అన్వేషించండి

Coolie Review Telugu: కుర్చీ కోసం యుద్ధం... మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్... రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ

Coolie Movie Review: సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జునల 'కూలీ' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఇందులో ఏముంది? మ్యాటర్ ఏంటి? వంటి వివరాలు తెలుసుకోండి.

Coolie Review In Telugu: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కింగ్ నాగార్జున విలన్‌గా నటించిన సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)కు సంబంధం లేదని, ఇదొక స్టాండలోన్ ఫిల్మ్ అని దర్శకుడు కన్ఫర్మ్ చేశారు. మరి సినిమాలో ఏముంది? ఏమిటి? అనేది ఫస్ట్ రివ్యూలో తెలుసుకోండి.

ఆ కుర్చీ కీలకం... దాని కోసం యుద్ధం!
'కూలీ' ట్రైలర్ చూశారా? జాగ్రత్తగా గమనిస్తే... అందులో ఒక కుర్చీ కనబడుతుంది. ఆ కుర్చీ కోసం కొందరు చేసిన యుద్ధమే 'కూలీ'. ఆ కుర్చీలో ఏముంది? అంటే... ఈ ప్రపంచం నుంచి ఒక మనిషిని ఎటువంటి ఆధారాలు, నామరూపాలు లేకుండా మాయం చేసే శక్తి ఆ కుర్చీకి ఉంది.

Coolie Review Telugu: కుర్చీ కోసం యుద్ధం... మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్... రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ

స్నేహితులుగా సత్యరాజ్, రజనీకాంత్!
కుర్చీని తయారు చేసిన సత్యరాజ్... నెక్స్ట్?
'కూలీ' సినిమాలో రజనీకాంత్, సత్యరాజ్ స్నేహితులుగా నటించారు. ఆ కుర్చీని తయారు చేసేది సత్యరాజ్. దాని కోసం సైమన్ (నాగార్జున)తో పాటు మరికొందరు ట్రై చేస్తారు. వాళ్ళు ఎవరు? ఏమిటి? స్నేహితుడి కోసం రజనీకాంత్ ఏం చేశారు?అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాలో యాక్షన్ ఒక్కటే కాదు... ఉమెన్ ట్రాఫికింగ్ కూడా టచ్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్.

మూడు ట్విస్టులు... ఆరు యాక్షన్ బ్లాకులు...
రజనీకాంత్ మార్క్ యాక్టింగ్ & లోకేష్ స్క్రీన్ ప్లే!
ఇప్పటి వరకు లోకేష్ కనగరాజ్ తీసిన సినిమాలతో కంపేర్ చేస్తే... స్క్రీన్ ప్లే పరంగా 'కూలీ' ది బెస్ట్ అని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లేలో భాగంగా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ 'వావ్' అంటూ ఒక సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్‌లో సినిమా చూస్తారని తెలిసింది. మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద హైప్ మరింత పెంచడం గ్యారెంటీ. అయితే ట్విస్ట్స్ అన్ని రివీల్ అయ్యాక కథ, కథనం మీద ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గుతుందని చెప్పవచ్చు. 

Also Read: కూలీ ఫస్ట్ డే @ 100 కోట్లు ప్లస్... అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము రేపుతున్న రజనీ... 'లియో'ను దాటుతుందా?

అదరగొట్టిన రజనీకాంత్... నాగ్ విలనిజం సూపర్...
ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చేలా సౌబిన్ షాహిర్!
దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోలకు మంచి ఎలివేషన్లు ఇస్తారు. 'కూలీ'లోనూ రజనీకి మంచి సీన్లు రాశారట. అందులో ఆయన అదరగొట్టారట. నాగార్జునను ఒక స్టైలిష్ విలన్ క్యారెక్టర్‌లో చూడటం జనాలకు కొత్తగా ఉంటుంది.

Coolie Review Telugu: కుర్చీ కోసం యుద్ధం... మైండ్ బ్లాక్ అయ్యే ఇంటర్వెల్ ట్విస్ట్... రజనీకాంత్ 'కూలీ' ఫస్ట్ రివ్యూ

స్క్రీన్ మీద స్టైల్‌గా కనిపిస్తూ సటిల్డ్ విలనిజం చూపించారు నాగార్జున. రోలెక్స్ తరహాలో ఆమిర్ ఖాన్ క్యారెక్టర్ ఆకట్టుకోవడం ఖాయం. అయితే అందరి కంటే మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ షాక్ ఇస్తుంది. శృతి హాసన్ డీ గ్లామర్ రోల్ చేశారు. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో ఆవిడ ఆకట్టుకున్నారు. ప్రత్యేక గీతంలో పూజ హెగ్డే సందడి చేశారు. అనిరుద్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్.

Also Readకూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?

టాప్ హెడ్ లైన్స్

I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Samantha Cooking Show : సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
సమంత హోస్ట్‌గా కుకింగ్ షో - సెలబ్రిటీస్ వంటలు వెరీ స్పెషల్... ప్రోమో చూశారా!
Ameer Log: రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రానా చేతికి 'అమీర్ లోగ్'... బస్తీల్లో పెరిగిన కుర్రాళ్ళే హీరోలుగా... సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

వీడియోలు

Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget