Google Outage: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు! ట్విటర్‌లో ఫిర్యాదుల వెల్లువ
Google Services: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు గూగుల్ డౌన్ అయిందని ట్వీట్లు చేస్తున్నారు. గూగుల్ డౌన్ అవ్వగానే ట్విటర్‌లో సందేశాల వరద వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు నిలిచినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 9) గూగుల్ సేవలు పనిచేయడం లేదంటూ ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్య భారత దేశంలోని వినియోగదారులకు కూడా ఎదురవుతోందని ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. Downdecetor.com అనే వెబ్‌సైట్ లోని వివరాల ప్రకారం, దాదాపు 40 వేల మందికి పైగా ఫిర్యాదులు దాఖలు చేశారు.
ట్విటర్‌లో ట్వీట్ల వరద
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వారు గూగుల్ డౌన్ అయిందని ట్వీట్లు చేస్తున్నారు. గూగుల్ డౌన్ అవ్వగానే ట్విటర్‌లో సందేశాల వరద వచ్చింది. సెర్చ్ చేస్తుండగా, 500 అనే ఎర్రర్ ను ఎదుర్కొంటున్నామని వినియోగదారులు చెబుతున్నారు. అయితే, ట్విటర్‌లో వస్తున్న ట్వీట్ల ప్రకారం.. వియత్నాం, జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశం మరియు స్పెయిన్‌లోని వినియోగదారులకు గూగుల్ సేవలు డౌన్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ సేవల్లో అంతరాయంపై ఇంకా గూగుల్ స్పందించలేదు. సేవలను పునరుద్ధరించేందుకు టీమ్ పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
me using twitter as a search engine to check if google is down pic.twitter.com/GjNRoA3WzW
— val♥ (@omlitsari) August 9, 2022
Had a Google search engine error for the first time ever. The engine was totally down. It's so rare the first thing I did was come to Twitter to see if anything major is going on with the web. Conspiracy theories here we come! #google #error
— Ryan Baker (@RyanBakerSLO) August 9, 2022
గూగుల్ సేవలు నిలిచిపోయినట్లుగా ప్రముఖ Outage Tracking Website అయిన Downdetector.com ధ్రువీకరించింది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా 40 వేల వరకూ ఫిర్యాదులు అందాయని ఆ సైట్ వెల్లడించింది. గూగుల్ సెర్చ్ చేస్తుండగా, కొంత మంది 502 Error అని వస్తుందని చాలా మంది చెప్పినట్లుగా వివరించింది. 502 Error అంటే ‘‘సర్వర్ లో తాత్కాలిక లోపాన్ని తలెత్తింది. మీ అభ్యర్థనను పూర్తి చేయలేకపోతోంది. 30 సెకండ్ల తర్వాత మళ్లీ ప్రయత్నించండి. (The server encountered a temporary error and could not complete your request. Please try again in 30 seconds)’’ అని యూజర్లు ఎర్రర్ ఎదుర్కొంటున్నట్లుగా డౌన్ డిటెక్టర్ సైట్ తెలిపింది.
కాసేపు గూగుల్ ట్రెండ్స్ (Google Trends) కూడా
అయితే, గూగుల్ ట్రెండ్స్ సర్వీస్ కూడా కాసేపు పని చేయలేదని డౌన్ డిటెక్టర్ సైట్ వెల్లడించింది. ఆ లింక్ ఓపెన్ చేయగా, Trends Empty అని చూపించింది. అయితే, రియల్ టైం ట్రెండ్స్ కనిపించాయి. ఈ సర్వీస్ కాసేపటికి గూగుల్ రీస్టోర్ చేసింది.
గూగుల్ డేటా సెంటర్‌లో (Explosion In Google Data Center) ప్రమాదం!
గూగుల్ డేటా సెంటర్‌లో (Google Date Center) పెద్ద ఎలక్ట్రికల్ సర్క్యూట్‌లో (Electrical Explosion at Google) పేలుడు జరిగినట్లుగా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయని కథనాలు రాశాయి. ఈ ప్రమాదం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ (Google Search Engene) సేవలకు అంతరాయం కలిగినట్లుగా తెలుస్తోంది. దీనిపై గూగుల్ సంస్థ అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు.