Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ ఇప్పటివరకు 12 దేశాలకు విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

FOLLOW US: 

Monkeypox: మంకీపాక్స్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్‌ కేవలం పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించింది. ఇప్పటివరకు 92 కేసులు నమోదయ్యాయి.

మంకీపాక్స్ కేసులు మరింత వేగంగా పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

ఆఫ్రికాతో మొదలైన ఈ డేంజరస్ వైరస్ అక్కడ్నించి ఇతర దేశాలకు పాకడం కూడా మొదలైపోయింది. అమెరికా, ఇంగ్లాండ్‌లలో అక్కడక్కడ ఈ వైరస్ సోకిన రోగులు ఆసుపత్రికి రావడం అక్కడ కలవరంగా మారింది. తుమ్ము, దగ్గులు, గాలి ద్వారా ఈ వైరస్ వ్యాపించదని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తితో శారీరకంగా చాలా దగ్గరగా ఉంటేనే ఇదే సోకే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ సమయంలో ఈ వైరస్ నోరు, ముక్కు, కళ్లు, శ్వాసనాళం ద్వారా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే గాయాలు తగిలినప్పుడు చర్మం ఓపెన్ అయి ఉంటుంది. వైరస్ ఆ గాయం ద్వారా శరీరంలో చేరే అవకాశం ఉంది. 

లక్షణాలు 

మంకీపాక్స్ మశూచిని పోలి ఉంటుంది. ఇది ఆఫ్రికాలోని పశ్చిమదేశాల్లో, మధ్య దేశాల్లో కనిపిస్తుంది. ప్రారంభ దశలో జలుబుగా ఎక్కువమంది భావిస్తారు. ఇది తీవ్రంగా మారినప్పుడు చర్మంపై ఎర్రటి దద్దుర్లు పెరగిపోతాయి. ప్రారంభదశలో కనిపించే లక్షణాలు ఇలా ఉంటాయి. 

1. తలనొప్పి
2. జ్వరం
3. వెన్ను నొప్పి
4. కండరాల నొప్పి
5. చలి
6. అలసట

అమ్మవారిలాగే...

చికెన్ పాక్స్ ను మన దగ్గర అమ్మవారు అని పిలుచుకుంటారు. దాదాపు అందులో కనిపించే లక్షణాలే మంకీ పాక్స్ వైరస్ సోకినప్పుడు కూడా కనిపిస్తాయి. అరచేతులు, అరికాళ్లపై అధికంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. అమ్మవారు సోకినా కూడా తీవ్ర జ్వరం ఉంటుంది. మంకీ పాక్స్ సోకినా తీవ్ర జ్వరం కనిపిస్తుంది. 

ఎందుకొస్తుంది?

మాంసాహారం తినేవారిలో అధికంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల లేదా ఈ వైరస్‌ను మోస్తున్న జంతువులను ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి చేయడం వల్ల కూడా మంకీపాక్స్ వైరస్ శరీరంలో చేరుతుంది. ఈ వైరస్ సోకాక రెండు నుంచి నాలుగు వారాల్లో పోతుంది. ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనది కాదని ఆరోగ్యినిపుణులు నిర్ధారించారు. 

ఈ వైరస్‌ను 1958లో తొలిసారి గుర్తించారు. కోతులలో ఈ వైరస్ మొదటిసారి బయటపడడంతో దీనికి మంకీ పాక్స్ అని పేరు వచ్చింది.  

Published at : 22 May 2022 07:01 PM (IST) Tags: WHO virus Monkeypox virus Cases

సంబంధిత కథనాలు

MLC Kavitha: అప్పుడు ఎన్టీఆర్‌ వల్ల, ఇప్పుడు కేసీఆర్‌తో ఆ గుర్తింపు వచ్చింది: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: అప్పుడు ఎన్టీఆర్‌ వల్ల, ఇప్పుడు కేసీఆర్‌తో ఆ గుర్తింపు వచ్చింది: ఎమ్మెల్సీ కవిత

Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్

Elon Musk on Twitter: గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది-ట్విటర్‌కు పది రోజులు బ్రేక్ ఇచ్చిన ఎలన్ మస్క్

Bill Gates Resume: బిల్‌గేట్స్‌ రెజ్యూమ్‌ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు

Bill Gates Resume: బిల్‌గేట్స్‌ రెజ్యూమ్‌ చూశారా- ఆయన చేసిన కోర్సులు చూస్తే షాక్ అవుతారు

Ukraine Crisis: పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ

Ukraine Crisis: పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ - ఉక్రెయిన్ యుద్ధంపై కీలక చర్చ

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

టాప్ స్టోరీస్

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

IndiGo flights Delay : సిక్ లీవ్ పెట్టి ఇంటర్య్వూకు చెక్కేసిన ఇండిగో సిబ్బంది, 900 విమాన సర్వీసులపై ప్రభావం

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao : తెలంగాణకు మోదీ మొండి చెయ్యి, ప్రధాని కల్లబొల్లి కబుర్లు చెప్పారు- మంత్రి హరీశ్ రావు

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్

Balakrishna: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' టీమ్ తో బాలయ్య - లుక్ అదుర్స్