అన్వేషించండి

Chilkur Balaji Visa Temple: చిలుకూరు బాలాజీ పవర్‌ను చూసి భయపడుతున్న అమెరికన్ సెనెటర్ - పని చేతకాక చిందులు తొక్కుతున్నారా?

H1 B VisaControversy: హైదరాబాద్‌ లోని చిలుకూరు బాలాజీ దేవాలయంకు వీసా టెంపుల్ అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మొక్కుకున్నవారికి వీసాలు వస్తాయని నమ్మకం. అదే అమెరికన్ సెనెటర్లకు భయం పుట్టేలా చేస్తోంది.

US Senator Remarks on Chilkur Balaji Temple:  భారతీయ ఐటీ నిపుణులు, విద్యార్థుల కలల నిలయం,  వీసా గాడ్ గా పేరొందిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని అమెరికా రాజకీయ నేతలు వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు.  అమెరికాలోని మిస్సోరి రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ సెనేటర్  ఎరిక్ ష్మిత్ , హెచ్-1బీ  వీసా విధానంపై విమర్శలు చేస్తూ నేరుగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దేవాలయాన్ని ఆయన ఒక  వీసా కార్టెల్  గా అభివర్ణించడం వాళ్లలోని అసహనాన్ని చూపిస్తోంది. 

 సెనేటర్ కోపానికి కారణమేంటి? 
 
సెనేటర్ ఎరిక్ ష్మిత్ సోషల్ మీడియా వేదికగా అమెరికా ఉద్యోగ మార్కెట్‌పై సుదీర్ఘమైన పోస్ట్‌లు చేశారు. ఇందులో భాగంగా చిలుకూరు బాలాజీ ఫోటోను షేర్ చేస్తూ..  ఈ వీసా కార్టెల్‌కు హైదరాబాద్‌లో ఒక  వీసా టెంపుల్  కూడా ఉంది. వేలాది మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను ఇక్కడ పూజ చేయించి, అమెరికా ఉద్యోగాల కోసం వీసాలు పొందుతున్నారు  అని వ్యాఖ్యానించారు. అమెరికన్ కంపెనీలు స్థానికులను కాదని, తక్కువ జీతాలకే లభించే భారతీయ నిపుణులను ప్రోత్సహిస్తున్నాయని, ఈ వ్యవస్థ అంతా ఒక స్కామ్ అని ఆయన ఆరోపించారు.

 భారతీయుల ప్రతిభే వారి భయమా? 

 సెనేటర్ వ్యాఖ్యల వెనుక కేవలం రాజకీయాలే కాకుండా, భారతీయ నిపుణులపై ఉన్న ఒక రకమైన  అభద్రతా భావం  స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాలోని టెక్ రంగంలో భారతీయులు సాధిస్తున్న విజయాలు, ముఖ్యంగా ఏఐ (AI) వంటి ఆధునిక సాంకేతికతల్లో భారతీయుల ఆధిపత్యం పెరగడం అమెరికన్ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. మెరిట్ పరంగా భారతీయులతో పోటీ పడలేక, ఇలాంటి వీసా కార్టెల్  అనే ముద్ర వేసి భారతీయ ప్రతిభను తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆధ్యాత్మికతపై దాడి? 

చిలుకూరు బాలాజీని  వీసా కార్టెల్‌గా  పేర్కొనడంపై భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. క్రైస్తవ మతంలో తమ కోరికల కోసం ప్రార్థనలు చేయడం ఎలా సహజమో, హిందువులు తమ ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకోవడం కూడా అంతే సహజమని నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. కేవలం వీసా కోసమే కాకుండా, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పురాతన దేవాలయాన్ని ఒక మాఫియాతో పోల్చడం భారతీయుల విశ్వాసాలపై జరిగిన దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.  

 అమెరికా రాజకీయాల్లో ఇండియా కార్డు 

అమెరికాలో స్థానిక నిరుద్యోగితకు విదేశీయులే కారణమనే వాదనను తెరపైకి తెచ్చి ఓట్లు దండుకునేందుకు ఎరిక్ ష్మిత్ వంటి నేతలు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1 వీసాల ద్వారా అమెరికా వెళ్లే వారిలో 70-80 శాతం భారతీయులే ఉండటం వల్ల, వీరిని లక్ష్యంగా చేసుకోవడం ద్వారా అమెరికన్ మధ్యతరగతి ప్రజల మద్దతు పొందవచ్చని వారి వ్యూహంగా కనిపిస్తోంది. ఒక పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ వివాదాల్లోకి లాగడం వల్ల అమెరికా-భారత్ మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా, భారతీయ ఐటీ రంగ నిపుణుల మేధస్సును తట్టుకోలేకే అమెరికన్ సెనేటర్లు ఇలాంటి అసహనపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని నెటిజన్లు ఘాటుగా సమాధానమిస్తున్నారు.   

టాప్ హెడ్ లైన్స్

MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Shubman Gill, Rishabh Pant Record: ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్
ఒకే ఇన్నింగ్స్‌లో చరిత్ర సృష్టించిన గిల్, పంత్.. డబ్ల్యూటీసీలో 3000 పరుగులు దాటిన తొలి భారత ఆటగాళ్లుగా రికార్డు, సెంచరీ చేజారడంతో నిరాశలో కెప్టెన్
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Kolathur By Election 2026: కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!
కొళత్తూర్ ఉపఎన్నికతో అసెంబ్లీలో స్టాలిన్ రీఎంట్రీ ఛాన్స్.. తమిళనాట వేడెక్కిన రాజకీయం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget