అన్వేషించండి

Maldives: పీఎం మోదీపై అనుచిత వ్యాఖ్యలు - ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవులు

Maldives Ministers: భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. ముగ్గురు మంత్రులపై అక్కడి ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది.

Maldives Ministers Suspend: భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi )పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాల్దీవులు (Maldives) దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులపై ఆ దేశ ప్రభుత్వం సస్పెండ్ వేటు వేసింది. మంత్రులు మరియం షియునా (Maryam Shiuna), మల్షా షరీఫ్ (Malsha Shareef ), మహ్జూమ్ మజీద్ (Mahzoom Majid) సస్పెన్షన్‌కు గురైనట్లు మాల్దీవులు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికే మంత్రి మరియం షియునా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవి అని మాల్దీవులు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వారిపై మాల్దీవులు ప్రభుత్వం వేటు వేసింది.

'బాయ్ కాట్ మాల్దీవ్స్'

భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై మాల్దీవుల మంత్రులు మరియం షియునా, మల్షా షరీఫ్ , మహ్జూమ్ మజీద్ చేసిన వ్యాఖ్యలతో నెట్టింట పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియాలో భారతీయులు ట్రెండింగ్ చేశారు. నెటిజన్లతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు.. తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ క్రమంలో మాల్దీవుల ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విషయం ఏంటంటే?
ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యదీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి. వాటిలో ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మరియం షియునా అనుచిత వ్యాఖ్యలు చేశారు. లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మరియం స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ దేశపు తోలు బోమ్మ అంటూ అనుచిత  కామెంట్‌ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు.

మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ సైతం ప్రస్తుత మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అవమానకరమైన, జాత్యహంకార వ్యాఖ్యలు అంటూ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత్‌తో దౌత్యపరమైన విభేదాలకు కారణమవుతుందని మండిపడ్డారు. మొహమ్మద్ ముయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌తో ఆ దేశ సంబంధాలు తెబ్బతిన్నాయి. భారత్‌తో ఉన్న ఇండియా ఫస్ట్ విధానాన్ని మార్చాలంటూ ప్రతిజ్ఞ చేసి అధికారంలోకి వచ్చారు. మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తరువాత తన తొలి పర్యటన సంప్రదాయ రీతిలో భారత్‌లో కాకుండా టర్కీలో పర్యటించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget