Russia: అణుదాడికి రెడీ అవుతున్న రష్యా - ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపైనే మొదటి గురి !
Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాయుధాల డ్రిల్‌కు ఆదేశాలిచ్చారు. సైన్యం పని ప్రారంభించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా, బ్రిటన్‌పై అణుదాడులు చేస్తామని ఇప్పటికే పుతిన్ ఓ సారి హెచ్చరించారు.
Russia Test Fires Long Range Missiles: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం రెండున్నరేళ్లుగా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో రష్యా అధ్కయక్షుడు తమ యుద్ధం కీలక పొజిషన్‌కు చేరుకుందని ప్రకటించారు. అణు బలగాలు ప్రత్యేక డ్రిల్స్ చేయాలని ఆయన ఆదేశించారు. వ్లాదిమిర్ పుతిన్ నుంచి ఆదేశాలు అందడంతో కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని అణురహతి మిసైల్స్‌ను ప్రయోగించి టెస్టు చేశారని చెబుతున్నారు. పుతిన్ ఇటీవలి కాలంలో వరుసగా సైనిక కసరత్తులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రెండు వారాల సమయంలో ఆయన సైనిక డ్రిల్స్ కోసం రెండో సారి ఆదేశాలు జారీ చేశారు.
ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరిక
ఉద్రిక్తతలు పెరిగిపోవడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలే కారణమని రష్యా అంటోంది. రష్యాలోని సుదూర భూభాగాలను సైతం తన లక్ష్య పరిధిలోకి తెచ్చుకునేలా ధీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించేలా ఉక్రెయిన్‌కు అనుమతి ఇవ్వాలని అమెరికా నేతృత్వంలోని నోటా కూటమి దళాలు యోచిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతలకు ఈ పరిస్థితే కారణంగా ఉంది. తమపై దాడి చేసే ఉక్రెయిన్ మాత్రమే కాదు.. ఉక్రెయిన్‌కు ఆయుధాలిచ్చేవారు కూడా తమకు శత్రువులేనని వారిపై అణుదాడి చేయడం తమ విధానంలో భాగమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంతకు ముందే ప్రకటించారు.
రష్యాపై దాడి చేయడానికి మరిన్ని ఆయుధాలిచ్చే యోచనలో నాటో దేశాలు
రష్యా గత నెలలో అణ్వాయుధాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేసింది. అణ్వాయుధేతర దేశాలపై కూడా అణ్వస్త్రాలను ఉపయోగించడానికి అనుమతించేలా మార్పులు తీసుకొచ్చారు. అందుకే పశ్చిమ దేశాలను రష్యా హెచ్చరించింది. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో అణ్వాయుధాల వినియోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. రష్యా ఉధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాలు జోక్యం చేసుకోకూడదని అనుకుంటున్నారు. కనీ ఉక్రెయిన్ కు మాత్రం ఇతర దేశాలు ముఖ్యంగా నాటో దేశాలు అండగా ఉంటున్నాయి.
జర్మనీ విదేశాంగ మంత్రి వస్తే స్వాగతం చెప్పడానికి ప్యూన్‌ని కూడా పంపలేదు - చైనా ఇంత ఘోరమా ?
అగ్రదేశాలపై దాడికి డ్రిల్స్ ప్రారంభించిన రష్యా
రెండున్నరేళ్ల కిందట రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయింది. ఇప్పటి వరకూ దానికి ముగింపు పలకలేదు. రెండు వైపులా తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున సైనికుల చనిపోయారు. అయితే పరిష్కారం మాత్రం లభించడం లేదు. పరిష్కారం ఏమిటో ప్రపంచ దేశాలకూ అర్థం కావడం లేదు అదే సమయంలో అటు పశ్చిమాసియాలో.. ఇటు కొరియాల మధ్య కూడా ఉద్రిక్తతలు ప్రారంభమవుతున్నాయి. ఈ అన్ని పరిణామాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమో అన్న భయం ప్రపంచమంతటా వ్యక్తమవుతోంది.