అన్వేషించండి
Brahmamudi Serial Today July 1st Episode: రాజ్ కి హగ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన కావ్య, ఫజిల్ లా మారిన రేవతి - బ్రహ్మముడి జూలై 01 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: కావ్యకు చెక్ పెట్టి రాజ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుని ఓడిపోతుంది యామిని. దీంతో విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైంది. బ్రహ్మముడి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
Brahmamudi July 01st Episode -బ్రహ్మముడి సీరియల్ జూలై 01st ఎపిసోడ్
1/11

బోర్డ్ మీటింగ్ పూర్తైన తర్వాత కావ్యకు కాల్ చేసిన యామిని..ఇదంతా నేను చేసిన పనే అని చెబుతుంది. రెండు రోజుల్లో నువ్వు కంపెనీలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది ఈ లోగా ఎంజాయ్ చేయి అని హెచ్చరిస్తుంది. ఈ దెబ్బతో నీ కుటుంబంలో నీ స్థానం పడిపోతుంది అంటుంది యామిని
2/11

మీ అక్కని కాపాడుకునేందుకు సతీసావిత్రిలా పోరాడుతా అన్నావ్ కదా నీ కంపెనీ బాధ్యతలు చేజారిపోకుండా ఎలా కాపాడుకుంటావో చూస్కో అంటుంది. ఈ సమస్య నుంచి రాజ్ తప్ప ఎవ్వరూ బయటపడేయలేరు..రిస్క్ తీసుకుని రాజ్ కి నిజం చెబితే ఏం జరుగుతుందో నీకు తెలుసు అంచుంది.
3/11

అప్పూ పోలీస్ స్టేషన్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు బయటగొడవపడతారు. వాళ్లని లోపలకి పిలిపించి ఏం జరిగిందో అడిగితే డబ్బులు బాకీ ఉన్నాడని చెబుతారు. అప్పు మీచేతులమీదుగా తీర్చేయండి నేను డబ్బులిస్తాను అంటాడు ఒకడు.. ఆ డబ్బులు మీ చేతులమీదుగా ఇవ్వండి అంటాడు మరొకడు..సరే అంటుంది అప్పు
4/11

పోలీస్ స్టేషన్లో గొడవపడిన ఇద్దరూ బయటకువెళ్లి హమ్మయ్య ప్లాన్ సక్సెస్ అయిందంటూ యామినికి కాల్ చేసి చెబుతారు. ఇక పని అయిపోయింది అప్పు అనుకుంటుంది యామిని
5/11

రాజ్ కార్టూన్ చూసి ఎంజాయ్ చేస్తుంటే అక్కడకు వెళ్లిన ఇందిరాదేవి, అపర్ణ..కళావతిపై కోపం రాలేదాఅని అడుగుతారు. కళావతి గారు ఆఫీసుకే కదా వెళ్లారు రాగానే నా మనసులో మాట చెప్పేస్తాను అంటాడు.
6/11

ఇంతలో కావ్య కాల్ చేసి పర్సనల్ గా కలవాలి అంటుంది..ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెబుతుంది. అంటే మా ప్రేమ గురించే అయి ఉంటుంది అని పొంగిపోతాడు రాజ్. కళావతి షేర్ చేసిన లొకేషన్ కి వెళతాడు
7/11

ఏదో ముఖ్యమైన విషయం అన్నారు ఏంటి అని అడిగితే.. గతంలో ఓసారి మాబాస్ గురించి చెప్పానుకదా అంటే..అవును ఆయన ఫారెన్లో ఉంటారు కదా అంటాడు రాజ్. కంపెనీలో పెద్ద సమస్య వచ్చింది మీనుంచి సహాయం కావాలి అంటుంది
8/11

మీరు మా బాస్ లా యాక్ట్ చేయండని బతిమలాడుతుంది. నావల్లకాదు అనేస్తాడు మాలాంటి వాళ్లకోసం ఎందుకు హెల్ప్ చేస్తారు ఆ యామిని లాంటివాళ్లు చనిపోతానని బెదిరిస్తే మాత్రం ఇష్టంలేకపోయినా ఒప్పుకుంటారు అంటుంది. కంపెనీని నమ్ముకున్నచాలామంది రోడ్డునపడతారని కావ్య అంటుంది
9/11

ఉద్యోగుల జీవితాలు రోడ్డునపడతాయని కావ్య చెప్పడంతో రాజ్ సరే అంటాడు. ఆనందంగా హగ్ చేసుకుంటుంది కావ్య. ఆనందంతో కూడిన షాక్ లో ఉంటాడు రాజ్. మీకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఇంటికి తీసుకెళ్తుంది
10/11

మీ బాస్ ఎలాంటివాడు అని రాజ్ అడుగుతాడు. తప్పు చేసింది తనవారే అయినా ఆలోచించకుండా శిక్షవేస్తాడు, మంచి చేసింది పరాయివాళ్లు అయినా నెత్తినపెట్టుకుంటాడు, భార్యను టార్చర్ చేస్తాడు, తల్లిని ప్రేమగా చూసుకుంటాడు అంటుంది.
11/11

బ్రహ్మముడి జూలై 02 ఎపిసోడ్ లో కావ్య, స్వప్నను కాపాడిన రేవతి తన కొడుకుతో చెప్పుల షాప్ లో ఉంటుంది. ఆ షూస్ కొనమని బాబు అడిగితే 2 వేలు అని చెబుతాడు షాపులో వ్యక్తి. తన దగ్గర అన్ని డబ్బులు లేకపోవడంతో తర్వాత కొంటా అంటుంది రేవతి. ఇదంతా చూస్తారు రాజ్, కావ్య. ఆ షూస్ కొనేసి తీసుకెళ్లి ఇస్తుంది కావ్య..రాజ్ ని చూడగానే కన్నీళ్లతో పరుగున వెళ్లి హగ్ చేసుకుంటుంది రేవతి. ఎలా ఉన్నావురా అని అడుగుతుంది. ఈయన మీకు ముందే తెలుసా అంటుంది కావ్య...
Published at : 01 Jul 2025 10:14 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















