Coolie OTT Platform: తలైవా పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ 'కూలీ' - ఏ ఓటీటీలోకిి వస్తుందో తెలుసా?
Coolie OTT Release: తలైవా 'కూలీ' మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీపైనే పడింది. ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth's Coolie OTT Platfrom Locked: తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ 'కూలీ' థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. రజినీ స్టైల్, మాస్, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని... చాలా రోజుల తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ తలైవాలోని పవర్ ఫుల్ మాస్‌ను చూపించారని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ మూవీ ఓటీటీపై పడింది.
ఆ ఓటీటీలోకి...
ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జనరల్‌గా ఏ మూవీ అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. అదే, మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ టైం మరింత ఆలస్యం కావొచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతటా 8 వారాల డీల్ నడుస్తోంది.
కూలీ విషయానికొస్తే... సూపర్ స్టార్ మూవీ కావడం అందులోనూ టాలీవుడ్ టాప్ స్టార్ కింగ్ నాగార్జున విలన్ రోల్, బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్... హిట్ టాక్ రావడంతో ఈ టైం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. 4 నుంచి 8 వారాల మధ్యలో ఓటీటీలోకి 'కూలీ' అందుబాటులోకి వస్తుందా? లేదా లేట్ అవుతుందా? అనే దానిపై క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.
Also Read: 'వార్ 2' ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ సినిమా టాక్ ఏంటి? బాలీవుడ్ డెబ్యూ బ్లాక్ బస్టరేనా? కాదా?
కూలీ... ట్విస్టులు అదుర్స్
పోర్ట్ ఏరియాలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ బ్యాక్ డ్రాప్‌గా ఓ పవర్ ఫుల్ స్టోరీని రూపొందించారు లోకేశ్ కనగరాజ్. ఓ కుర్చీ కోసం జరిగిన వార్ 'కూలీ' కాగా... ట్విస్టులు సర్ ప్రైజ్‌లు అదిరిపోయాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉమెన్ ట్రాఫికింగ్‌తో పాటు మెడికల్ మాఫియా, ఇంకా కొన్ని అంశాలను టచ్ చేశారు లోకేశ్. ఓ స్టైలిష్ విలన్ క్యారెక్టర్‌లో నాగార్జునను చూసిన ఆడియన్స్ వావ్ అనుకుంటారు. ఫస్టాఫ్ ఇంట్రెస్ కలిగిస్తూ దాన్ని అలాగే కొనసాగిస్తూ... ఇంటర్వెల్ సీన్‌లో మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చారని చెబుతున్నారు. మలయాళ యాక్టర్ సౌబిన్ షాహిర్ రోల్, ఆయన యాక్టింగ్ వేరే లెవల్ అని... బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్ రోలెక్స్‌ను తలపించిందంటూ పేర్కొంటున్నారు.
మోనికా అంటూ పూజా హెగ్డేతో సౌబిన్ స్పెషల్ సాంగ్... శ్రుతి హాసన్ రోల్ వేరే లెవల్ అని కామెంట్స్ చేస్తున్నారు. సెకండాఫ్ స్టోరీపై మరింత హైప్ ఇచ్చిందని... చాలా రోజుల తర్వాత మాస్, యాక్షన్ అన్నీ కలగలిపి ఓ ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ అందించారంటూ ట్విట్టర్‌లో హోరెత్తిస్తున్నారు. అటు, ఇప్పటికే ప్రీ బుకింగ్ సేల్స్‌లో రికార్డులు నమోదు కాగా... తమిళంతో పాటు తెలుగు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు ఖాయమని అంటున్నారు. ఫస్ట్ డే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.





















