War 2 OTT Partner: ఎన్టీఆర్, హృతిక్ మూవీ 'వార్ 2' ఓటీటీ పార్టనర్ ఫిక్స్..వచ్చేది ఎప్పుడంటే!
Hrithik NTR War 2 OTT Release: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి ఓటీటీ పార్టనర్ ఫిక్సైపోయింది..వచ్చేది ఎప్పుడో పూర్తివివరాలు ఇక్కడ చూద్దాం..

Hrithik NTR War 2 OTT Partner: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ మూవీకి ఓటీటీ పార్టనర్ ఫిక్సైపోయింది..వచ్చేది ఎప్పుడో పూర్తివివరాలు ఇక్కడ చూద్దాం..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన మూవీ వార్ 2 (War 2). సేమ్ టైమ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ( Hrithik Roshan ) లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో కనిపిస్తున్న సినిమా కూడా ఇదే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకుడు. YRF బ్యానర్‌లో ఆదిత్య చోప్రా నిర్మించిన వార్ 2 ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. కథలో కొత్తదనం లేదు కానీ యంగ్ టైగర్ నటనతో మరోసారి పూనకాలు తెప్పించాడంటున్నారు ప్రేక్షకులు. థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఓటీటీ పార్టనర్ ఫిక్సైపోయింది.
వార్ 2 ఓటీటీ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఓటీటీలో వార్ 2 వచ్చేది ఎప్పుడంటే (War 2 Expected OTT Release Date) ..థియేటర్లలో రిలీజైన 8 వారాల తర్వాత అని ప్రస్తుతానికి టాక్. అంటే అక్టోబర్ సెకెండ్ వీక్ లో వార్ 2 ఓటీటీలో రిలీజయ్యే ఛాన్సుంది. దసరా కానుకగా ఓటీటీలో రిలీజ్ చేయాలి అనుకుంటే అక్టోబర్ మొదటివారంలోనే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా దసరా సందర్భంగా కానీ దసరా తర్వాత వారం కానీ వార్ 2 ఓటీటీలో చూడొచ్చు.
యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films ) గత సినిమాల్లో యాక్షన్ సీన్స్,చేజింగ్ సన్నివేశాల్లానే వార్ 2 మొత్తం సేమ్ టు సేమ్. ఈ విషయం టీజర్, ట్రైలర్లోనే క్లియర్ గా చెప్పేశాడు దర్శకుడు. ఫస్టాఫ్ లోనే స్టోరీ ఏంటన్నది రివీల్ చేసేశాడు. జపాన్ లో మొదలైన కథ...ఇటలీ, జర్మనీ, ఇండియా చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే తారక్ ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి స్టోరీ జోరందుకుంది. హృతిక్ ఎన్టీఆర్ ఇద్దర్లో ఎవరు బెస్ట్ అంటే ఇది మాత్రం ప్రేక్షకులకు ఫజిలే అని చెప్పాలి. ఇప్పటివరకూ మూవీ చూసిన వారి రియాక్షన్స్ ప్రకారం..ఇద్దరూ పోటాపోటీగా నటించారు. ఆకాశంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ అధిరిపోయిందంటున్నారు ప్రేక్షకులు. సరిగ్గా అప్పుడే విక్రమ్ ఎవరో కబీర్ కి తెలియడంతో ట్విస్ట్ అదిరింది. తానెవరు? ఎందుకు ఇదంతా చేస్తున్నానన్నది కబీర్ విక్రమ్ కి చెప్పడంతో ఒక్కో ట్విస్ట్ రివీల్ అయింది. ఇద్దరి మధ్యా యాక్షన్ సీన్స్, హోరాహోరీ పోరు, ట్విస్టులతో క్లైమాక్స్ మెప్పిస్తుంది. ఇక డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు..ఇద్దరూ ఇద్దరే.
యాక్షన్ మూవీస్ కి కేరాఫ్ అయిన హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో జీవించేశాడు. కొన్ని సన్నివేశాల్లో హాలీవుడ్ మూవీని గుర్తుచేశాడు. ఇక హృతిక్ తో పోటీపడుతూ అదరగొట్టేశాడు తారక్. క్లైమాక్స్ లో నటనతో కన్నీళ్లు పెట్టించేశాడట ఎన్టీఆర్. కియారా అద్వానీ బికినీ సీన్స్ మాత్రమే కాదు యాక్షన్ ఎపిసోడ్ లోనూ మెప్పించింది. థియేటర్లో చూడాలి అనుకుంటే సరే.. ఓటీటీలో చూడాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ 2వ వారం వరకూ ఆగాల్సిందే మరి. గుర్తుంది కదా..నెట్ ఫ్లిక్ లో రాబోతోంది వార్ 2























