Russia Nuclear Weapons: రష్యాని టచ్ చేస్తే న్యూక్లియర్ వార్ తప్పదు, వార్నింగ్ ఇచ్చిన పుతిన్
Russia Nuclear Weapons: రష్యా అణ్వాయుధాలను బెలారస్‌కు తరలిస్తున్నట్టు పుతిన్ ప్రకటించారు.
Russia Nuclear Weapons:
అణుయుద్ధం తప్పదా..?
ఉక్రెయిన్‌పై రష్యా న్యూక్లియర్ వార్ ప్రకటించనుందా..? చాలా రోజులుగా ఈ వాదన వినిపిస్తూనే ఉన్నా...రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. బెలారస్‌లో ఇప్పటికే అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచాం అంటూ పుతిన్ తేల్చి చెప్పారు. ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన...ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే...రష్యా భూభాగంపై దాడి చేయాలని చూసినప్పుడు మాత్రమే న్యూక్లియర్ వార్‌కి దిగుతామని స్పష్టం చేశారు పుతిన్. అటు అగ్రరాజ్యం మాత్రం రష్యా అణ్వాయుధాలు వినియోగిస్తుందనడానికి ఎలాంటి సంకేతాలు లేవని చాలా రోజులుగా వాదిస్తోంది. ఇటు పుతిన్ మాత్రం దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య ప్రారంభించింది రష్యా. అప్పటి నుంచి బెలారస్ రష్యాకు హెల్ప్ చేస్తోంది. చెప్పాలంటే...ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో ఇది "లాంఛ్‌ప్యాడ్"గా మారింది. పూర్తి స్థాయిలో అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించే యోచనలో ఉంది రష్యా. "మాపైన వ్యూహాత్మకంగా గెలవాలని చూసే వాళ్లకు ఇదో వార్నింగ్" అని పుతిన్ స్పష్టంగా చెప్పడం అంతర్జాతీయంగా అలజడి రేపుతోంది. "మీరు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తున్నారా..?" అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పుతిన్.
"ప్రపంచం మొత్తాన్ని భయపెట్టాల్సిన అవసరం మాకేముంది..? ఇప్పటికే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రష్యా భూభాగంపై దాడి చేయాలని, ఆక్రమించుకోవాలని చూసినప్పుడు అణ్వాయుధాలు ప్రయోగించడానికి కూడా వెనకాడం"
- పుతిన్, రష్యా అధ్యక్షుడు
Putin confirms first nuclear weapons moved to Belarus
— ANI Digital (@ani_digital) June 17, 2023
Read @ANI Story | https://t.co/X623ZQXCPI#Putin #Belarus #RussiaUkraineWar pic.twitter.com/OqtynxLz7Z
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ చేస్తున్న నేరాలకు తప్పకుండా శిక్ష అనుభవిస్తాడని తేల్చి చెప్పారు. త్వరలోనే ఇది జరిగి తీరుతుందని జోష్యం చెప్పారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న హేగ్ నగరంలోనే ఈ కామెంట్స్ చేశారు జెలెన్స్కీ.
"పుతిన్ తన బలాన్ని చూసుకుని మిడిసిపడుతున్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేసి తీవ్రమైన నేరం చేశారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఉన్న ఈ హేగ్ సిటీలో పుతిన్‌ను చూడాలని ఉంది. ఆ కోర్టు విధించిన శిక్ష అనుభవిస్తూ పుతిన్ ఇక్కడే ఉండాలని మేం బలంగా కోరుకుంటున్నాం. అలాంటి శిక్షకు ఆయన అర్హుడే. కచ్చితంగా ఇది జరుగుతుందని ఆశిస్తున్నాం. మేం విజయం సాధించిన వెంటనే పుతిన్‌కు శిక్ష పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం. యుద్ధానికి కారణమైన వాళ్లు ఇలాంటి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదు"
- జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు
పుతిన్ హత్యకు కుట్ర..
క్రెమ్లిన్‌లోని పుతిన్ ఆఫీస్‌పై డ్రోన్లు కనిపించడం సంచలనమైంది. వెంటనే అలెర్ట్ అయిన రష్యా సైన్యం రెండు డ్రోన్లను కూల్చి వేసింది. ఇది ఉక్రెయిన్ పనేనని, పుతిన్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసిందని ఆరోపించింది రష్యా. దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది. దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కోలో డ్రోన్లపై నిషేధం విధించింది. ఇప్పుడే కాదు. రష్యాలో పలు సార్లు ఇలాంటి డ్రోన్ దాడులు జరిగాయి. ప్రతిసారీ ఉక్రెయిన్‌పై వేలెత్తి చూపుతోంది రష్యా.
Also Read: Joe Biden Trolled: పసిఫిక్ నుంచి హిందూ మహాసముద్రం వరకూ రైల్వే - బైడెన్ వింత వ్యాఖ్యలపై ట్రోల్స్