అన్వేషించండి
Pawan Kalyan Latest Look : TFJA వెబ్‌సైట్ లాంచ్ చేసిన పవన్ కళ్యాణ్
'తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్' (TFJA) అధికారిక వెబ్‌సైట్‌ను శనివారం జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) లాంచ్ చేశారు.

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్
1/4

TFJA అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి వై.జె రాంబాబు, కోశాధికారి నాయుడు సురేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న 'తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్' వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్‌ను తన చేతుల మీదుగా విడుదల చేయడం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
2/4

పవన్ కళ్యాణ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న లక్ష్మీనారాయణ, వైజే రాంబాబు, నాయుడు సురేంద్ర కుమార్
3/4

''175 మంది సభ్యులున్న 'తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్'లో నాకు బాగా నచ్చిన అంశం జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత బీమా కింద రూ. 15 లక్షలు, యాక్సిడెంట్ పాలసీ కింద రూ. 25 లక్షలు ఇవ్వడం జర్నలిస్టుల కుటుంభం సభ్యులకు ధైర్యాన్ని ఇస్తుంది'' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
4/4

''ఆదర్శవంతమైన జర్నలిజంతో సమాజంలో తప్పు ఒప్పులను సరి చేసేలా, అనవసర వివాదాల జోలికి వెళ్లకుండా, ఒకవేళ వివాదాలు ఏమైనా జరిగితే... గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుందని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా'' అని పవన్ తెలిపారు.
Published at : 10 Sep 2022 05:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
లైఫ్‌స్టైల్
ప్రపంచం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion