అన్వేషించండి

H-1B Visa Pause: అమెరికాలో హెచ్‌-1బి వీసాల జారీకి బ్రేక్? భారతీయ టెక్కీలకు బిగ్ షాక్! పూర్తి వివరాలు ఇవే!

H-1B Visa:అమెరికాలో హెచ్‌-1బి వీసా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ఎండ్‌ హెచ్‌-1బి వీసా అబ్యూస్‌ యాక్ట్ 2026ను ప్రవేశ పెట్టారు. ఇది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • H-1B వీసా వ్యవస్థలో మార్పులకు కొత్త బిల్లు ప్రతిపాదించబడింది.
  • వీసా జారీ మూడేళ్ల పాటు నిలిపివేసి, నిబంధనలు కఠినతరం చేయాలని సూచన.
  • వార్షిక వేతన పరిమితి, ఎంపిక విధానంలో మార్పులు ప్రతిపాదించారు.
  • అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలే తమ లక్ష్యమని బిల్లు ప్రతిపాదకులు తెలిపారు.

H-1B Visa Pause:అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే లక్షలాది మంది విదేశీయులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు భారీ షాక్ ఇచ్చే వార్త ఇది. హెచ్‌1బి వీసా వ్యవస్థలో మార్పులు చేయాలనే ప్రతిపాదన చట్ట సభల ముందుకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుచరులు, రిపబ్లికన్ చట్ట సభ సభ్యులు సంయుక్తంగా ఎండ్ హెచ్‌ -1 బి వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026 అనే కొత్త బిల్లును ప్రతిపాదించారు. అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తీసుకువస్తున్నట్టు వారు పేర్కొన్నారు. 

రూల్స్ కఠిన తరం చేయాలని బిల్లు 

రిపబ్లికన్ ప్రతినిధి ఎలీ క్రేన్ నేతృత్వంలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు, ప్రస్తుత హెచ్‌-1బి వీసా విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కోరుతోంది. ఈ ప్రతిపాదన ప్రకారం అమెరికా ప్రభుత్వం హెచ్‌-1బి వీసాల జారీ మూడేళ్ల పాటు పూర్తిగా నిలిపివేయాలి. ఈ విరామ సమయంలో వీసా వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, మరింత కఠినమైన నిబంధనలతో తిరిగి ప్రారంభించాలని బిల్లులో పేర్కొన్నారు. 

Also Read: దుబాయ్ వీసా రిజెక్ట్ కాకుండా ఉండాలంటే… తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

బిల్లులో భారీ మార్పులు ప్రతిపాదించిన సభ్యులు  

ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికా వీసా రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఏటా ఇస్తున్న 65వేల హెచ్-1బి వీసాల పరిమితిని ఏకంగా 25వేలకు తగ్గించాలని ప్రతిపాదించారు. వీసా పొందే అభ్యర్థి కనీస వార్షిక వేతనం రెండు లక్షల డాలర్లు ఉండాలి. అంటే సుమారు 1.6 కోట్లు అన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్న వేతన ప్రమాణాల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం అనుసరిస్తున్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతిని రద్దు చేసి, అత్యధిక వేతనం ఇచ్చే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశ పెట్టాలని ఈ బిల్లు కోరుతోంది. హోచ్‌-1బి వీసాదారులు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడాన్ని నిషేధించడంతోపాటు  హెచ్‌-1బి నుంచి నేరుగా గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియను కూడా అడ్డుకోవాలని బిల్లులో పేర్కొన్నారు. విద్యార్థులకు ఎంత మేలు చేసే, ఆప్షనల్ ప్రాక్టికల్‌ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా రద్దు చేయాలని ప్రతిపాదించారు. 

Also Read: 'గోల్డ్ కార్డ్' వీసా కార్యక్రమం ప్రారంభించిన ట్రంప్! అమెరికన్ పౌరసత్వం పొందడానికి 10 లక్షల డాలర్లు!

అమెరికా ఉద్యోగులను రక్షించడానికే అంటున్న సభ్యులు 

అమెరికాలో పెద్ద కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనానికి దొరికే విదేశీ కార్మికులను తీసుకువస్తూ అర్హులైన అమెరికన్లను ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నాయని రిపబ్లికన్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కష్టపడి పని చేసే పౌరుల కోసం పని చేయాలి కానీ, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కాదు అని ఎలీ క్రేన్ వ్యాఖ్యానించారు. పాల్ గోసర్ వంటి ఇతర సభ్యులు కూడా ఈ వ్యవస్థను స్కామ్ అని అభివర్ణిస్తూ, అమెరికన్లు ఉద్యోగాలను రక్షించడమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. 

ఆమోదం పొందే ఛాన్స్ ఉందా?

ప్రస్తుతానికి ఇది కేవలం ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది అమెరికన్ కాంగ్రెస్‌లోని రెండు సభల్లో నెగ్గి, అధ్యక్షుడి ఆమోదం పొందాల్సి ఉంటుంది. 2026 నాటికి ఈ మార్పులను తీసుకురావాలని ప్రతిపాదించినప్పటికీ దీనిపై అమెరికా రాజకీయాల్లో, పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉంది. 

భారతీయ టెక్కీలపై తీవ్ర ప్రభావం

చారిత్రాత్మకంగా హెచ్‌1బి వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారతీయులే. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్ రంగాల్లో నిపుణులు ఈ విసాపైనే ఆధారపడి ఉంటారు. కనీస వేతనం 2 లక్షల డాలర్లుగా నిర్ణయిస్తే ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు అమెరికా వెళ్లడం దాదాపు అసాధ్యమవుతుంది. అలాగే థర్డ్ పార్టీ స్టాఫింగ్ ఏజెన్సీల ద్వారా ఉద్యోగాలు పొందడానికి కూడా ఈ బిల్లు నిషేధిస్తోంది. ఇది భారతీయ ఐటీ సేవల సంస్థలకు పెద్ద దెబ్బ కానుంది. 

Frequently Asked Questions

H-1B వీసా వ్యవస్థలో ఎలాంటి మార్పులు ప్రతిపాదించారు?

H-1B వీసాల జారీని మూడేళ్లపాటు నిలిపివేయాలని, ఏటా ఇచ్చే వీసాల సంఖ్యను 65,000 నుండి 25,000కి తగ్గించాలని ప్రతిపాదించారు.

కొత్త H-1B వీసా బిల్లు ప్రకారం కనీస వార్షిక వేతనం ఎంత ఉండాలి?

కొత్త బిల్లు ప్రకారం, వీసా పొందే అభ్యర్థి కనీస వార్షిక వేతనం రెండు లక్షల డాలర్లు (సుమారు 1.6 కోట్లు) ఉండాలి.

H-1B వీసా దరఖాస్తుదారుల ఎంపిక పద్ధతిలో ఎలాంటి మార్పు ప్రతిపాదించారు?

ప్రస్తుత కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసి, అత్యధిక వేతనం ఇచ్చే అభ్యర్థులకే ప్రాధాన్యత ఇచ్చే వేతన ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.

ఈ బిల్లు H-1B వీసాదారుల కుటుంబ సభ్యులకు మరియు గ్రీన్ కార్డ్ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి మార్పులు సూచిస్తుంది?

H-1B వీసాదారులు తమ కుటుంబ సభ్యులను తీసుకురావడాన్ని నిషేధించాలని, అలాగే H-1B వీసా నుండి నేరుగా గ్రీన్ కార్డ్ పొందే ప్రక్రియను అడ్డుకోవాలని బిల్లులో పేర్కొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget