అన్వేషించండి

corona virus: ఆ దేశాధ్యక్షులు సారీ చెబుతున్నారు..! ఇండియాను చూసి నేర్చుకోలేదా..?

కరోనా టైంలో ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో అందరికీ తెలిసిందే. కొన్ని దేశాల్లో ముందస్తుగా పరిస్థితి అంచనా వేయలేకపోవడంతో చాలా మంది మృతి చెందారు. దీనిపై ఆయా దేశాధ్యకులు క్షమాపణలు చెప్పారు.

ప్రపంచంలో అనేక దేశాల అధ్యక్షులు సారీ చెబుతున్నారు. ఎవరికో కాదు. తమ ప్రజలకే చెబుతున్నారు. ఎందుకంటే.. కరోనాను సమర్థంగా డీల్ చేయలేకపోయామని.. ప్రజలు చనిపోయారని... అందుకే క్షమాపణలు కోరుతున్నామని చెబుతున్నారు.  ఆస్ట్రేలియాప్రధానమంత్రి ఈ విషయంలో ఎమోషనల్ అయ్యారు. ఐయామ్ సారీ అంటూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పోలాండ్, తైవాన్ ప్రెసిడెంట్లు కూడా అదే చేశారు. పదవిలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సారీ చెప్పారు. ఇక కరోనా వ్యవహారంలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు ఎదుర్కొన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ బోల్స్ నారో కూడా అదే తరహాలో క్షమాపణలు చెప్పారు. 

అధ్యక్షులు చేస్తున్నఈ క్షమాపణల ప్రకటనలు... అంతర్జాతీయంగా హెడ్ లైన్స్ అవుతున్నాయి. ఇంత నిజాయితీగా వారు ప్రజలకు సారీ చెబుతూండటం.. చాలా మందికి నచ్చుతోంది. కానీ.. ఇండియాలో మాత్రం.. వారిపై జాలిగా చూస్తున్నారు. వారంతా ఇండియాను చూసి నేర్చుకోకుండా తప్పు చేశారని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బాగా కరోనాను నియంత్రించిన దేశం భారత్. ఎంతగా అంటే... ఒక్కటంటే.. ఒక్క ఆక్సీజన్ అందని మరణం ఇండియాలో చోటు చేసుకోలేదు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. పార్లమెంట్‌లోనే గొప్ప తనాన్ని ఆవిష్కరించింది. 

అలాగే.. ప్రపంచం మొత్తం కరోనా కట్టడి విషయంలో భారత్ వైపు చూసిందని మోడీ చాలా సార్లు స్వయం సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఇక కోవిన్ యాప్ గురించి.. ఓ పెద్ద వర్క్ షాప్‌ను ప్రపంచానికి అవగాహన కల్పించడానికి నిర్వహించారు కూడా. ఆ కోవిన్ యాప్‌లో రిజిస్టర్ చేసుకున్న వారికి ఇప్పటికీ.. వ్యాక్సిన్ అందకపోవడం పెద్ద విషయం కాదు . ఆ యాప్ ఎన్నో సార్లు క్రాష్అయినా లెక్కలో లేదు. కానీ.. యాప్ మాత్రం.. ప్రపంచ అద్భుతం. ఇలాంటి యాప్ గురించి.. ఇండియా నుంచి ముందే తెలుసుకునే ప్రయత్నాన్ని ఆ దేశాధ్యక్షులు చేయలేదు.  
  
ఇండియా ప్రభుత్వం కరోనా కట్టడికి ఏం చేసిందో.. ఎలా చేసిందో.. కాస్త చూసినట్లయితే.. ఆ విధంగా సారీ చెప్పే పరిస్థితి వచ్చి ఉండేది కాకపోవచ్చునని కొంత మంది సీరియస్‌గానే చెబుతున్నారు. వినే వాళ్లకు అది కామెడీగా ఉండొచ్చు. కానీ.. కరోనాను కట్టడి చేయలేకపోయినా.. ప్రజల్ని చప్పట్లు కొట్టించడం.. దీపాలు వెలిగించడం వంటి ఎమోషన్లు అయినా వారు నేర్చుకుని ఉండేవారు. టీకాలు ప్రజలకు పెద్దగా పంపిణీ చేయకపోయినా బాహుబలి గురించి ధైర్యం మాట్లాడగలిగేవాళ్లు. అన్నింటి కన్నా ముఖ్యంగా కళ్ల ముందు జరిగిన దాన్ని కూడా.. జరగలేదని చెప్పడం.. ప్రచారం చేయడం నేర్చుకుని ఉండేవారు. అప్పుడు.. వారు ఎవరికీ సారీ చెప్పాల్సిన పనే ఉండేది కాదు. అందుకే.. వారంతా ఇండియా వైపు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇది సెటైర్ కాదు.. సీరియస్సే..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget