Shilpa Shetty Raj Kundra: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి కపుల్‌కు బిగ్ షాక్ - రూ.60 కోట్లు మోసం ఆరోపణలు... కేసు నమోదు
Shilpa Shetty: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను రూ.60 కోట్ల మేర మోసం చేశారని ఓ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు చర్యలు చేపట్టారు.

Case Filed Against Shilpa Shetty Raj Kundra: బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులకు బిగ్ షాక్ తగిలింది. తనను మోసం చేశారంటూ ఓ బిజినెస్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు శిల్పాశెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణను ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు.
అసలేం జరిగిందంటే?
పోలీసులు, సదరు వ్యాపారవేత్త తెలిపిన వివరాల ప్రకారం... ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి... తనను హీరోయిన్ శిల్పాశెట్టి దంపతులు మోసం చేశారని తెలిపారు. 2015 - 2023 మధ్య ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం వారికి రూ.60.48 కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు. కానీ, ఆ డబ్బును తమ సొంత అవసరాల కోసం వాడుకున్నారని ఆరోపించారు.
రాజేశ్ అనే వ్యక్తి ద్వారా వారు తనకు పరిచయం అయ్యారని... ఆ టైంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. తొలుత 12 శాతం వడ్డీతో రూ.75 కోట్ల రుణం కావాలని కోరారని... అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలంటూ తనను ఒప్పించారని వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కొఠారీ చెప్పారు. 2016 ఏప్రిల్‍లో తనకు శిల్పాశెట్టి వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని... ఆ తర్వాత కొన్ని నెలలకే ఆమె డైరెక్టర్ పదవికి రిజైన్ చేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆమె బయటకు చెప్పలేదని... ఆ తర్వాత ఆ కంపెనీ దివాలా తీసిందనే విషయం తనకు తెలిసిందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read: 'వార్ 2' ట్విట్టర్ రివ్యూ: ఎన్టీఆర్ సినిమా టాక్ ఏంటి? బాలీవుడ్ డెబ్యూ బ్లాక్ బస్టరేనా? కాదా?






















