షేర్ చేసుకున్నారు.  ఆయన ఎలా బతకాలి అనుకున్నారో అలానే బతికారంటూ అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజులను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఫస్ట్ రిలీజైన ప్రోమోలో..కూలీ సినిమా గురించి మాట్లాడిన డైలాగ్స్ హైలెట్ అయ్యాయ్. రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన కూలీ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు నాగార్జున. ఇప్పటివరకూ మన్మధుడిగా స్టార్ హీరోగా వెలిగిన నాగార్జున కుబేర మూవీతో ఫస్ట్ టైమ్ నెగెటివ్ షెడ్స్ రోల్ చేశారు..ఇప్పుడు కూలీలో పూర్తిస్థాయిలో నెగెటివ్ రోల్ చేశారు. ఆగష్టు 14 థియేటర్లలోకి వచ్చేసిన కూలీపై ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తోంది. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్ సహా..అన్ని ఇండస్ట్రీలో నటులను కవర్ చేసేసి సౌత్, నార్త్ ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget