ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సోమవారం సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్యన మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభం అయ్యాయి.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగరవేశారు.
శ్రీ రామకృష్ణ దీక్షితులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు.
సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.
ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ రోజున ప్రజలు, భక్తులు, యాత్రికులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపును గమనించి ప్రత్యామ మార్గాలను ఉపయోగించుకోవాలని, అలాగే ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు, భక్తులకు తిరుపతి పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఫోటోలు: తామర, తులసి గింజలతో శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం
ఫోటోలు: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నేడు హంస వాహనంపై మలయప్ప స్వామి - ఫోటోలు చూడండి
చంద్రబాబు కోసం కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన- రాజమండ్రి నిరసనల్లో బ్రాహ్మణీ, భువనేశ్వరి
చంద్రబాబును విజయవాడ తరలింపులో ఉద్రిక్తత- పలు చోట్ల కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రజలు- లాగిపడేసిన పోలీసులు
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు నుంచి తరలింపు వరకు - క్షణ క్షణం ఉత్కంఠే- మార్కాపురంలో లాఠీఛార్జ్
BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు
NDA కూటమిలో చేరిన జేడీఎస్, అమిత్‌షాతో భేటీ తరవాత కీలక నిర్ణయం
Agent OTT Release Date: ఓటీటీలోకి ‘ఏజెంట్’ ఎంట్రీ - డేట్ ఫిక్స్ చేసిన సోనీ లివ్!
Chandrababu News: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 25న - రేపు వాదనలు వినబోమన్న జడ్జి
/body>