Chaina: జర్మనీ విదేశాంగ మంత్రి వస్తే స్వాగతం చెప్పడానికి ప్యూన్‌ని కూడా పంపలేదు - చైనా ఇంత ఘోరమా ?
German Foreign Minister: కీలకమైన చర్చలు నిర్వహించడానికి జర్మనీ విదేశాంగ మంత్రి చైనాకు వచ్చారు. ఆమెకు కనీసం మర్యాదకు పలకరించడానికి కూడా చైనా ప్రభత్వం ఎవర్నీ పంపలేదు.
German Foreign Minister receives no welcome in China: మన దేశానికి చైనా విదేశాంగ మంత్రి వస్తే ఎంత హడావుడి ఉంటుంది..?. ప్రోటోకాల్ ప్రకారం ఓ ఇరవై, ముఫ్పై మంది అధికారులు అయినా వరుసగా నిలబడి స్వాగతం చెబుతారు. ఒక్క చైనానే కాదు ఏ దేశ విదేశాంగ మంత్రి వచ్చినా ప్రోటోకాల్ ఉంటుంది. ఒక్క మన దేశంలోనే కాదు.. అన్ని దేశాలు ఈ మర్యాదను పాటిస్తాయి. ఎందుకంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనేది అందరికీ తెలుసు. కానీ చైనాకే అందరి కంటే అహం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉద్దేపూర్వకంగా ఎవరినైనా అవమానించడానికి కూడా వెనుకాడదు. దానికి తాజాగా జరిగిన ఈ ఘటనే సాక్ష్యం.
చైనాలో పర్యటించడానికి కీలకమైన అంశాలను చర్చించడానికి జర్మనీ విదేశాంగ మంత్రిని చైనా ఆహ్వానించింది. ఇరుదేశాల మధ్య అంగీకారం మేరకు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలీనా బార్బోక్ ప్రత్యేక విమానంలో బీజింగ్ వచ్చారు. తమ అతిధిగా వస్తున్న ఓ దేశ విదేశీ మంత్రికి చైనా అధికారులు షాక్ ఇచ్చారు. ఆమె వస్తున్న సంగతి తెలిసి కొంత మంది మీడియా ప్రతినిధులు వచ్చారు కానీ చైనా ప్రభుత్వం తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. చివరికి రెడ్ కార్పెట్ కూడా వేయలేదు. ఏ దేశానికి వెళ్లినా ప్రోటోకాల్ స్వాగతాలు అందుకునే విదేశీ చైనాలో దిగిన తర్వాత ఏం జరిగిందో అర్థం కాక జర్మనీ ఎంబసీ అధికారులు ఏర్పాటు చేసిన కారులో వెళ్లిపోయారు.
జర్మనీ విదేశాంగ మంత్రికి జరిగిన అవమానం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా ఇంత ఘోరంగా ఓ అగ్రరాజ్య దేశ విదేశాంగ మంత్రిని అవమానించడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది.
🇩🇪🇨🇳 German Foreign Minister Annalena Baerbock didn't receive a formal welcome from local officials upon arriving in China, and she looked disoriented, unlike a high-ranking official. pic.twitter.com/SbMqzTpjqO
— King Chelsea Ug 🇺🇬🇷🇺 (@ug_chelsea) October 28, 2024
ఇలా అవమానిస్తున్న చైనాలో పర్యటించాల్సిన అవసరం ఏమిటని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
What was the need to visit China? If this was the treatment on arrival, what is going to happen while in China. She should have gone back to her country in the same flight then and there.
— Shankar Sharma (@UdaySha92130512) October 29, 2024
సోషల్ మీడియాలో ఇంత రచ్చ జరుగుతున్నా చైనా ప్రభుత్వం మాత్రం తప్పుడు ఎక్కడ జరిగిందో వివరణ ఇవ్వలేదు. అయితే అధికారిక సమావేశాలు పూర్తి చేసుకున్న తర్వాత చైనాకు రిటర్న్ మర్యాదలు ఎలా ఇవ్వాలో ఆలోచించాలని జర్మనీ భావిస్తోంది. మొత్తంగా ఓ దేశ విదేశాంగ మంత్రికి జర్మనీ చేసిన అవమానం మాత్రం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అవుతోంది.