అన్వేషించండి

Kitchen Burns : వంటగదిలో చేతులు కాలిపోయాయా? వెంటనే ఇలా చేయండి.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు

Burn Injury First Aid : వంట చేసేటప్పుడు కాలిన గాయాలకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వేటిని ఫాలో అయితే ఇబ్బంది పడకుండా ఉంటారో ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చేతులు కాలినప్పుడు వెంటనే చల్లటి నీటిలో కనీసం 15 నిమిషాలు ఉంచాలి.
  • తేలికపాటి గాయాలకు కలబంద జెల్, తేనె వాడటం మంచిది.
  • కాలిన గాయాలకు టూత్‌పేస్ట్, వెన్న, నూనె అస్సలు పూయరాదు.
  • బొబ్బలు పగలగొట్టవద్దు, తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

Hand Burn Treatment at Home : వంటగదిలో కుకింగ్ చేసేటప్పుడు చేయి కాలడం సర్వసాధారణంగా జరుగుతుంది. కొన్నిసార్లు వేడి నూనె చిందవచ్చు.. కొన్నిసార్లు మరిగే నీళ్లు పడొచ్చు. లేదా వేడి పాత్ర వల్ల కూడా చేతులు కాలవచ్చు. అటువంటి పరిస్థితిలో.. భయపడకుండా వెంటనే కొన్ని సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కాలిన గాయం ఎంత త్వరగా నయం అవుతుందో.. మచ్చలు ఏర్పడతాయా లేదా అనేది గాయం అయినా కొన్ని నిమిషాల్లో మనం తీసుకునే చర్యల బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక్క నిమిషం తీసుకునే నిర్ణయం మచ్చలు పడకుండా, గాయం పెద్దది కాకుండా కాపాడుతుంది. మరి చేతులు కాలినప్పుడు ఏమి చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గాయం తీవ్రం కాకుండా.. మచ్చ పడకుండా ఉంటుందో చూసేద్దాం.

చేతిపై కాలితే చేయాల్సిన పనులు ఇవే

మెదాంత సంస్థ నివేదిక ప్రకారం.. కాలిన భాగాన్ని వెంటనే చల్లటి నీటిలో ఉంచాలి. ఇది మొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని. కనీసం 15-20 నిమిషాల పాటు దానిపై నీరు పోస్తూనే ఉండాలి. ఇది మంటను తగ్గిస్తుంది. చర్మానికి ఎక్కువ నష్టం జరగకుండా కాపాడుతుంది. అలా అని నేరుగా ఐస్ క్యూబ్ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది చర్మానికి మరింత హాని కలిగిస్తుంది.

కాలిన గాయం తేలికపాటిది అయితే.. చర్మం మాత్రమే ఎర్రగా మారితే.. మీరు ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో కలబంద జెల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది. చర్మాన్ని చల్లబరుస్తుంది. త్వరగా నయం అవ్వడానికి సహాయపడుతుంది. కాబట్టి అలోవెరా జెల్ రోజుకు రెండుసార్లు వాడటం మంచిది.

ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చా?

తేనెను కూడా మంచి ఇంటి నివారణిగా చెప్తారు. ఇది బ్యాక్టీరియా నుంచి రక్షించి.. గాయాలను నయం చేయడానికి సహాయపడుతుంది. అయితే దీనిని నేరుగా ఉపయోగించకుండా.. శుభ్రమైన బ్యాండేజ్‌పై వేసి కాలిన ప్రదేశంలో ఉంచండి. తద్వారా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గుతుంది. నొప్పి ఎక్కువగా ఉంటే, తేలికపాటి పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు. కాలిన భాగాన్ని వదులుగా ఉన్న బ్యాండేజ్‌తో కవర్ చేయండి. పెట్రోలియం జెల్లీని ఉపయోగించడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. గాయం త్వరగా ఎండిపోదు.

చేయకూడని తప్పులు ఇవే

చాలామంది సరైన అవగాహన లేక వంటగదిలో చేతులు కాలితే కొన్ని తప్పులు చేస్తారు. ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అలా చేయకూడని తప్పులు టూత్‌పేస్ట్ అప్లై చేయడం ఒకటి. అలాగే వెన్న లేదా నూనెను ఉపయోగించడం కూడా సరికాదు. ఎందుకంటే ఇవి వేడిని చర్మంలోనే ఉంచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి.

అలాగే కాలిన గాయాల మీద బొబ్బలు ఏర్పడితే వాటిని పగలగొట్టకూడదు. ఎందుకంటే ఇది గాయాన్ని మరింత పెంచుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించవచ్చు. అలాగే వైద్యుడిని సంప్రదించాలో గుర్తించడం కూడా ముఖ్యమే. కాలిన గాయం చాలా తీవ్రంగా ఉంటే.. బొబ్బలు పెద్దవిగా ఉంటే లేదా కాలిన భాగం చేతి కంటే పెద్దదిగా ఉంటే.. వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ముఖ్యంగా ముఖం, చేతులు, కాళ్లపై కాలిన గాయాలు అయితే నిర్లక్ష్యం చేయకండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Healthy Millet Khichdi: మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
మిల్లెట్స్‌తో ఆరోగ్యకరమైన, రుచికరమైన కిచిడీ చేస్తే పిల్లలు లొట్టలేసుకొని తింటారు! 
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Potato Boiling Guide: ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
ప్రెషర్ కుక్కర్‌లో బంగాళాదుంపలు ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి?  
Gas Burner Cleaning: మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  
మూసుకుపోయిన గ్యాస్ బర్నర్ రంధ్రాలు నిమిషాల్లో శుభ్రం చేసే చిట్కాలు ఇవే!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
Kohli Milestones Show: కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
కోహ్లీ కెరీర్ లో మైండ్ బ్లాకింగ్ ట్రిపుల్ సెంచరీ మార్క్.. స‌చిన్, ద్ర‌విడ్ స‌ర‌స‌న కింగ్..
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Embed widget