అన్వేషించండి
Sri Padmavathi Ammavari Brahmotsavam 2024: మోహినీ అలంకారంలో అలమేలుమంగ- అమ్మవారిని చూసి పరవశించిపోయిన భక్తులు
Tirumala News : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.

మోహినీ అలంకారంలో అలమేలుమంగ-
1/7

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహినీ అలంకారంలో పల్లకీలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.
2/7

అమ్మవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది.
3/7

ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ కృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
4/7

ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు.
5/7

మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వసంతోత్సవం నిర్వహిస్తారు.
6/7

బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుంచి 10 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు.
7/7

వాహనసేవల్లో తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి, ఈవో జె.శ్యామల రావు, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Published at : 02 Dec 2024 01:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
పాలిటిక్స్
సినిమా రివ్యూ
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion