అన్వేషించండి

Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

Easy Steps to Clean Laptop Keyboard : ల్యాప్​టాప్ కీబోర్డుపై పేరుకుపోయే దుమ్ము, ధూళి పేరుకొని కీలు పనిచేయడంలేదా. మరి కీ క్యాప్​ల కింద దుమ్మును సరైన పద్ధతిలో ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • లాప్‌టాప్ ఆఫ్ చేసి, తలక్రిందులుగా తిప్పి దుమ్ము తొలగించండి.
  • మెత్తని బ్రష్, కంప్రెస్డ్ ఎయిర్‌తో కీబోర్డ్ శుభ్రం చేయండి.
  • మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచి, మరకలు ఆల్కహాల్‌తో తొలగించండి.

ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్నప్పుడు.. కీబోర్డ్‌పై దుమ్ము, ధూళి, వేలిముద్రల నూనె పేరుకుపోవడం కామన్. కానీ కొన్నిసార్లు కీక్యాప్‌ల కింద దుమ్ము పేరుకుపోతుంది. దీనికారణంగా కీలు సరిగ్గా పనిచేయవు. దీని ప్రభావం టైపింగ్ నుంచి గేమింగ్ వరకు అన్నింటిలోనూ కనిపిస్తుంది. ఆ సమయంలో కచ్చితంగా కీబోర్డ్ శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను శుభ్రపరచడానికి ప్రత్యేక యంత్రం లేదా ఖరీదైన క్లీనింగ్ కిట్ అవసరం లేదు. 

ల్యాప్​టాప్​ కీబోర్డ్ శుభ్రం చేయడానికి కొన్ని సాధారణ వస్తువులు సరిపోతాయి. వాటితో సులభంగా కీబోర్డ్ క్లీన్ చేయవచ్చు. మరి ల్యాప్‌టాప్ కీబోర్డ్‌ను శుభ్రపరచడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం. 

ఫస్ట్ స్టెప్

ముందుగా ల్యాప్‌టాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేసి.. పవర్ సప్లై నుంచి డిస్‌కనెక్ట్ చేయాలి. ఆ తర్వాత కీబోర్డ్ కీల కింద, లోపల ఉన్న దుమ్ము, ధూళి బయటకు పోయేలా ల్యాప్‌టాప్‌ను తలక్రిందులుగా తిప్పండి.

Also Read : కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే

సెకండ్ స్టెప్

సింథటిక్ పెయింట్ బ్రష్ వంటి మృదువైన బ్రష్‌ను ఉపయోగించి.. కీల మీద, వాటి మధ్య ఉన్న దుమ్మును సున్నితంగా తుడవండి. బ్రష్‌ను మరీ బలంగా ఉపయోగించకూడదు. ఎందుకంటే అలా చేస్తే దుమ్ము కీక్యాప్‌ల కిందకు వెళ్లిపోతుంది.

థర్డ్ స్టెప్

త్వరిత క్లీనింగ్ కోసం.. కంప్రెస్డ్ ఎయిర్ ఇవ్వాలి. నాజిల్‌ను కీబోర్డ్‌కు సుమారు ఒక అంగుళం దూరంలో పట్టుకుని.. ఎడమ నుంచి కుడికి Z ఆకారంలో గాలిని నెమ్మదిగా స్ప్రే చేయాలి. మ్యాక్‌బుక్‌ల కోసం ఆపిల్ 75-డిగ్రీల కోణాన్ని సిఫార్సు చేస్తుంది. ఆ తర్వాత మీరు ల్యాప్‌టాప్‌ను 90 డిగ్రీలు తిప్పి.. ఇదే ప్రక్రియను రిపీట్ చేయాలి. 

ఫోర్త్ స్టెప్

బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించిన తర్వాత.. మైక్రోఫైబర్ వస్త్రంతో కీబోర్డును మెల్లగా తుడవండి. ఇది మిగిలి ఉన్న మురికి, నూనెలను తొలగించడానికి సహాయపడుతుంది. పేపర్ టవల్ ఉపయోగించకూడదు. ఎందుకంటే చిన్న ముక్కలు కీల కింద ఇరుక్కుపోవచ్చు.

Also Read : ఇంటిని డీప్ క్లీనింగ్ చేయడానికి చెక్ లిస్ట్ ఇదే.. ఇలా చేస్తే మూలమూలలా మెరిసిపోతుంది

ఫైనల్ స్టెప్

కీలపై అధికంగా నూనె లేదా మరకలు ఉంటే.. 70 శాతం కంటే ఎక్కువ గాఢత ఉన్న ఐసోప్రొపైల్(70% IPA) ఆల్కహాల్‌ను ఉపయోగించవచ్చు. దానిని నేరుగా కీబోర్డ్‌పై పోయకుండా.. ఒక మైక్రోఫైబర్ క్లాత్​కి అద్ది.. కీలను సున్నితంగా శుభ్రం చేయండి. ఆల్కహాల్ కీల కిందకు ఇంకిపోకుండా ఉండేందుకు.. తక్కువ ఒత్తిడితో క్లీన్ చేయాలి.

గుర్తించుకోవాల్సిన విషయాలు

మీ ల్యాప్‌టాప్ మోడల్‌కు తీసివేయగల కీక్యాప్‌లు ఉంటే.. అప్పుడు మాత్రమే వాటిని తీసి శుభ్రం చేయండి. వాటిని తీసేటప్పుడు కీక్యాప్‌లకు నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. తిరిగి అమర్చే ముందు వాటిని బాగా ఆరనివ్వండి. కీబోర్డ్‌పై నీరు లేదా ఏదైనా ద్రవం పడితే.. ల్యాప్‌టాప్‌ను ఆఫ్ చేసి.. తలక్రిందులుగా ఉంచి.. కనీసం 24 గంటల పాటు దాని కింద ఒక టవల్ ఉంచండి. సోడా లేదా ఇతర థిక్ డ్రింక్స్ పడితే.. ల్యాప్‌టాప్‌ను ప్రొఫెషనల్ రిపేర్ షాపులో క్లీన్ చేయించడం మంచిది. 

Also Read : ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేసే టిప్స్ ఇవే? మచ్చలేని, మెరుపు కోసం వీటిని ఫాలో అయిపోండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
పట్టభద్రుల ఎమ్మెల్సీ పోరు - కేసీఆర్ సోషల్ ఇంజనీరింగ్ స్కెచ్ - అభ్యర్థులపై కొత్త ప్లాన్?
YS Jagan BJP Support Delimitation Bill: అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
అసలైన పరీక్షకు సిద్ధమైన వైఎస్ జగన్ - డీలిమిటేషన్ బిల్లుకు మద్దతిస్తారా? బీజేపీని వ్యతిరేకిస్తారా?
Harish Rao: భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్, ఇదేనా మీ ప్రజాపాలన?: మాజీ మంత్రి హరీష్ రావు
IIT Tirupati Canadian GeoAI Agreement : IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
IIT తిరుపతి , వన్‌ ఇండియాతో కెనడా జియో ఏఐ సంస్థ ఒప్పందాలు.. విద్యార్థులకు ఏం లాభం?
Hyderabad Water Board: నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
నీళ్లు వృథా చేస్తే రూ.20 వేల ఫైన్.. వాటర్ కనెక్షన్ కట్, కఠిన చర్యలు
Vangaveeti Radhakrishna: విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. అనంతరం చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్.. చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్
Thella Kagitham Nakshatra : టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ గ్లామరస్ లుక్ - చూపులతోనే మ్యాజిక్ చేసిన తెల్లకాగితం హీరోయిన్
YS Jagan: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
ఏపీ స్థానిక ఎన్నికల్లో ఎన్నో అరాచకాలు..! కూటమి ప్రభుత్వం, ఎస్ఈసీపై వైఎస్ జగన్ ఆరోపణలు
Embed widget