అన్వేషించండి

Mirror Cleaning Tips : ఇంట్లో అద్దాన్ని శుభ్రం చేసే టిప్స్ ఇవే? మచ్చలేని, మెరుపు కోసం వీటిని ఫాలో అయిపోండి

Clean Mirror Without Streaks : గాజును లేదా అద్దాన్ని సులభంగా శుభ్రం చేయాలి.. మెరిపించాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ సింపుల్ టిప్ ఫాలో అయిపోండి. ఇది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. 

Cleaning Mirror Tips for Streak Free Shine : గదుల్లో, బాత్రూమ్‌ల్లో, క్లాజెట్​ల్లో అద్దాలు రెగ్యులర్​గా వినియోగిస్తాము. బాత్రుమ్​లో వినియోగించే అద్దంపై నీటి మరకలు, సబ్బు అవశేషాలు, ఆవిరి వంటి వాటి వల్ల అవి త్వరగా కాంతిహీనంగా, మసకగా మారిపోతాయి. చాలామంది ఈ మరకలను వదిలించడానికిపాత న్యూస్​పేపర్స్ వినియోగిస్తారు. అయితే కేవలం కాగితంతో అద్దం ఉపరితలాన్ని రుద్దడం మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. మరి అద్దం మచ్చలు లేకుండా, గీతలు లేకుండా మెరుపును పొందాలంటే ఎలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు చూసేద్దాం. 

మిర్రర్ క్లీనింగ్ టిప్స్,

అద్దం శుభ్రపరిచే ముందు ఒక స్ప్రే బాటిల్‌లో సమాన పరిమాణంలో నీరు, వైట్ వెనిగర్ కలపండి. ఈ ద్రావణాన్ని అద్దంపై స్ప్రే చేసి.. 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇది మురికి, నీటి మరకలు, మచ్చలను వదులు చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల హార్ష్ కెమికల్ క్లీనర్‌లపై ఆధారపడకుండా మరకలను సులభంగా వదిలించేయవచ్చు.

Also Read : వర్షాకాలంలో ఇంట్లో ఈ ప్రదేశాలను తప్పకుండా శుభ్రం చేయండి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే

న్యూస్​ పేపర్​తో ఎలా శుభ్రం చేయాలంటే.. 

అద్దంపై వెనిగర్ చల్లిన తర్వాత.. దానిని శుభ్రమైన, పొడి గుడ్డతో లేదా వార్తాపత్రికతో తుడవాలి. వార్తాపత్రికను సున్నితంగా వాడినప్పుడు.. అది అధిక తేమను పీల్చుకుని, గీతలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కాగితం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఉపరితలంపై అవశేషాలు మిగిలిపోకుండా ఉండేందుకు మరీ గట్టిగా రుద్దకూడదు. 

మొండి మరకల కోసం మ్యాజిక్ టిప్

అద్దాలపై మొండిగా, ఎండిపోయి పడిన మరకల కోసం, గోరువెచ్చని వైట్ వెనిగర్‌ను ఉపయోగించి చూడండి. దానిని మరకలు ఉన్న ప్రదేశాలపై స్ప్రే చేసి.. వెనిగర్‌లో ముంచిన పేపర్ టవల్‌ను మరకలపై ఉంచండి. సుమారు 10 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత ఉపరితలాన్ని మెల్లగా శుభ్రంగా తుడవండి. మొండి మరకలను శుభ్రం చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. 

మసకబారిన అద్దాల కోసం

కొన్ని గాజు ఉపరితలాలపై ఉండే తేలికపాటి మసకను తొలగించడానికి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. చాలా తక్కువ మొత్తంలో టూత్‌పేస్ట్‌ను తీసుకుని, ప్రభావిత ప్రాంతంపై రెండు నిమిషాల పాటు సున్నితంగా రుద్ది.. ఆ తర్వాత తడి గుడ్డతో తుడిచివేయండి. గరుకుగా ఉండే టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం లేదా అధిక ఒత్తిడి ఇవ్వడం మానుకోండి. ఎందుకంటే ఇది కొన్ని ఉపరితలాలపై గీతలు పడేలా చేయవచ్చు.

Also Read : వంటగదిలో చేతులు కాలిపోయాయా? వెంటనే ఇలా చేయండి.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

అద్దం మెరవాలంటే..

అద్దం మరింత శుభ్రంగా కనిపించడానికి.. నిమ్మరసాన్ని తెల్ల వెనిగర్‌తో కలిపి కొద్ది మొత్తంలో అద్దంపై రాయండి. ఈ ద్రావణం కొన్ని మరకలను, అవశేషాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత అద్దం మరింత స్పష్టంగా మెరవడానికి దానిని శుభ్రమైన, మృదువైన వస్త్రంతో క్షుణ్ణంగా తుడవాలి.

అద్దం ఎప్పుడు శుభ్రం చేయాలి?

అద్దాన్ని క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల నీటి మరకలు, సబ్బు అవశేషాలు, దుమ్ము పేరుకుపోకుండా నివారించవచ్చు. అద్దాన్ని ఎంత తరచుగా ఉపయోగిస్తారనే దానిపై ఆధారపడి.. వారానికి ఒకటి లేదా రెండుసార్లు శుభ్రపరచడం మంచిది. ఇలా చేయడం వల్ల దాని మెరుపు కాపాడుకోవచ్చు. మరీ గట్టిగా రుద్దడం మానుకోండి. గాజు ఉపరితలాన్ని రక్షించడానికి ఎల్లప్పుడూ మృదువైన వస్త్రాన్ని లేదా తగిన శుభ్రపరిచే పదార్థాన్ని ఉపయోగించండి.

Also Read :  కిచెన్ క్లీనింగ్ టిప్స్.. పండుగల సీజన్లో వంటగదిని మెరిసేలా చేసే 7 చిట్కాలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Supplements for Skin and Hair : చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
చర్మం మెరవాలన్నా.. జుట్టు ఒత్తుగా ఉండాలన్నా తీసుకోవాల్సిన 5 సప్లిమెంట్స్ ఇవే
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Afghani Green Chicken : అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
అఫ్గానీ గ్రీన్ చికెన్.. కొత్త రుచితో చికెన్ ట్రై చేయాలనుకుంటే బెస్ట్, టేస్టీ రెసిపీ ఇదే
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
Advertisement

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Royal Enfield Himalayan 750 వచ్చేస్తోంది.. క్రూజ్‌ కంట్రోల్‌, TPMS సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు
రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల్లో హైయెస్ట్‌ పవర్‌ ఉన్న బండి.. హిమాలయన్ 750 ఫీచర్లు రివీల్!
Embed widget