అన్వేషించండి

Huawei MateBook Fold S: హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ ల్యాప్‌టాప్.. 14.7 ఇంచుల ఫోల్డబుల్ OLED డిస్‌ప్లే.. ఫీచర్లు, ధర వివరాలు!

Huawei MateBook Fold S: హువావే మార్కెట్లోకి సరికొత్త ఫోల్డబుల్ పీసీ మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్‌ను లాంచ్ చేసింది. ఇది పెద్ద ల్యాప్‌టాప్‌గా, ఫోల్డ్ చేసినప్పుడు కాంపాక్ట్ నోట్‌బుక్‌గా ఉంటుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హువావే మేట్‌బుక్ ఫోల్డ్ S 14.7 అంగుళాల OLED, 10.2 అంగుళాల కవర్ స్క్రీన్.
  • కిరిన్ XE90 చిప్‌సెట్, 32GB RAM, 1TB స్టోరేజ్ వరకు లభ్యం.
  • 50MP వెనుక, 12MP ముందు కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్.
  • నవంబర్ 27 నుండి సేల్స్, ధర రూ. 1.87 లక్షల నుండి మొదలు.

Huawei MateBook Fold S: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల తర్వాత ఇప్పుడు ఫోల్డబుల్ కంప్యూటర్ టెక్నాలజీ టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. టెక్ దిగ్గజం హువావే తన సరికొత్త ఫోల్డబుల్ పీసీ మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ (MateBook Fold S) ను మార్కెట్లో లాంచ్ చేసింది. అవసరాన్ని బట్టి పెద్ద ల్యాప్‌టాప్‌గా, ఫోల్డ్ చేసినప్పుడు కాంపాక్ట్ నోట్‌బుక్‌గా మార్చుకునేలా దీనిని రూపొందించారు.  

1. డిజైన్, ట్విన్ డిస్‌ప్లే  

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ డిజైన్ కంపెనీ అంతకు ముందు 'మేట్‌బుక్ ఫోల్డ్ అల్టిమేట్' పీసీని పోలి ఉంటుంది. దీనిని పూర్తిగా ఓపెన్ చేస్తే 14.7 ఇంచుల ఫ్లెక్సిబుల్ OLED స్క్రీన్ కనిపిస్తుంది. UTG త్రీ-లేయర్ టెక్నాలజీతో ఈ డిస్‌ప్లే 3240 x 2160 పిక్సెల్ రిజెల్యూషన్, 1-120Hz LTPO రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ మ్యాక్స్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ల్యాప్‌టాప్‌ను మూసివేసినప్పుడు ఇది 10.2 ఇంచుల కాంపాక్ట్ నోట్‌బుక్‌గా మారుతుంది. దీని కవర్ భాగంలో 980 x 980 పిక్సెల్ రిజెల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగిన ప్రత్యేక స్క్రీన్ ఉంది. దీనికి కంపెనీ 'లైవ్ స్మాల్ స్క్వేర్ స్క్రీన్' అని పేరు పెట్టింది.

దీనిని సులభంగా నిలబెట్టి ఉపయోగించుకోవడానికి వెనుక వైపున బిల్ట్-ఇన్ స్టాండ్ ఉంది. ఫిజికల్ కీబోర్డ్ కోరుకునే వారి కోసం టచ్‌ప్యాడ్, ఎం-పెన్సిల్ స్టైలస్ సపోర్ట్‌తో ఫోల్డబుల్ కీబోర్డ్‌ను కూడా అందించారు.

2. కిరిన్ XE90 ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్

హార్మొనీఓఎస్ బేస్డ్ పీసీలో హువావే సొంత కిరిన్ XE90 చిప్‌సెట్‌ను అమర్చింది. పాత తరం ప్రాసెసర్లతో పోలిస్తే ఇది సింగిల్ కోర్ పనితీరును 23 శాతం, NPU పనితీరును 40 శాతం మెరుగుపరుస్తుందని, అలాగే 25 శాతం ఎక్కువ పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 16GB నుంచి 32GB వరకు RAM, 256 GB నుంచి 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. 22W వరకు విద్యుత్ వినియోగంతో నిరంతరాయ పనితీరును అందించడానికి యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్, హీట్ కంట్రోల్ సిస్టమ్ ఉంది. 

3. కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జింగ్

సాధారణ ల్యాప్‌టాప్‌లకు భిన్నంగా ఇందులో హై ఎండ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరాతో పాటు మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ లెన్స్, ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉన్నాయి. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 55 శాతం, 65 నిమిషాల్లో 100 శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుందని హువావే తెలిపింది.

Also Read: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి

4. వేరియంట్లు, ధరలు 

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ నవంబర్ 27 సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి. 

Frequently Asked Questions

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ అంటే ఏమిటి?

ఇది హువావే విడుదల చేసిన ఒక సరికొత్త ఫోల్డబుల్ కంప్యూటర్. దీన్ని పెద్ద ల్యాప్‌టాప్‌గా, అవసరం లేనప్పుడు కాంపాక్ట్ నోట్‌బుక్‌గా మార్చుకోవచ్చు.

మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ డిస్‌ప్లే విశేషాలు ఏమిటి?

పూర్తిగా తెరిచినప్పుడు 14.7-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED స్క్రీన్ ఉంటుంది. మూసివేసినప్పుడు ఇది 10.2-అంగుళాల నోట్‌బుక్‌గా మారుతుంది, దీని కవర్‌పై ప్రత్యేక స్క్రీన్ ఉంటుంది.

ఇందులో ఏ ప్రాసెసర్ ఉపయోగించారు?

ఈ పీసీలో హువావే సొంత కిరిన్ XE90 చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది మునుపటి వాటితో పోలిస్తే 23 శాతం మెరుగైన సింగిల్ కోర్ పనితీరును అందిస్తుంది.

దీని ఛార్జింగ్ సామర్థ్యం ఎంత?

ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 55 శాతం, 65 నిమిషాల్లో 100 శాతం పూర్తి ఛార్జింగ్ అవుతుంది.

హువావే మేట్‌బుక్ ఫోల్డ్ ఎస్ ధర ఎంత?

దీని ప్రారంభ ధర 16GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్‌కు రూ. 1.87 లక్షలు. టాప్ మోడల్ (32GB RAM + 1TB స్టోరేజీ) ధర రూ. 2.87 లక్షలు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanamkonda BRS Vs Congress: వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
వరంగల్ పశ్చిమలో రాజకీయ రసాభాస.. అభివృద్ధి సవాళ్ల నుంచి దాడుల దాకా.. హన్మకొండలో హైటెన్షన్!
TTD LIC Insurance Scheme: తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
తిరుమల భక్తులకు టీటీడీ భరోసా.. సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా.. తొలిసారిగా బీమా మొత్తం అందజేత
Vaibhav Sooryavanshi World Record: చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
చరిత్రను తిరగరాసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 52 బంతుల్లో డబుల్ సెంచరీతో అరుదైన ప్రపంచ రికార్డు, 28 బంతుల్లో శతకంతో పాటు 28 సిక్సర్లతో సునామీ
This Week Movies : శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
శర్వానంద్ భోగి To చిన్న సినిమాల సందడి - ఈ వారం థియేటర్లలో మూవీస్... ఈ మూవీ మార్నింగ్ షో ఫ్రీగా చూడొచ్చు
TVK MLA Arul Vignesh: మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం!
మహిళా కలెక్టర్‌కు వేధింపులు.. సీఎం విజయ్‌కి తలనొప్పిగా TVK ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్‌ వ్యవహారం
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
బాచుపల్లిలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌ క్లీన్ చేస్తూ ఊపిరాడక ముగ్గురు యువకులు మృతి!
Gaganayan Mission: గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
గగన్‌యాన్‌కు సిద్ధమవుతున్న భారత వ్యోమగాములు.. రష్యాలో Zero Gravity Training!
Trainee IPS Harassment Case: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు
Embed widget