అన్వేషించండి
Tata Tiago EV: ఈ EV మీ ఏడాది ఖర్చు ఆదా చేస్తుంది! రోజువారీ ఆఫీసుకు వెళ్లడానికి ఉత్తమ ఎంపిక
Tata Tiago EV: టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు నిర్వహణ ఖర్చు పెట్రోల్ కార్ల కంటే తక్కువ. ధర, ఖర్చు వివరాలు తెలుసుకోండి.
టాటా టియాగో EV
1/7

విద్యుత్ కార్లు వాడకం రోజురోజుకు పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది ఈవీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఇక్కడ మేము టాటా టియాగో EV (Tata Tiago EV) గురించి చెప్పబోతున్నాం. ఇది ఆఫీసుకు వెళ్ళేవారికి ఒక గొప్ప కారు.
2/7

టాటా టియాగో EV ఎక్స్ షోరూమ్ ధర 7.99 లక్షల రూపాయల నుంచి ప్రారంభమై 11.49 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లలో వస్తుంది.
3/7

టాటా టియాగో బేస్ మోడల్ ఫుల్ ఛార్జ్‌తో 250 km రేంజ్‌ను అందిస్తుంది. అయితే టాప్ వేరియంట్‌లో ఈ పరిధి 315 km వరకు ఉంటుంది. టియాగో EV టాప్ వేరియంట్‌లో 24kWh బ్యాటరీ లభిస్తుంది.
4/7

మీరు నెలకు 1500 కిలోమీటర్లు (రోజుకు సగటున 50 కిలోమీటర్లు) నడిపిస్తే నెలకు 2145 రూపాయలు ఖర్చవుతుంది. సంవత్సరానికి 20000 కిలోమీటర్లు నడిపిస్తే ఈ ఖర్చు 28000 రూపాయలు అవుతుంది.
5/7

టియాగో EV ని పెట్రోల్‌తో నడిచే టియాగోతో పోల్చితే టియాగో పెట్రోల్‌లో 35 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ లభిస్తుంది.
6/7

టియాగో మైలేజ్ లీటరుకు 18.42 కిలోమీటర్లు, ఇది ఫుల్ ట్యాంక్ చేస్తే దాదాపు 645 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పెట్రోల్ ధర లీటరుకు 100 రూపాయలు అని భావిస్తే, 3,500 రూపాయలు ఖర్చు అవుతుంది.
7/7

ఈ కారు 1 కిలోమీటర్ నడపడానికి దాదాపు 5.42 రూపాయలు ఖర్చవుతుంది. మీరు నెలకు 1500 కిలోమీటర్లు నడిపితే, మీరు ఇంధనం కోసం 8,130 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది.
Published at : 03 Jul 2025 10:48 PM (IST)
View More
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















