అన్వేషించండి
Bigg Boss 8 Contestant Kirrak Seetha: కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పిన కిరాక్ సీత - ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
Bigg Boss 8 Kirrak Seetha: బిగ్‌బాస్ 8 తెలుగు కిరాక్ సీత కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని చెప్పింది. గతంలో ఓ ఇంటర్య్వూలో చేసిన ఆమె కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Image Credit: kirrakseetha/Instagram
1/7

Bigg Boss 8 Kirrak Seetha: ఈసారి అన్‌లిమిటెడ్ ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్తగా ప్రేక్షకుల ముందకు వచ్చింది బిగ్‌బాస్ 8 తెలుగు. అన్నట్టు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ కంటెస్టెంట్స్‌కి షాకిస్తున్నాడు బిగ్‌బాస్. మొదట్లోనే గ్రూపులు డివైడ్ చేసి కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోటీ పెట్టాడు.
2/7

రేషన్ కావాంటూ టాస్క్‌లు గెలవాలంటూ చుక్కలు చూపిస్తున్నాడు. అలా రెండో వారానికే బిగ్‌బాస్ చాలా ఆసక్తిగా మారింది. బిగ్‌బాస్ అంటే గొడవలు, వివాదాలుతో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. రీసెంట్ ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్స్‌కి ఇష్టమైన వారిని గుర్తు చేసి అందరిని భావోద్వేగానికి గురి చేశాడు బిగ్‌బాస్.
3/7

కంటెస్టెంట్స్‌లో కూడా తమ ఆటను మెరుగుపరుచుకుని స్ట్రాంగ్ అవుతున్నారు. అందులో మణికంఠ, కిరాక్ సీతలు ముందున్నారు. గతవారం కంటే రెండో వారం తమ ఆట తీరుతో బిగ్‌బాస్‌ను మెప్పించారు. కిరాక్ సీత అయితే గాయాలను కూడా లెక్క చేయకుండ తన టీంకు రేషన్ కోసం గట్టిగా పోరాడింది.
4/7

దీంతో రెండో ఆమె ఆటతీరుకు ఏకం హోస్ట్ నాగార్జునే ఫిదా అయ్యారు. దీంతో కిరాక్ సీత ఒక్కసారిగా హాట్‌టాపిక్ అయ్యింది. బేబీ సినిమాతో సినీఎంట్రీ ఇచ్చిన ఆమె ఇందులో నెగిటివ్ రోల్లో నటించింది. షార్ట్ ఫిలిం, యూట్యూబ్ వీడియోలతో గుర్తింపు పొందిన కిరాక్ సీత కెరీర్ ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందట.
5/7

ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్య్వూలో తెలిపిందే. ఓ పాత ఇంటర్య్వూలో సితా మాట్లాడుతూ... ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్ననని చెప్పింది. మొదట్లోనే ఓ సినిమా ఆఫర్ వచ్చిందని, రూ. 25 లక్షల పారితోషికం ఇస్తానన్నారని చెప్పింది.
6/7

అది విని షాక్ అయ్యా.. కానీ ఆ సినిమాలో నటించాలంటే మూవీ మేకర్స్‌ని కలవడానికి ఫామ్ హౌస్‌కి వెళ్లాలని, ఫారిన్ ట్రిప్‌కి వెళ్లాలని చెప్పారంది. అలా చెప్పడంతో తనకు అనుమానం వచ్చిందనీ, కెరీర్ ప్రారంభంలోనే ఇంత పెద్ద రెమ్యనరేషన్ ఎందుకు ఇస్తున్నారనే అనుమానం వచ్చింది.
7/7

అప్పుడే అసలు విషయం అర్థమైందని, దీంతో ఆ మూవీ ఆఫర్ ను రిజెస్ట్ చేశాననంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. (Image Source: kirrakseetha/Instagram)
Published at : 15 Sep 2024 12:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion