By: Ram Manohar | Updated at : 17 Jun 2023 03:58 PM (IST)
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
PM Modi US Visit:
జూన్ 21న అమెరికాకు..
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడే మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. మోదీని ఆహ్వానించేందుకు అమెరికాలోని భారతీయులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఘనంగా స్వాగతించేందుకు NRIలు సిద్ధమవుతున్నారు. వైట్‌హౌజ్ వెలుపల భారత జాతీయ పతాకాన్ని ఎగరేశారు. కొందరు యంగ్ మ్యుజీషియన్స్ వాషింగ్టన్‌లో రిహార్సల్స్ చేస్తున్నారు. ప్రధాని మోదీకి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మోదీ అభిమాని చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మేరీలాండ్‌లోని ఓ ఫ్యాన్ తన కార్‌కి "NMODI" నంబర్ ప్లేట్ పెట్టుకున్నాడు. తన అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. "ప్రధాని మోదీ గారి కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను" అని చెబుతున్నాడు.
"ఈ నంబర్ ప్లేట్‌ని 2016లోనే తీసుకున్నాను. నరేంద్ర మోదీ నాకెంతో స్ఫూర్తినిచ్చారు. దేశానికి, ప్రపంచానికి మంచి చేయాలనే స్ఫూర్తిని నాకు ఆయనే నాకు ఇచ్చారు. మోదీ ఇక్కడికి వస్తున్నారంటే ఎంతో ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను"
- రాఘవేంద్ర, ప్రధాని మోదీ వీరాభిమాని
#WATCH | A 'fan' of PM Narendra Modi flaunts "NMODI" car number plate in Maryland, USA pic.twitter.com/AO5WRwdGoa
— ANI (@ANI) June 17, 2023
#WATCH | "I took this plate back in 2016, November. Narendra Modi is an inspiration to me. He inspires me to do something good for the nation, for society, for the world. PM Modi is coming here so I'm eagerly waiting to welcome him," says Raghavendra pic.twitter.com/CMRHNdUuYU
— ANI (@ANI) June 17, 2023
ప్రధాని మోదీ అమెరికా పర్యటన వివరాలు వెల్లడించారు విదేశాంగమంత్రి జైశంకర్. ఇది కచ్చితంగా దేశ గౌరవాన్ని పెంచే పర్యటన అవుతుందని తేల్చి చెప్పారు. ఈ స్టేట్ విజిట్ ఎంతో ప్రత్యేకమైందని అన్నారు.
"ప్రధాని మోదీ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఈ స్టేట్ విజిట్‌తో దేశ గౌరవం ఇంకా పెరుగుతుందన్న నమ్మకముంది. కొంత మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవమిది. భారత ప్రధాన మంత్రి యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగం ఇవ్వడం ఇదే తొలిసారి. అందుకే ఈ పర్యటనకు అంత ప్రాధాన్యత"
- జైశంకర్, భారత విదేశాంగ మంత్రి
యూఎస్ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ ప్రసంగించడమే కాదు..అక్కడి కీలక నేతలందరినీ కలవనున్నారు. అక్కడి భారతీయులతోనూ మాట్లాడనున్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆయన నేతృత్వంలో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలూ జరగనున్నాయి. ఐక్యరాజ్యసమితి హెడ్‌క్వార్టర్స్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు.
#WATCH | The Tricolour flies high outside the White House, Washington D.C., United States, ahead of PM Narendra Modi's state visit to the US. pic.twitter.com/0vm4Pt2q7e
— ANI (@ANI) June 16, 2023
Also Read: Russia Nuclear Weapons: రష్యాని టచ్ చేస్తే న్యూక్లియర్ వార్ తప్పదు, వార్నింగ్ ఇచ్చిన పుతిన్
భారత్‌తో మైత్రి మాకు చాలా అవసరం, దారికి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో!
India-Canada Row: కెనడా వివాదంపై నోరు విప్పని భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
కెనడా ఆర్మీ వెబ్‌సైట్‌ని హ్యాక్ చేసిన ఇండియన్ హ్యాకర్స్! మరింత పెరిగిన ఉద్రిక్తతలు
బిచ్చగాళ్లను ఎగుమతి చేస్తున్న పాకిస్థాన్, వీసాలు తీసుకుని మరీ విదేశాలకు!
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
/body>