అన్వేషించండి

US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్

US Iran War Latest News | యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ముందు 5 కండీషన్లు పెట్టారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో కీలక షరతులు, విభేదాలు బయటపడ్డాయి.
  • ఇరాన్ తన 400 కిలోల యురేనియంను అమెరికాకు అప్పగించాలని డిమాండ్.
  • ఇరాన్ తన అణు కర్మాగారాల్లో ఒకదాన్ని మాత్రమే సక్రియంగా ఉంచాలి.
  • ఇరాన్ ఆంక్షల తొలగింపు, ఆస్తుల విడుదల కోరుతోంది.

వాషింగ్టన్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరు దేశాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒకరి కండీషన్లకు మరొకరు అంగీకరించడం లేదు. ఇటీవల దాదాపు 14 పాయింట్ల ఫార్ములాను ఇరాన్ పంపగా అమెరికా రిజెక్ట్ చేసింది. ఉద్రిక్తతలు తమకు కూడా నష్టాన్ని కలిగిస్తుండటంతో త్వరగా ముగించడానికి ఇరాన్ ముందు అమెరికా 5 ప్రధాన కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో ఇరాన్ అణు కర్మాగారాలు, యురేనియం సహా అనేక ఇతర అంశాల్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు.

ఇరాన్ ముందు అమెరికా ఏ షరతులు పెట్టింది?

ఇరాన్ ప్రభుత్వ ఫార్స్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. అమెరికా చర్చల సందర్భంగా తన మొదటి కండీషన్లో టెహ్రాన్ పై ఇప్పటికే విధించిన ఆంక్షలు, తన విధానాల వల్ల ఇరాన్ కు జరిగిన నష్టానికి ఎలాంటి పరిహారం ఇవ్వదని పేర్కొంది. దీనంతో పాటు, ఇరాన్ తన 400 కిలోల సుసంపన్న యురేనియంను వాషింగ్టన్ కు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా, అమెరికా 3వ కండీషన్.. ఇరాన్ తన మొత్తం అణు సౌకర్యాలలో (న్యూక్లియర్ ఫెసిలిటీస్) ఒకదాన్ని మాత్రమే సరిగ్గా ఉంచుకోవచ్చని పేర్కొంది. నాల్గో కండీషన్..  ఇరాన్‌కు విదేశాలలో ఉన్న ఆస్తులలో 25 శాతం తిరిగి విడుదల చేయడానికి అమెరికా నిరాకరించింది. దీంతో పాటు 5వ కండీషన్లో అమెరికా వివిధ రంగాలలో ఉద్రిక్తతలు ముగించడానికి చర్చలలో పురోగతి, ముగింపు కోసం ఇరాన్‌పై ఒత్తిడి చేసింది. 

Also Read: US Iran War Updates: 47 ఏళ్లుగా ఇరాన్ మాతో గేమ్స్ ఆడుతోంది, ఇకపై వాళ్లు నవ్వలేరు: డొనాల్డ్ ట్రంప్

యుద్ధంలో సాధించలేని వాటిని డిమాండ్ చేస్తున్న US

ఇరాన్ మెహర్ న్యూస్ ఏజెన్సీ అమెరికా కండీషన్లపై ఇలా రిపోర్ట్ చేసింది. 'అమెరికా యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ప్రతిపాదనపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అమెరికా యుద్ధంలో సాధించలేని అన్ని డిమాండ్లను చర్చల ద్వారా నెరవేర్చుకోవాలని కోరుకుంటోంది. దీనివల్ల చర్చలు మళ్లీ మొదటికి రానున్నాయి' అని పేర్కొంది.

Also Read: Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?

ఇరాన్ కూడా చర్చల కోసం నమ్మకాన్ని పెంపొందించే 5 ముందస్తు షరతులు అమెరికా ముందు పెట్టిందని మీడియా తెలిపింది. ఇందులో అన్ని రంగాలలో పోరాటాన్ని ముగించడం, ముఖ్యంగా లెబనాన్ లో ఉద్రిక్తతలను తగ్గించడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ పై, హర్మూజ్ జలసంధింపై విధించిన ఆంక్షలను, దిగ్బంధనం తొలగించడం, దాని స్తంభింపచేసిన విదేశీ ఆస్తులను విడుదల చేయడం వంటి కండీషన్లు ఉన్నాయి. దీంతో పాటుగా యుద్ధం వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం, ప్రపంచ చమురు సరఫరా కోసం హర్మూజ్ పై తన సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని అగ్రరాజ్యం అమెరికాను ఇరాన్ డిమాండ్ చేసింది.

Frequently Asked Questions

అమెరికా ఇరాన్ ముందు ఏ ఐదు ప్రధాన షరతులు పెట్టింది?

అమెరికా ఇరాన్ పై విధించిన ఆంక్షలు, నష్టానికి పరిహారం ఇవ్వదని, 400 కిలోల సుసంపన్న యురేనియంను అప్పగించాలని, అణు కర్మాగారాల్లో ఒకదాన్ని మాత్రమే సక్రియం చేయాలని, విదేశీ ఆస్తులలో 25% తిరిగి విడుదల చేయడానికి నిరాకరించింది, మరియు చర్చల్లో పురోగతిపై ఒత్తిడి చేసింది.

యుద్ధంలో సాధించలేని వాటిని US సాధించాలని కోరుకుంటుందా?

అవును, ఇరాన్ మీడియా ప్రకారం, అమెరికా ఎటువంటి వాస్తవ రాయితీ లేకుండా, యుద్ధ సమయంలో సాధించలేని అన్ని డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటోంది.

టెహ్రాన్ కూడా చర్చల కోసం ఏ షరతులు పెట్టింది?

టెహ్రాన్ అన్ని రంగాలలో పోరాటాన్ని ముగించడం, లెబనాన్ లో ఉద్రిక్తతలను తగ్గించడం, ఆంక్షలను తొలగించడం, స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం, నష్టానికి పరిహారం, మరియు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ పై సార్వభౌమాధికారాన్ని గుర్తించాలని కోరింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget