అన్వేషించండి

Donald Trump China Visit: అమెరికా, చైనా సూపర్ పవర్స్.. చైనా రెండో స్థానంలో ఉంటుంది- డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Donald Trump China Tour | చైనాతో తమకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని, తమ రెండు దేశాలు సూపర్ పవర్స్ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, చైనా సూపర్ పవర్స్, అగ్రస్థానంలో తామే ఉన్నాం: ట్రంప్
  • చైనాతో సంబంధాలు మెరుగుపడ్డాయి, సైనికంగా శక్తివంతం: ట్రంప్
  • ఇరాన్ నియంత్రణలో ఉన్నాం, వారితో ఒప్పందం లేదా సర్వనాశనం: ట్రంప్
  • చైనా పర్యటనకు వెళ్తున్నాను, అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చలు: ట్రంప్

వాషింగ్టన్: చైనా పర్యటనకు వెళ్లే ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా సూపర్ పవర్స్ అని, అగ్రస్థానంలో తాము ఉందగా.. చైనాది రెండో స్థానమని వ్యాఖ్యానించారు. చైనాతో మా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, సైనిక పరంగా తామే అత్యంత శక్తివంతమైన దేశాలమని స్పష్టం చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తన రిలేషన్ గొప్పగా ఉందని, అలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. చైనాతో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు. ఇరాన్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, మేం వారితో ఒప్పందమైనా చేసుకుంటాం, లేదా వారు సర్వనాశనం అయిపోతారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

2017 తరువాత తొలిసారి..

ఇరాన్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ నేటి నుంచి మే 15 వరకు మూడు రోజులపాటు చైనాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడి ఈ పర్యటనలో ఇరాన్‌తో నెలకొన్న తాజా పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ సాఫీగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2017 తర్వాత ట్రంప్ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి బృందంలో టిమ్ కుక్, టెస్లా, స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్ మస్క్‌తో పాటు బ్లాక్‌రాక్, బ్లాక్‌స్టోన్, బోయింగ్, కార్గిల్, సిటీ, సిస్కో, కోహెరెంట్, జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఏరోస్పేస్, గోల్డ్‌మన్ సాక్స్, మాస్టర్ కార్డ్, మెటా, ఇల్యూమినా, మైక్రాన్, క్వాల్కమ్, వీసా వంటి సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు.

ట్రంప్ ఏమన్నారు?
ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో ఇలా పోస్ట్ చేశారు. ‘నేను చైనా పర్యటన కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. చైనా ఓ అద్భుతమైన దేశం. అధ్యక్షుడు జిన్ పింగ్ నాయకత్వంలో ముందుకు సాగుతోంది. మా రెండు దేశాలకు చాలా మంచి జరుగుతుందని’ అన్నారు. ట్రంప్‌తో పాటు అమెరికాకు చెందిన పలువురు ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఈ పర్యటనలో భాగం కానున్నారు. అమెరికాకు చెందిన 17 కంపెనీల కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు ట్రంప్‌తో పాటు వెళ్తారని వైట్ హౌస్ అధికారి తెలిపారు.

వైట్ హౌస్ జాబితాలో ఉన్న ఎగ్జిక్యూటివ్‌లలో బోయింగ్‌కు చెందిన కెల్లీ ఆర్ట్‌బర్గ్, బ్లాక్‌రాక్‌కు చెందిన లారీ ఫింక్, బ్లాక్‌స్టోన్‌కు చెందిన స్టీఫెన్ స్క్వార్జ్‌మాన్, కార్గిల్‌కు చెందిన బ్రియాన్ సైక్స్, సిటీకి చెందిన జేన్ ఫ్రేజర్, సిస్కోకు చెందిన చక్ రాబిన్స్, కోహెరెంట్‌కు చెందిన జిమ్ ఆండర్సన్, జీఈ ఏరోస్పేస్‌కు చెందిన హెచ్. లారెన్స్ కల్ప్, గోల్డ్‌మన్ సాక్స్‌కు చెందిన డేవిడ్ సోలమన్, మాస్టర్‌కార్డ్‌కు చెందిన మైఖేల్ మిబాక్, ఇల్యూమినాకు చెందిన జాకబ్ థైసెన్, మెటాకు చెందిన దినా పావెల్ మెక్‌కార్మిక్, మైక్రాన్‌కు చెందిన సంజయ్ మెహ్రోత్రా, క్వాల్కమ్‌కు చెందిన క్రిస్టియానో ​​అమోన్, వీసాకు చెందిన ర్యాన్ మెక్‌ఇనెర్నీ ఉన్నారు.

జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు
సోమవారం మీడియాతో మాట్లాడుతూ చైనా అధ్యక్షుడిపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. తన చైనా పర్యటనలో తైవాన్, ఇంధన భద్రత అతిపెద్ద అంశాలుగా ఉండాలని ఆశించారు. చైనాతో తన ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ట్రంప్ చెప్పారు. గత అమెరికా ప్రభుత్వాలు చైనా తమను వాడుకునేలా అవకాశమిచ్చాయని, ఇప్పుడు చాలా మార్పు వచ్చిందన్నారు. 

‘మేము చాలా వ్యాపారం చేస్తున్నాం. అది చాలా తెలివైన వ్యాపారం. అమెరికా గత అధ్యక్షుల సమయంలో చాలా ఏళ్లపాటు మమ్మల్ని వాడుకున్నారు. ఇప్పుడు మేం చైనాతో ఏ ఇబ్బంది లేకుండా వర్క్ చేస్తున్నామని తెలిపారు. జీ జిన్‌పింగ్‌ను ఎంతగానో గౌరవిస్తాను. ఆయన నన్ను గౌరవిస్తారని ఆశిస్తున్నా అన్నారు. జో బైడెన్ హయాంలో అమెరికాకు సంబంధాలు బాగోలేవని, తక్కువగా ట్రీట్ చేసేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Frequently Asked Questions

అమెరికా, చైనా దేశాల మధ్య సంబంధాల గురించి ట్రంప్ ఏమన్నారు?

అమెరికా, చైనా సూపర్ పవర్స్ అని, అమెరికా అగ్రస్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉందని ట్రంప్ అన్నారు. చైనాతో తమ సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని, సైనిక పరంగా తామే అత్యంత శక్తివంతమైన దేశాలని స్పష్టం చేశారు.

చైనా పర్యటనకు ట్రంప్ తో పాటు ఎవరెవరు వెళ్తున్నారు?

ట్రంప్ తో పాటు టిమ్ కుక్, ఎలాన్ మస్క్, బోయింగ్, బ్లాక్‌రాక్, బ్లాక్‌స్టోన్, కార్గిల్, సిటీ, సిస్కో, కోహెరెంట్, జనరల్ ఎలక్ట్రిక్ (GE) ఏరోస్పేస్, గోల్డ్‌మన్ సాక్స్, మాస్టర్ కార్డ్, మెటా, ఇల్యూమినా, మైక్రాన్, క్వాల్కమ్, వీసా వంటి సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు వెళ్తున్నారు.

ఇరాన్ విషయంలో అమెరికా వైఖరి ఏమిటి?

ఇరాన్ పూర్తిగా తమ నియంత్రణలో ఉందని, వారితో ఒప్పందమైనా చేసుకుంటామని, లేదంటే వారు సర్వనాశనం అయిపోతారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

జీ జిన్‌పింగ్‌పై ట్రంప్ ప్రశంసలు ఎందుకు కురిపించారు?

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో తన రిలేషన్ గొప్పగా ఉందని, అలాగే కొనసాగుతుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో చైనా ముందుకు సాగుతుందని, ఇరు దేశాలకు మంచి జరుగుతుందని అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
US Iran Peace Deal: ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల పరిహారం..! యుద్ధంతో డొనాల్డ్ ట్రంప్ ఏం సాధించారు?
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Strait of Hormuz opens after Iran war: యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !
Advertisement

వీడియోలు

Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Ravi Shastri Explains Virat Dual Personality | విరాట్ అసలు నైజం బయటపెట్టిన రవిశాస్త్రి
Vaibhav Sooryavanshi Success Story | వైభవ్ సక్సెస్ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ
Vaibhav about Fight With Sri Lanka Players | లంక ప్లేయర్‌తో గొడవపై వైభవ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jnaneshwari Missing Case Tuni:జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
జ్ఞానేశ్వరి కోసం పోలీసుల బొమ్మల వేట! తునిలో ఏం జరుగుతుంది?
Strait of Hormuz: హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
హర్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది ! డీల్ తర్వాత తగ్గిన రాకపోకలు.. ట్రంప్ అంచనాలు తలకిందులు 
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం పిడుగుల వర్షం! జాగ్రత్త పడాల్సిన జిల్లాలు ఇవే! 
IPL Business Update: ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
ఆర్సీబీ కప్ కొడితే ఆ రేంజే వేరు.. ఐపీఎల్ 2026 వ్యూయర్‌షిప్ రికార్డుల వేట, మోస్ట్ వాచ్డ్ సీజ‌న్ గా 2026వ ఎడిష‌న్ రికార్డు
PM Modi Investment Scheme Fact Check: ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
ప్రతి నెలా రూ. 30 లక్షలు సంపాదించే ఛాన్స్.. ప్రధాని మోదీ పేరిట వైరల్ అవుతున్న వీడియోపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్
Visakhapatnam Techie Gayatri Death: ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
ముస్సోరిలో విశాఖ యువతి అనుమానాస్పద మృతి - భర్త కూడా అదే రూమ్‌లో - మద్యం తాగడమే కారణమా?
Wife Killed Husband: భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
భర్తకు గుండెజబ్బు - శారీరక సుఖం కోసం భార్య ఘాతుకం! ప్రియుడి ఒక్క మెసేజ్‌తో క్రైమ్ స్టోరీ లీక్!
Adilabad Airport: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ముందడుగు! డిఫెన్స్‌కు 1,500 ఎకరాలు.. రన్‌వే విస్తరణకు మరో 80 ఎకరాలు సేకరణకు చర్యలు!
Embed widget