Coolie First Day Collection Prediction: కూలీ ఫస్ట్ డే @ 100 కోట్లు ప్లస్... అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము రేపుతున్న రజనీ... 'లియో'ను దాటుతుందా?
Coolie Box Office Collection Day 1: అడ్వాన్స్ బుకింగ్స్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' దుమ్ము దులుపుతోంది. ఆల్రెడీ వంద కోట్లు దాటింది. విజయ్ 'లియో'ని క్రాస్ చేస్తుందా? లేదా? అంటే...

Rajinikanth's Coolie Box Office Collection Day 1: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కూలీ'. కింగ్ అక్కినేని నాగార్జున విలన్ రోల్ చేశారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ము దులుపుతోంది. మొదటి రోజు వంద కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా.
ఆల్మోస్ట్ 5000 వేల స్క్రీన్లలో విడుదల!
రజనీకాంత్, నాగార్జునకు తోడు ఆమిర్ ఖాన్, శృతి హాసన్, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్ వంటి భారీ తారాగణం ఉండటంతో సినిమాకు విపరీతమైన క్రేజ్ నెలకొంది. కమల్ హాసన్ హీరోగా 'విక్రమ్', 'దళపతి' విజయ్ హీరోగా 'లియో' వంటి సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ దర్శకుడు కావడం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. అందుకని వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 5000 స్క్రీన్లలో సినిమా విడుదల అవుతోంది. తమిళనాడులో 700, తెలుగులో 500 స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. ఓవరాల్ ఇండియా స్క్రీన్ కౌంట్ మూడు వేలకు పైగా ఉంది. 'కూలీ' అడ్వాన్స్డ్ బుకింగ్స్ సేల్స్ వంద కోట్లు దాటింది. అందులోనూ ఫస్ట్ డే కలెక్షన్ కూడా వంద కోట్లకు పైగా రావడం కన్ఫర్మ్.
ఓవర్సీస్ మార్కెట్ నుంచి 70 కోట్లకు పైగా!
అమెరికాతో పాటు మలేషియా, జపాన్ వంటి దేశాల్లో రజనీకాంత్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకని విదేశాల్లో ఆల్మోస్ట్ 2000 స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రీమియర్ షోస్ కలెక్షన్స్ యాడ్ చేసుకుంటే 'కూలీ' మొదటి రోజు ఓవర్సీస్ గ్రాస్ 70 కోట్లకు పైగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: రజనీ 'కూలీ' ఫస్ట్ షో ఎన్నింటికి? నాగ్ విలనిజంపై USA Premier Show రివ్యూస్ వచ్చేది ఎప్పుడంటే?
తమిళనాడు నుంచి దగ్గర దగ్గరగా 30 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు, హిందీతో పాటు ఇతర భాషల నుంచి మరో 20 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 'కూలీ' ఫస్ట్ డే కలెక్షన్స్ 140 కోట్లకు అటు ఇటుగా ఉండొచ్చని ట్రేడ్ టాక్.
దళపతి విజయ్ 'లియో'ని 'కూలీ' బీట్ చేస్తుందా?
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లాస్ట్ సినిమా 'లియో'. దళపతి విజయ్ హీరోగా నటించిన ఆ సినిమా రూ. 143 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని బీట్ చేసి తమిళ ఇండస్ట్రీలో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా 'కూలీ' రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు ఉన్న హైప్ అటువంటిది.
Also Read: కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?





















