అన్వేషించండి
Vijayawada Floods: వరద సహాయ చర్యలపై సీఎం సమీక్ష- అర్థరాత్రి వేళ విజయవాడలో పర్యటన
Andhra Pradesh: శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు విజయవాడ చివురుటాకులా వణికిపోయింది. ఇప్పటికీ ఆ ప్రాంతం జలదిగ్బంధంలోనే ఉంది. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు రాత్రివేళలో పర్యటించారు.

అర్థరాత్రి వేళ విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన
1/10

భారీ వర్షాలకు, వరదలకు విజయవాడ పూర్తిగా నీట మునిగిపోయింది. నీట మునిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు పర్యటించారు.
2/10

ప్రజలకు అందుతున్న సాయం, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు
3/10

మోకాళ్లు లోతు వరద నీటిలోనే పర్యటించిన చంద్రబాబు.. వరద బాధితులను పరామర్శించారు.
4/10

వరద బాధితులతో మాట్లాడి వారి సాదకబాదకాలు తెలుసుకున్నారు. అధికారులు వచ్చారా లేదా ఆరా తీశారు.
5/10

ప్రభుత్వం అండగా ఉంటుందని ఎలాంటి ఇబ్బంది పడొద్దని ధైర్యం కోల్పోవద్దని వారి భరోసా ఇచ్చారు చంద్రబాబు
6/10

వరద బాధిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ చర్యలపై కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
7/10

జోరు వానలో కూడా సీఎం చంద్రబాబు పర్యటన సాగింది. ఉదయం పూట బోటులో తిరిగిన చంద్రబాబు... రాత్రి మాత్రం నడిచే బాధితుల వద్దకు చేరుకున్నారు.
8/10

ఇంకా వరద ముంచెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి చేపట్టాల్సిన సహాయక చర్యలను తీసుకోవాలని అధికారులను చంద్రబాబు సూచించారు.
9/10

అవసరమైతే అక్కడి నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
10/10

సమస్యలు ఉంటే మాత్రం అధికారులకు వెంటనే తెలియజేయాలని సీఎం చంద్రబాబు బాధితులకు సూచించారు.
Published at : 02 Sep 2024 08:26 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రికెట్
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion